English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

మీ డ‌బ్బును మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెడితే ఉప‌యోగాలు

Written By:
Subscribe to GoodReturns Telugu

ఉద్యోగుల సంపాద‌న ఏడాదికి మ‌హా అంటే స‌గ‌టున 10 నుంచి 50 శాతం పెరుగుతుంది. మార్కెట్లో ధ‌ర‌లు మాత్రం అలా కాదు. ఏటా కొన్ని ఉత్ప‌త్తుల ధ‌ర‌లు రెండింత‌లు అవుతుంటాయి. ఎల‌క్ట్రానిక్స్ గూడ్స్ ఈ మ‌ధ్య త‌ర‌చూ మార్చ‌డం కూడా మ‌ధ్య త‌ర‌గ‌తికి అలవాటైంది. దీంతో ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం ప్ర‌తి కుటుంబంపై ప‌డుతుంది. మ‌న సంపాద‌న అంత స్థాయిలో పెర‌గ‌ద‌ని అంద‌రికీ తెలుసు. అప్పుడు చేయాల్సింది మ‌నం సంపాదిస్తున్న దాన్ని బ‌ట్టి ఖ‌ర్చే చేయ‌డం అల‌వాటు చేసుకోవ‌డం. అయిన‌ప్ప‌టికీ డ‌బ్బుకు ఇబ్బంది ప‌డుతుంటారు. అలాంట‌ప్పుడు క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల‌ను ఆశ్రయించాలి. క్ర‌మ ప‌ద్ద‌తిలో ఎక్కువ రోజులు పెట్టుబ‌డి పెడుతూ అధిక రాబ‌డులు రావాల‌ని కోరుకుంటారు. అయితే అంద‌రూ స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్ట‌డం క‌ష్టం. మ‌ధ్య‌స్థ స్థాయి రిస్క్ తీసుకుని మ‌ధ్య కాలం నుంచి దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డులు రావాల‌ని ఆశిస్తారు. ఇలాంటి వారు మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ఆశ్రయిస్తే మేలు. ఈ నేప‌థ్యంలో మ్యూచువ‌ల్ పండ్ పెట్టుబ‌డుల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను తెలుసుకుందాం.

1. వృత్తి నిపుణుల ద్వారా నిర్వ‌హ‌ణ‌

1. వృత్తి నిపుణుల ద్వారా నిర్వ‌హ‌ణ‌

మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బును సరియైన పద్దతిలో నిర్వ‌హించ‌డానికి అపారమైన అనుభవం , నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్లు ఉంటారు. వారికి సహాయంగా మీ ఇన్వెస్ట్మెంట్ చూడాటానికి ఇత‌ర స‌భ్యులు కూడా ఉంటారు. వారు ఈక్విటీ ఫండ్స్ మరియు డేట్స్ ఫండ్స్ లలో ఇన్వెస్ట్ చేయడానికి ముందు రీసేర్చీ చేసి పూర్తీ అవగాహన తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు.మీరు మ్యూచవల్ ఫండ్స్ గత చరిత్ర ను ఇంతవరకు పరిశీలించిన వారు స్థిరమైన రాబడిని అందిస్తున్నారు.

2. పెట్టుబ‌డుల‌ను వివిధ చోట్ల పెడ‌తారు

2. పెట్టుబ‌డుల‌ను వివిధ చోట్ల పెడ‌తారు

మీ ఫోర్ట్ ఫోలియోలో డైవరిఫికేషన్ అనేది మీ పెట్టుబడికి రక్షణగాను , దానికి స్థిరత్వం ఇచ్చేదిగా ఉంటుంది.ఫండ్ మేనేజర్ మీ దగ్గర నుండి సేకరించిన డబ్బును వివిధ రకాల స్టాక్స్ మరియు సేక్యురిటిలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ వైవిధ్యమైన పెట్టుబడి ఇన్వెస్టర్స్ కు మంచి రాబడి అందిస్తుంది. అదే మీరు స్వయంగా ఇన్వెస్ట్ చేస్టే ఈ వైవిధ్యమైన పెట్టుబడి చేయడం మీకు సాధ్యం కాకపోవచ్చు. అంతే కాకుండా కొన్ని సమయాలలో మీ దగ్గర ఉన్న చిన్న మొత్తం ద్వారా ఇది అసలే సాధ్యం కాదు. కాని మ్యూచవల్ ఫండ్స్ కొంత మొత్తం ద్వారా కూడా సాధ్యం అవుతుంది.

3. సుల‌భ‌త‌ర పెట్టుబ‌డి మార్గం

3. సుల‌భ‌త‌ర పెట్టుబ‌డి మార్గం

మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఎంతో సులభం . మీరు మ్యూచువల్ ఫండ్ పథకాన్ని నిపుణుడి సహాయంతో ఎన్నుకొని ,దరఖాస్తు ఫారాన్ని నింపి ,వారి పేరు మీదా చెక్కు జారీ చేసి రావడమే .ఇది మొత్తం రెండు నిమిషాల పని . అదే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ తిరిగి తీసుకోవడం కూడా చాలా సులభం.

 4. రాబ‌డి తీరు

4. రాబ‌డి తీరు

మ్యూచువల్ ఫండ్స్ లో మధ్య కాలం నుండి దీర్ఘ కాలం కొరకు ఇన్వెస్ట్ చేసినచో మంచి రాబడి అందిస్తాయి.ఎందుకంటే వారు వివిధ పథకాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి.

5. త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ రాబ‌డి

5. త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ రాబ‌డి

మీరు ఎప్పుడు అయినా ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో వెళ్ళిన దానికంటే మీ స్వంత వాహనంలో వెళ్ళితే అధిక ఖర్చు ఏ విధంగా అవుతుందో అదే విధంగా ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్ పథకాలలో కొన్ని వేల మంది ఇన్వెస్ట్ చేయడం వలన ఫండ్ నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. దానితో మీకు కూడా తక్కువ ఖర్చు అవుతుంది.

6. కావాల్సిన‌ప్పుడు వెన‌క్కు తీసుకోవ‌డం

6. కావాల్సిన‌ప్పుడు వెన‌క్కు తీసుకోవ‌డం

మ్యూచువల్ ఫండ్స్ పథకాలలో నుండి మీరు ఎప్పుడు కావలి అంటే అప్పుడు ఉపసంహరించుకోవచ్చు. మీరు ఉపసంహరణ దరఖాస్తూ సంతకం చేసి ఇచ్చిన రెండూ మూడు రోజులలో మీ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఒక వేళ ప్రతేకంగా ఆ పథకానికి లాక్ ఇన్ పిరియడ్ , టాక్స్ సేవింగ్ పథకం ఐతే మాత్రం సాధ్యం కాదు. ఓపెన్ ఎండెడ్ పథకాలనుండి ఎప్పుడైనా బయటకు రావచ్చు. క్లోజ్ ఎండెడ్ పథకాల యూనిట్స్ ని స్టాక్ ఎక్సేంజీ లో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. మీకు టాక్స్ సేవింగ్ అవసరమైతే తప్ప లేనిచో టాక్స్ సేవింగ్ పథకాల వైపు వెళ్ళవద్దు.

7. పార‌ద‌ర్శ‌క‌మైన మ‌దుపు

7. పార‌ద‌ర్శ‌క‌మైన మ‌దుపు

పారదర్శకత అనేది మ్యూచువల్ ఫండ్స్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం .ఒక ఇన్వెస్టర్ గా మీ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబడినది , ప్రస్తుతం దాని విలువ ఎంత ఉన్నది మొదలగు వివరాలు మీకు క్రమం తప్పకుండా తెలియచేయబడతాయి.

 8. ప‌థ‌కాల ఎంపిక మీ చేతిలోనే...

8. ప‌థ‌కాల ఎంపిక మీ చేతిలోనే...

మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా , మీరు తీసుకొనే రిస్కు స్వభావానికి అనుగుణంగా , మీరు నిర్ణయించుకున్న నిర్ణీత కాలానికి అనుగుణంగా , మీ అవసరాలకు అనుగుణంగా ,మీరు వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంచుకొనే అవకాశం కలదు. మీకు ఈక్వీటీ మార్కట్ , డేట్ మార్కెట్ , మనీ మార్కెట్ , ఈ టి ఫ్స్ , గోల్డ్ ఈ టి ఫ్స్, టాక్స్ సేవింగ్ , ఇలా వివిధ రకాల పథకాలు మీకు అందుబాటులో ఉంటాయి.

9. క్ర‌మ‌బ‌ద్ద‌మైన వ్య‌వ‌స్థ‌

9. క్ర‌మ‌బ‌ద్ద‌మైన వ్య‌వ‌స్థ‌

మీ అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా సేబీ వద్ద రిజిస్టర్ కాబడి , సెబీ నిబందనల ప్రకారం పనిచేయబడతాయి. ఈ మ్యూచవల్ ఫండ్స్ ను సేబీ రెగ్యులర్ గా మానిటర్ చేస్తుంది.

10. ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

10. ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా టాక్స్ మినహాయింపులు పొందవచ్చు. ఈ మినహాయింపులు సమయానుకూలంగా మారుతుంటాయి. మనం దీని గురించి మ‌ర‌రో క‌థ‌నంలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ గురించి ప్ర‌తి ఉద్యోగి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విష‌యాలు

Read more about: mutual funds, investments
English summary

benefits of Investing in mutual funds in India

Advantages of investing in Mutual funds under professional management. Read about mutual fund investments benefits
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns