సిప్ మార్గంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు 7 ఉత్తమ ఎస్‌బీఐ మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాలు

వాటిలో మంచి రాబ‌డులు వ‌చ్చిన కార‌ణంగానే మేము ఎస్‌బీఐ మ్యూచువ‌ల్ ఫండ్ల గురించి ఇక్క‌డ ఇస్తున్నాం. ఇక్క‌డ క‌నీస మొత్తం రూ.500 - రూ.1000 నుంచి మొద‌లుకొని నెల‌వారీ పెట్టుబ‌డులు పెట్టొచ్చు. ఇందులో డెట్‌,

గ‌త సంవ‌త్స‌ర కాలంగా ఎస్బీఐ మ్యూచువ‌ల్ ఫండ్లు 35% రాబ‌డిని ఇస్తున్నాయి. చాలా ఫండ్లు గ‌త ఏడాది కాలంలో మిగిలిన అన్ని ర‌కాల పెట్టుబ‌డుల కంటే మంచి ప‌నితీరును క‌న‌బ‌రుస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకు డిపాజిట్ల కంటే ఇవి బాగా ఉన్నాయి.

వాటిలో మంచి రాబ‌డులు వ‌చ్చిన కార‌ణంగానే మేము ఎస్‌బీఐ మ్యూచువ‌ల్ ఫండ్ల గురించి ఇక్క‌డ ఇస్తున్నాం. ఇక్క‌డ క‌నీస మొత్తం రూ.500 - రూ.1000 నుంచి మొద‌లుకొని నెల‌వారీ పెట్టుబ‌డులు పెట్టొచ్చు. ఇందులో డెట్‌, ఈక్విటీ ఫండ్లు రెండూ ఉంటాయి. అలాంటి ఉత్త‌మ మంచి రాబ‌డులు ఇచ్చే ఎస్‌బీఐ మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ ప‌థ‌కాల గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.

 1. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్‌

1. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్‌

ఎస్‌బీఐ సంస్థ నుంచి వ‌చ్చిన అతి పెద్ద బ్లూ చిప్ ఫండ్ ప‌థ‌కం ఇది. దీని కింద దాదాపు రూ.16,480 కోట్ల ఆస్తులున్నాయి. క్రిసిల్ ఈ ఫండ్‌కు 1 రేటింగ్ ఇచ్చింది.

ఈ ఫండ్ గ‌త ఏడాది కాలంలో 23.53% రాబ‌డినిచ్చింది.

మూడు సంవ‌త్స‌రాల కాలంలో 12.40% రాబ‌డిని ఇచ్చింది.

ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, హెచ్‌పీసీఎల్ వంటి కంపెనీలు ఉన్నాయి.

వ్య‌క్తులు క‌నీస సిప్ మొత్తాన్ని రూ.500 తో ప్రారంభించేందుకు వీలుంది. మొత్తం క‌నీస పెట్టుబ‌డి రూ.5000 పెట్టాలి.

ఈ సిప్ ప్ర‌స్తుత ఎన్ఏవీ గ్రోత్ ప్లాన్‌లో రూ. 37.75గా ఉండ‌గా, డివిడెండ్ ప్లాన్లో రూ.21.48గా ఉంది.

 2. ఎస్బీఐ మాగ్న‌మ్ ఈక్విటీ

2. ఎస్బీఐ మాగ్న‌మ్ ఈక్విటీ

ఈ ఫండ్ ఒక లార్జ్ క్యాప్ ఫండ్‌. దీని కింద దాదాపు రూ.2171 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

ఎస్బీఐ మొత్తం ఫండ్ల‌లో చూస్తే ఇందులో అంత రాబ‌డి రాక‌పోయినా, దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది.

మూడేళ్ల కాలానికి 8.48% రాబ‌డుల‌ను, 5 ఏళ్ల కాలానికి 14.24% రాబ‌డుల‌ను ఇచ్చింది.

ప్ర‌స్తుతం వ‌డ్డీ రేట్లు త‌క్కువ ఉన్న క్ర‌మంలో ఎఫ్‌డీల‌ను ఆశ్ర‌యించ‌డం కంటే ఇది చాలా బెట‌ర్.

ఈ ఫండ్ హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ వంటి వాటిల్లో పెట్టుబ‌డి పెట్టింది.

ఎస్బీఐ మాగ్న‌మ్ ఈక్విటీ ఫండ్లో క‌నీసం ప్ర‌తిసారి రూ.500, మొద‌టి సారి సిప్ రూ.1000 తో పెట్టుబ‌డి ప్రారంభించ‌వ‌చ్చు.

ఈ ఫండ్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు సిప్ మార్గంలో క‌నీసం ఫండ్ యాజ‌మాన్యానికి 12 చెక్కులు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ(ఎన్ఏవీ) గ్రోత్ ప్లాన్లో రూ.89.51గా ఉండగా, డివిడెండ్ ఆప్ష‌న్లో రూ.31.26గా ఉంది.

 3. ఎస్బీఐ కాంట్రా ఫండ్‌

3. ఎస్బీఐ కాంట్రా ఫండ్‌

ఎస్‌బీఐ కాంట్రా ఫండ్ విభిన్నంగా పెట్టుబ‌డులు పెడుతుంది.

ఎక్కువ మంది ఆసక్తి చూప‌ని స్టాక్‌ల్లో ఈ ఫండ్ పెట్టుబ‌డులు పెడుతుంది. అయితే ఫండ్ మెంట‌ల్‌గా బ‌లంగా ఉన్న కంపెనీలే.

గ‌త ఏడాది కాంలో ఈ ఫండ్ 29% రాబ‌డుల‌ను ఇచ్చింది.

ఈ ఫండ్ డైవ‌ర్సిఫైడ్ ఈక్విటీ మ‌ల్టీ క్యాప్ ఫండ్‌.

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, దివీస్ ల్యాబ్‌, ఎల్జీ ఎక్విప్‌మెంట్, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ సంస్థ‌ల్లో ఈ ఫండ్ పెట్టుబ‌డుల‌ను పెట్టింది.

రూ. 500 మొద‌లుకొని సిప్ పెట్టుబ‌డుల‌ను ప్రారంభింవ‌చ్చు.

అయితే మొద‌టిసారి మాత్రం రూ.5000 పెట్టుబ‌డి పెట్టాలి.

గ్రోత్ ప్లాన్లో ఈ ఫండ్ ఎన్ఏవీ రూ.118.37గా ఉంది.

 4. ఎస్బీఐ మాగ్న‌మ్ మిడ్ క్యాప్ ఫండ్

4. ఎస్బీఐ మాగ్న‌మ్ మిడ్ క్యాప్ ఫండ్

దీర్ఘ‌కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఎస్‌బీఐ నుంచి వ‌చ్చిన ఉత్త‌మ ఫండ్ల‌లో ఇదీ ఒక‌టి.

ఈ ఫండ్ ఐదేళ్ల కాలంలో 26.21% వార్షిక రాబ‌డుల‌నిచ్చింది. ఇది చాలా మంచి ప‌నితీరు.

గ‌త ఏడాది కాలంలో ఈ ఫండ్ 9.57% రాబ‌డుల‌నిచ్చింది.

మిడ్ క్యాప్ ఫండ్ల‌లో ఉన్న‌ప్ప‌టికీ, ఇన్వెస్ట‌ర్ల‌కు రిస్క్ సామ‌ర్థ్యం ఉంటే ఇది ఒక ఉత్త‌మ ఫండ్‌.

ఫండ్ ఎన్ఏవీ గ్రోత్ ప్లాన్ నందు రూ. 83.45, డివిడెండ్ ప్లాన్ నందు 35.98 రూపాయ‌లుగా ఉంది.

Carborundum, స్ట్రైడ్స్ శాసూన్, మ‌న్ ప‌సంద్ బెవ‌రేజెస్, రామ్ కో సిమెంట్స్ వంటి కంపెనీల్లో ఎక్కువ‌గా ఈ ఫండ్ పెట్టుబ‌డులు పెట్టింది.

పెట్టుబ‌డిదారులు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే మిడ్ క్యాప్ ఫండ్లు కాస్త రిస్క్ తో కూడుకున్న‌వి. కాబ‌ట్టి రాబ‌డుల ప‌నితీరులో హెచ్చుత‌గ్గులు వ‌స్తుంటాయి. అందుకే అవ‌స‌రాల‌ను, ఆర్థిక స్థితిని బాగా బేరీజు వేసుకుని ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేముందు బాగా ఆలోచించి ముందుకెళ్లాల‌.

5. ఎస్బీఐ షార్ట్ ట‌ర్మ్ డెట్ ఫండ్

5. ఎస్బీఐ షార్ట్ ట‌ర్మ్ డెట్ ఫండ్

డెట్ ప‌థ‌కాలు ఇష్ట‌ప‌డే వారికి ఎస్బీఐ షార్ట్ ట‌ర్మ్ డెట్ ఫండ్ చాలా బాగా ఉంటుంది.

ఈ ఫండ్ పైన తెలిపిన వాటి లాగా కాకుండా కేవ‌లం డెట్ మార్గంలోనే పెట్టుబ‌డులు పెడుతుంది.

అంటే ఈ ఫండ్ ఎక్కువ సొమ్మును ప్ర‌భుత్వ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెడుతుంది.

ఈ ఫండ్ ఏడాది కాలంలో 8.65% మేర రాబ‌డుల‌నిచ్చింది.

ఇందులో క‌నీసం రూ.1000 నుంచి మొద‌లుకొని పెట్టుబ‌డులు పెట్టొచ్చు.

మొద‌టిసారి రూ.5000 క‌నీస పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. త‌ర్వాత సిప్ మార్గంలో నెల‌కు రూ.1000 పెట్టొచ్చు.

6. పెట్టుబ‌డులు పెట్టేవారు ఇవి గుర్తుంచుకోవాలి

6. పెట్టుబ‌డులు పెట్టేవారు ఇవి గుర్తుంచుకోవాలి

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల్లో మార్కెట్ రిస్క్ ఉంటుంది.

మార్కెట్లు ప్ర‌స్తుతం చాలా అధిక స్థాయిల్లో ట్రేడ‌వుతున్నాయి.

అందుకే ఒకేసారి ఎక్కువ మొత్తం పెట్టుబ‌డులు పెట్టేక‌న్నా సిప్ మార్గంలో పెట్టుబడులు పెట్ట‌డం ఉత్త‌మం.

చాలా మంది మ‌ధ్య త‌ర‌గ‌తి వారు సిప్ మార్గాన్నే పెట్టుబ‌డుల‌కు మంచిదిగా సూచిస్తారు.

అయితే వీటిల్లో త‌క్ష‌ణ రాబ‌డుల‌ను ఆశించ‌లేం.

డ‌బ్బు అవ‌స‌రం ఉంటే డివిడెండ్ ప్లాన్ ఎంచుకోవ‌డం మంచిది. ఎందుకంటే ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి వ‌చ్చే డివిడెండ్ల‌పై ప‌న్నుండ‌దు.

 7. డిస్ క్లెయిమ‌ర్

7. డిస్ క్లెయిమ‌ర్

ఈ క‌థ‌నం ఆధారంగానే పెట్టుబ‌డులు పెట్టొద్ద‌ని మ‌న‌వి. ఇది చ‌దివి సెక్యూరిటీలు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌, ఇత‌ర పెట్టుబ‌డి మార్గాల‌ను ఎంచుకోవ‌డం సూచ‌నీయం కాదు. గ్రేనియ‌మ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీస్ ప్ర‌యివేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ‌లు, అందులో ప‌నిచేసే ఉద్యోగులు, ఈ క‌థ‌నం రాసిన వారు ఎవ‌రూ మీకు పెట్టుబ‌డుల్లో వ‌చ్చే లాభ‌,న‌ష్టాల‌కు బాధ్యులు కారు. మంచి ఆర్థిక నిపుణున్ని, లేదా మార్కెట్ నిపుణుడిని సంప్ర‌దించి పెట్టుబ‌డుల విష‌యంలో ముందుకు సాగాల్సిందిగా సూచించ‌డ‌మైన‌ది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+