మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు ఏ మేర‌కు ప్ర‌యోజ‌నం క‌లిగిస్తాయి?

మ్యూచువల్ ఫండ్స్‌ను మంచి పెట్టుబడి సాధనాలుగా ఎంంచుకోవ‌చ్చా? వాటితో క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటి అనే అంశాలపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. అసలు నిజంగా మ‌ధ్య త‌ర‌గ‌తి స‌గ‌టు వేత‌న ఉద్యోగికి మ్యూచువల్ ఫండ్స్ ద్

ఇటీవ‌ల ఎక్కువ మంది మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల ద్వారా మంచి లాభాల‌ను గ‌డించార‌ని మీరు వింటూ ఉంటారు. సాధార‌ణ ఇన్వెస్ట‌ర్ల‌లో చాలా మందికి ఎఫ్‌డీల రాబ‌డి మీద అయిష్ట‌త పెరుగుతూ ఉంటుంది. కానీ రిస్క్ తీసుకోలేరు. మ్యూచువ‌ల్ ఫండ్లు సైతం స్టాక్స్ లాంటివే అని భ్ర‌మ‌తో ఉంటారు. కొంచెం మ్యూచువల్ ఫండ్ల గురించి తెలిసినా ధైర్యంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు ముంద‌డుగు వేయ‌రు. ఈ నేప‌థ్యంలో మ్యూచువల్ ఫండ్స్‌ను మంచి పెట్టుబడి సాధనాలుగా ఎంంచుకోవ‌చ్చా? వాటితో క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటి అనే అంశాలపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. అసలు నిజంగా మ‌ధ్య త‌ర‌గ‌తి స‌గ‌టు వేత‌న ఉద్యోగికి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ప్ర‌యోజ‌నాలు ఉంటాయా? చూద్దాం...

లిక్విడ్ నుంచి ఈక్విటీ ఫండ్స్ వ‌ర‌కూ

లిక్విడ్ నుంచి ఈక్విటీ ఫండ్స్ వ‌ర‌కూ

మ్యూచువల్ ఫండ్స్‌లో పలు రకాల ఉత్పత్తులు ఉంటాయి. రోజువారీగా కనీస మొత్తాన్ని పెట్టుబడి చేసేలా లిక్విడ్ ఫండ్స్ నుంచి, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేసేందుకు తగిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వరకూ అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్, ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, సెక్టోరియల్ ఫండ్స్.. ఇలా అనేక మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉండగా.. వీటిలోంచి తగిన ఉత్ప‌త్తిని ఎంచుకునేందుకు వ్యవధి, లక్ష్యాలు, రిస్క్ ప్రొఫైల్‌ను పరిశీలించాల్సి ఉంటుందని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు చెబుతారు.

ఫండ్స్ అందించే సౌలభ్యం ఏంటి?

ఫండ్స్ అందించే సౌలభ్యం ఏంటి?

ఆర్థిక సాధనాల్లో అత్యధిక లిక్విడిటీ ఉన్న ఉత్పత్తులలో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. లిక్విడ్ లేదా షార్ట్-టెర్మ్ డెట్ ప్రొడక్ట్‌లలో, నగదు తిరిగి కావలంటూ ఫండ్ హౌస్‌కు అభ్య‌ర్థిస్తే(రిక్వెస్ట్ పెడితే), గరిష్టంగా రెండు రోజుల లోపు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి నగదు జమ అయిపోతుంది. నిజానికి కొన్ని ఫండ్‌ హౌస్‌లు రూ. 50000వేల లోపు లిక్విడ్ స్కీమ్‌లలో తక్షణమే నగదు బదిలీ చేస్తుంటాయి కూడా. ఈక్విటీ ఫండ్స్‌లో నగదు మీ బ్యాంక్ ఖాతాలోకి చేరేందుకు గరిష్టంగా నాలుగు పని దినాల సమయం పడుతుంది. వీటిలో ఏక మొత్తంలో లేక భారీ మొత్తంలో పెట్టుబడులు చేసే అవకాశం ఉంటుంది. మీ పెట్టుబడులను సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP), సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(STP) ద్వారా అయినా ఒక నిర్ణీత కాలానికి చేయవచ్చు. ఇవన్నీ ఆటోమేటిక్‌గా మీరు నిర్ణయించిన కాలానికి, మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డ‌బ్బు మిన‌హాయించ‌బ‌డి ఫండ్ పెట్టుబ‌డుల్లోకి చేరిపోతుంది.

ప్రయోజనాలేంటి?

ప్రయోజనాలేంటి?

మ్యూచువల్ ఫండ్స్ చాలా విస్తరించి ఉంటాయి. ఈక్విటీల మాదిరిగా ఒకటే స్టాక్‌ను హోల్డ్ చేయడం కాకుండా, మ్యూచువల్ ఫండ్స్‌లో పోర్ట్‌ఫోలియో ఉంటుంది. పలు రంగాలకు చెందిన సెక్యూరిటీస్‌లో డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తాయి. ఒక స్టాక్‌లో హఠాత్తుగా వచ్చే మార్పులను, మిగిలిన స్టాక్స్ ధరలు బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో మీ రిస్క్‌ను తగ్గించడమే కాకుండా, రాబడులను సక్రమమైన స్థాయిలో ఉంచుతుంది. మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేయడం అంటే, అనుభవజ్ఞుడైన మనీ మేనేజర్‌ను కూడా ఎంపిక చేసుకున్నట్లే. తన టీంతో కలిసి ఫండ్ మేనేజర్, ఇతర విశ్లేషకులు పరిశోధన చేసి స్టాక్స్‌ను ఎంపిక చేస్తారు. మీరు చేసిన పెట్టుబడి మొత్తాన్ని ఫండ్ మేనేజర్‌ అత్యంత జాగ్రత్తగా వారు పరిశోధించి, ఎంపిక చేసిన పలు రంగాలకు చెందిన స్టాక్స్‌ను బయ్.. సెల్ చేసేందుకు ఉపయోగిస్తారు. దీంతో మీరు ఎక్కువగా పరిశోధన చేసి పెట్టుబడిపై నిర్ణయం తీసుకునేందుకు బదులుగా.. మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను నిర్వహించేందుకు ఓ అనుభజ్ఞుడైన ఫండ్ మేనేజర్ ఉంటారు.

 స్టాక్స్ అంటే భ‌య‌మా, అయితే మొద‌ట ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టొచ్చు

స్టాక్స్ అంటే భ‌య‌మా, అయితే మొద‌ట ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టొచ్చు

ఒక పరిశ్రమ గాని మార్కెట్ గాని మీరు ఊహించి న విధంగా లాభాలను ఆర్జించలేకపోవచ్చు. నష్టాల్లో కూరుకు పోవచ్చు. కాని చిన్నచిన్న మొత్తాలలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టే చిన్న మదుపరులు తాము తమ నష్టాలను సాధ్యమైన రీతిలో తగ్గించుకునేందుకు మార్కెట్ లో అనుభవం గడించిన విశ్లేషకులు, వృత్తి నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ విశ్లేషకులు తమ మదుపరులు పెట్టే పెట్టుబడిని ఒక పరిశ్రమ, ఒక మార్కెట్ లో కాక వివిధ రకాల కంపెనీలు, సెక్యూరిటీలలో చిన్న చిన్నమొత్తాల్లో పెట్టు బడి పెట్టే సలహాలిచ్చి మదుపరుల నష్టాలను తగ్గిస్తారు. దీంతో మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల‌లో మీరు పాల్గొంటూ ఎక్కువ న‌ష్టం క‌ల‌గ‌కుండా చూసుకోవ‌చ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+