For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న ప‌రిశ్ర‌మ పెడుతున్నారా? ఆన్‌లైన్‌లో రుణాలు పొందండిలా...

చాలా భార‌తీయ డిజిట‌ల్ అంకురాలు చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను గుర్తించి వాటికి తోడ్ప‌డేందుకు ఆన్‌లైన్ రుణ వేదిక‌ల‌ను ప్రారంభించాయి. అంటే ఆన్‌లైన్‌లో ఈ డిజిట‌ల్ అంకురాల‌ను సంప్ర‌దిస్తే వీరు చిన్న‌, మ‌ధ్యత‌ర‌హా ప

|

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు పెద్ద వాటానే ఉంది. అయినా ఇవి ఎన‌లేని ఆటంకాల‌ను, స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూనే ఉన్నాయి.
బ్యాంకులు వీరికి స‌రిప‌డా రుణాలు ఇవ్వ‌వు. ఇచ్చినా వీటిని స‌జావుగా న‌డిపేందుకు డ‌బ్బు కొర‌త ఉండ‌నే ఉంటుంది. ఎస్ఎంఈలుగా వీటిని సంక్షిప్తంగా సంబోధిస్తున్నాం.

ఎస్ఎంఈల‌ను కాపాడేందుకు, వాటికి స‌రైన ప్రోత్సాహ‌మిచ్చి ఆదుకునేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. మొత్తం ఎస్ఎస్ఎంఈ రంగాన్నే పైకి తేవాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఉంది. ప్రైవేట్ రంగం కూడా చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ ప్రోత్స‌హ దిశ‌గా పనిచేస్తుంది.

చాలా భార‌తీయ డిజిట‌ల్ అంకురాలు చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను గుర్తించి వాటికి తోడ్ప‌డేందుకు ఆన్‌లైన్ రుణ వేదిక‌ల‌ను ప్రారంభించాయి. అంటే ఆన్‌లైన్‌లో ఈ డిజిట‌ల్ అంకురాల‌ను సంప్ర‌దిస్తే వీరు చిన్న‌, మ‌ధ్యత‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆర్థికంగా స‌హాయం చేస్తార‌న్న‌మాట‌. ఆలోచ‌న ఎంత బాగుందో క‌దా!

1. లెండింగ్ కార్ట్‌

1. లెండింగ్ కార్ట్‌

ఇది డిపాజిట్ల‌ను స్వీక‌రించ‌ని ఒక బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌(ఎన్‌బీఎఫ్‌సీ). చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు రుణాలు అందించే బాధ్య‌త‌ను లెండింగ్‌కార్ట్ తీసుకుంది. చిన్న చిన్న‌ వ్యాపారాలు చేసేవారికి అప్పు సులువుగా అందేలా చేయ‌డ‌మే ఈ సంస్థ ప్ర‌ధానోద్దేశం.

అధునాత‌న టెక్నాల‌జీ, అన‌లిటిక్స్ టూల్స్ వాడి ఎన్నో వేల డేటా పాయింట్ల‌ను విశ్లేషిస్తుంది ఈ సంస్థ‌. చిన్న వ్యాపారాల‌కు రుణాలు మంజూరు చేస్తే ఎంత త్వ‌ర‌గా త‌మ వ్యాపారాన్ని అభివృద్ధి ప‌ర్చుకుంటాయో అనేదాన్ని క‌చ్చితంగా లెక్క క‌ట్టి ఏ మేర‌కు రుణం ఇవ్వ‌వ‌చ్చో అంచ‌నా వేస్తుంది లెండింగ్‌కార్ట్‌.

2. కాయిన్ ట్రైబ్‌

2. కాయిన్ ట్రైబ్‌

ఎలాంటి పూచీక‌త్తు లేకుండా చిన్న వ్యాపారుల‌కు, వ్య‌క్తుల‌కు రుణాలను విత‌ర‌ణ చేయ‌డంలో స‌హాయం చేసే మ‌రో అంకుర సంస్థ కాయిన్ ట్రైబ్‌. పెద్ద పెద్ద బ్యాంకుల‌తో బ్యాక్ టెస్టింగ్ చేసి మ‌రీ త‌మ రుణ న‌మూనాను తీర్చిదిద్దుకున్న సంస్థ బ‌హుశా ఇదేనేమో.

ఈ సంస్థ పూర్తిగా డిజిట‌ల్ ప్ర‌క్రియ‌నే కొన‌సాగిస్తుంది. రుణ మంజూరులో నిర్ణ‌యం తీసుకునే అంశం నుంచి పూర్తి ప్ర‌క్రియ ముగిసే దాకా దాదాపు అంతా డిజిట‌ల్‌మ‌య‌మే. చాలా త‌క్కువ కాగితం ప‌నితో, ఎలాంటి ద‌ర‌ఖాస్తు ఫీజు లేకుండా రుణాన్ని మంజూరు చేయించ‌డంలో ఈ అంకుర సంస్థ తోడ్ప‌డుతుంది.

రుణాలు ఇవ్వ‌డంలో నూత‌న‌త్వాన్ని, ఆవిష్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చిన ఘ‌న‌త ఈ అంకురానికి చెందుతుంది. చాలా కాలంగా ఇ-ఆధార్‌, ఇ-సంత‌కం, బ్యాంక్ స్టేట్‌మెంట్ల స్కాన్ కాపీల ద్వారానే ప‌నికానిచ్చేలా ఏర్పాట్లు చేస్తుంది. వినియోగ‌దారునికి మంచి అనుభూతి మిగిలిస్తుంది.

3. ఫెయిర్‌సెంట్‌

3. ఫెయిర్‌సెంట్‌

అతి పెద్ద పీర్ టు పీర్ లెండింగ్ వెబ్‌సైట్ ఇది. రిటైల్ సంస్థ‌ల‌కు వ్యాపార రుణాల అవ‌స‌రాల‌ను ఈ అంకుర సంస్థ తీరుస్తుంది.

ఇదెలా ప‌నిచేస్తుందంటే... ఎవ‌రి ద‌గ్గ‌రైనా ఎక్కువ డ‌బ్బు ఉన్న‌వారు నేరుగా అప్పు అవ‌స‌ర‌మున్న‌వారికి ఇవ్వొచ్చు. ఫెయిర్‌సెంట్ వెబ్‌సైట్ కేవ‌లం ఆన్‌లైన్ వేదిక‌గా ప‌నిచేస్తుందంతే. దీని వ‌ల్ల మ‌ధ్య‌వ‌ర్తుల‌కు మార్జిన్లు ఇవ్వ‌కుండా చాలానే మిగులుతుంది.

ఇటీవ‌ల ఈ అంకుర సంస్థ ఐడీబీఐ బ్యాంకుతో ఎస్క్రో అకౌంట్‌ను తెరిచింది. దీని వ‌ల్ల రుణం ఇచ్చేవారికి త్వ‌ర‌గా ప‌నులు జ‌రిగిపోయి తాము పెట్టుబ‌డిగా అంటే ఇక్క‌డ రుణంపై మంచి రాబ‌డుల‌ను అందుకోగ‌లుగుతారు. ఇలా ఇరు వ‌ర్గాల వారికి లాభం చేకూరుస్తుంది ఫెయిర్ సెంట్‌.

4. ట్యాబ్ క్యాపిట‌ల్‌

4. ట్యాబ్ క్యాపిట‌ల్‌

ట్యాబ్ క్యాపిట‌ల్ అంత పేరు తెచ్చుకోవ‌డానికి కార‌ణం సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిని పాటించ‌క‌పోవ‌డ‌మే. దీనికి భిన్నంగా రుణాల‌ను అత్యంత వేగంగా, ఎలాంటి ఇబ్బందుల‌కు గురిచేయ‌కుండా మంజూరు చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఇందుకోసం అడ్వాన్స్డ్ అల్గారిథ‌మ్‌ను సంస్థ వినియోగిస్తుంది. బిగ్ డేటా అన‌లిటిక్స్‌పై ఆధార‌ప‌డి రుణ ద‌ర‌ఖాస్తు, వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ‌, ఆమోదం, విత‌ర‌ణ లాంటివ‌న్నీ త్వ‌ర త్వ‌ర‌గా అయ్యేలా చేస్తుందీ సంస్థ‌.

ఇలా చేయ‌డం వ‌ల్ల ట్యాబ్ క్యాపిట‌ల్ కేవ‌లం రెండే రెండు ప‌నిదినాల్లో పూచీక‌త్తు లేని వ్యాపార రుణాల‌ను మంజూరు చేయ‌గ‌ల‌గుతుంది. ఎస్ఎంఈ ల రంగంలోనే ఇది అత్యంత అద్భుత ఘ‌న‌త‌గా అభివ‌ర్ణించ‌వ‌చ్చు.

జియో ప్ర‌భావం- 75000 ఉద్యోగాలు పోయాయ్జియో ప్ర‌భావం- 75000 ఉద్యోగాలు పోయాయ్

Read more about: business loan
English summary

చిన్న ప‌రిశ్ర‌మ పెడుతున్నారా? ఆన్‌లైన్‌లో రుణాలు పొందండిలా... | 4 Lending Platforms That Are Helping Unbanked SMEs

Loans for small business in India
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X