దేశవ్యాప్తంగా ఉన్నత చదువుల కంటే పాఠశాల విద్యకే తల్లిదండ్రులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యధిక రుసుములు కలిగిన కొన్ని పాఠశాలల గురించి తెలుసుకుందాం.
మన దేశంలో,ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చదువులకు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదని అందరికీ తెలుసు. అయితే మన ప్రాంతాల్లో ఉండే కొన్ని ప్రైవేటు పాఠశాలలే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తాయని చాలా మంది విచారిస్తుంటారు. దేశవ్యాప్తంగా ఉన్నత చదువుల కంటే పాఠశాల విద్యకే తల్లిదండ్రులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యధిక రుసుములు కలిగిన కొన్ని పాఠశాలల గురించి తెలుసుకుందాం.

1. డూన్ స్కూల్
హిమాలయ పాదాల వద్ద ఢిల్లీకి 5 గంటల ప్రయాణం పట్టే డెహ్రాడూన్‌లో డూన్ స్కూల్ ఉంది. కేవలం బాలురకే ప్రవేశం ఉన్న ఈ పాఠశాలను 1929లో డూన్ వ్యాలీలో ప్రారంభించారు. దేశంలో ధనవంతుల పిల్లలకు ఇది కేంద్రంగా ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, హీరో గ్రూప్ సునీల్ ముంజల్, పవన్ ముంజల్ వంటి వారు ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు కావడం విశేషం.
ఈ పాఠశాల వార్షిక రుసుము రూ.9,70,000 , ఇంకా ఇతర ఖర్చులు ఒక్కో టర్మ్‌కు రూ.25 వేల వరకూ ఉంటాయి.
ఇంకా అడ్మిషన్ సమయంలో రూ. 3,50,000 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
దీంతో పాటు ఒకసారి చెల్లించేలా రూ.3,50,000 అడ్మిషన్ ఫీజు చెల్లించాలి.

2. సిందియా స్కూల్
ఇప్పుడు సిందియా స్కూల్‌గా పిలవబడుతున్న ఒకప్పటి సర్దార్ స్కూల్ 1897లో ప్రారంభమైంది. దీని వ్యవస్థాపకులు హెచ్ హెచ్ మహారాజ మధవ్ రావ్ సిందియా 1. గ్వాలియర్ కోటలో ఈ పాఠశాల ఉంది.
పాఠశాల రుసుము : రూ. 7,70,800
ఈ స్కూల్ పూర్వ విద్యార్థులలో ముకేశ్ అంబానీ, సల్మాన్ ఖాన్, అనురాగ్ కశ్యప్ వంటి వారున్నారు.

3. మాయో కాలేజ్
రాజస్థాన్‌లోని ఆరావళి పర్వత పాదాల వద్ద అజ్మీర్‌లో మాయో కాలేజ్ ఉంది. ఇది బాలుర రెసిడెన్సియల్ పాఠశాల.
దీన్ని 1875లో 1869-1872 వరకూ వైశ్రాయ్‌గా పనిచేసిన రిచర్డ్ బ్రూక్ ప్రారంభించారు.
ఇది దేశంలోనే పాత బోర్డింగ్ స్కూళ్లలో ఒకటి.
ఇక్కడ 9 హోల్ గోల్ఫ్ కోర్సులు, ఒక పోలో గ్రౌండ్ ఉన్నాయి. ఇంకా అన్ని సౌకర్యాలు ఉన్న 10మీ ఎయిర్ రైఫిల్ షూటింగ్ రేంజి ఇక్కడి ప్రత్యేకత.
ఈ పాఠశాల పూర్వ విద్యార్థుల్లో పాత్రికేయుడు వీర్ సంఘ్వీ, అమితాబ్ కాంత్, మాజీ ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ వంటి వారున్నారు. పాఠశాల రుసుము: రూ. 5,14,000

4. ఈకొలె మోండియెల్ వరల్డ్ స్కూల్
ఈకొలె మోండియల్ ఒక అతర్జాతీయ స్థాయి పాఠశాల.
ఇక్కడ ఐబీ ప్రైమరీ ప్రొగ్రామ్, మిడిల్ ఇయర్స్ ప్రొగ్రామ్, డిప్లొమో ప్రొగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్నారు.
ఇంకా 9,10 తరగతులకు IGCSE సైతం ఆఫర్ చేస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్త గుర్తింపు కలిగిన విద్యా కార్యక్రమం.
ఈ పాఠశాల రుసుములు అన్నీ కలిపి రూ.10,90,000 వరకూ ఉంటాయి.

5. వీలమ్ బాయిస్ స్కూల్
హిమాలయ సానువుల్లో 30 ఎకరాల్లో డూన్ వాలీలో వీలమ్ బాయిస్ స్కూల్ ఉంది.
ఇక్కడ వార్షిక రుసుము రూ.5,70,000.
ఇంకా ట్యూషన్, బోర్డింగ్ రుసుము, అడ్మిషన్ రుసుము, ప్రాసెసింగ్ రుసుముల కింద ఒక్కో టర్మ్‌కు అదనంగా రూ.1 లక్ష
ఈ పాఠశాల పూర్వ విద్యార్థుల్లో మణి శంకర్ అయ్యర్, నవీన్ పట్నాయక్, సంజయ్ గాంధీ, విక్రమ్ సేథ్, కెప్టెన్ అమరేందర్ సింగ్ వంటి వారున్నారు.

6. వుడ్ స్టాక్ స్కూల్, ముస్సోరి
ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి పట్టణంలో వుడ్ స్టాక్ కో-ఎడ్ పాఠశాల ఉంది.
ఈ క్యాంపస్ డూన్ వ్యాలీ అందాలను దాని చుట్టు పక్కల కలిగి ఉంది.
శివాలిక్ రేంజి పర్వతాల్లోని టెహ్రి కొండలు, డూన్ వాలీ పరిసరాలను చక్కగా ఆస్వాదించవచ్చు.
ఈ పాఠశాల వార్షిక రుసుము క్లాస్ 12కు రూ.15,90,000
ఎస్టాబ్లిష్ మెంట్ రుసుము కింద రూ.4 లక్షలు(నాన్ రీఫండబుల్) కట్టాలి.
చెప్పుకోదగ్గ పూర్వ విద్యార్థుల్లో టోమ్ అల్టర్, నయనతార సెహగల్ ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications