For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుగు పాఠ‌కుల కోసం... స‌న్నీ లియోనీ పెట్టుబ‌డుల పాఠాలు

ఈ విష‌యంలో ఆమెలో తెలియ‌ని కోణాన్ని ఆవిష్క‌రించాల‌నుకుంటున్నాం. ఆమె ఎక్క‌డెక్క‌డ పెట్టుబ‌డులు పెట్టింది, ఆమె ఆర్థిక ల‌క్ష్యాలేమిటి త‌దిత‌ర విష‌యాల‌న్నీ అభిమానుల‌కు స‌ర్వ‌దా ఆస‌క్తిదాయ‌క‌మే. ఆ విశేషాలు

|

గూగుల్‌లో ఎక్కువ‌గా శోధించిన వారిలో టాప్‌లో నిలవ‌డం ఒక‌త్త‌యితే... దాన్ని నాలుగేళ్ల‌ పాటు నిలుపుకోవ‌డం మ‌రో ఎత్తు. అంత‌గా ఆ పేరు ఇక్క‌డి జ‌నాల నోళ్ల‌ల్లో, మెద‌డులో నానింది. హాలీవుడ్ నుంచి దిగుమ‌తైనా ఇక్క‌డి వారి మ‌న‌సుల‌ను చూర‌గొని అందుకు త‌గిన‌ట్టు బాలీవుడ్‌లోనూ త‌న త‌డాఖా చూపించింది. కేవ‌లం అందాల ఆర‌బోత అనే కాదు న‌ట‌న‌లోనూ త‌న ప్రావీణ్యాన్ని రుచి చూపించింది.

ఏంటీ సినిమా వార్త పొర‌పాటున ఇక్క‌డ ప్ర‌చురించామ‌ని అనుకుంటున్నారా? మ‌నీ మేనేజ్‌మెంట్‌లో స‌న్నీ లియోనీ పాత్ర అమోఘం. ఈ విష‌యంలో ఆమెలో తెలియ‌ని కోణాన్ని ఆవిష్క‌రించాల‌నుకుంటున్నాం. ఆమె ఎక్క‌డెక్క‌డ పెట్టుబ‌డులు పెట్టింది, ఆమె ఆర్థిక ల‌క్ష్యాలేమిటి త‌దిత‌ర విష‌యాల‌న్నీ అభిమానుల‌కు స‌ర్వ‌దా ఆస‌క్తిదాయ‌క‌మే. ఆ విశేషాలు మేము మీకు ప్ర‌త్యేకంగా అందిస్తున్నాం. శ్ర‌ద్ద‌తో చ‌ద‌వండి మ‌రి!

భ‌విష్య‌త్‌ కోసం పెట్టుబ‌డి

భ‌విష్య‌త్‌ కోసం పెట్టుబ‌డి

18ఏళ్ల నాటికే వినోద‌ రంగంలో ఆమె సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. నా పైన‌, నా బ్రాండ్ విలువ పెంచుకునేందుకు నేను పెట్టుబ‌డి పెట్టాను. స్వ‌యంగా HTML నేర్చుకున్నాను. వెబ్‌సైట్‌ను ఎలా రూపొందించుకోవాలో తెలుసుకున్నాను. తొలిసారి ప్రోగ్రామ్‌ను త‌యారుచేసుకోగ‌లిగాను. ఫొటోల‌ను చ‌క్క‌గా ఎడిట్ చేసే క‌ళ‌ను నేర్చుకున్నాను. ఇది కాకుండా వెబ్‌సైట్ల నిర్వ‌హ‌ణ చేసే విధానంపై, వెబ్‌సైట్ల ట్రాఫిక్‌పైన‌, వినోద రంగ ప‌రిశ్ర‌మ పైన చాలా ప‌రిశోధ‌నే చేశాన‌ని స‌న్నీ చెప్పుకొచ్చారు. ఇవ‌న్నీ నాకు నేనే నేర్చుకున్నాన‌ని స‌న్నీ గ‌ర్వంగా చెప్పుకొచ్చారు.

రిస్క్ తీసుకోవ‌చ్చు..

రిస్క్ తీసుకోవ‌చ్చు..

స‌న్నీ చాలా వాటిల్లోనే పెట్టుబ‌డులు పెట్టారు. మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్లు, స్థిరాస్తి. ఆమె న‌టించిన వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు కూడా పెట్టుబ‌డిగానే భావించారు. డియో, ప‌ర్‌ఫ్యూమ్ లైన్ లాంటివి. ఇవ‌న్నీ రిస్క్ తీసుకొని చేసిన‌వే అని అంటారు స‌న్నీ. నేను ప్ర‌తి నిర్ణ‌యాన్ని ఆచితూచి తీసుకుంటాను. కాస్త‌యినా రిస్క్ తీసుకోక‌పోతే ఎలా చెప్పండి అంటారు స‌న్నీ లియోనీ. రిస్క్‌ను కూడా ఆమె లెక్క వేసి దాన్ని త‌ట్టుకోగ‌ల‌ను అనుకుంటేనే ముందుకు వెళ‌తాన‌ని అన్నారు.ఈ 10 మార్గాల్లో ఇంటి నుంచే ఆన్‌లైన్లో డ‌బ్బు సంపాదింవ‌చ్చు

పెట్టుబ‌డుల విభ‌జ‌న ఇలా...

పెట్టుబ‌డుల విభ‌జ‌న ఇలా...

షేర్ల‌లో 40శాతం, స్థిరాస్తి, బంగారంలో చెరో 30శాతం పెట్టుబ‌డి పెట్టాల‌ని త‌న అభిమానుల‌కు స‌న్నీ లియోనీ సూచిస్తోంది. ఆమె పెట్టుబ‌డుల్లో అధిక వాటా అమెరికా దేశ‌పు మ్యాచువల్ ఫండ్లు, షేర్ల‌లో ఉన్న‌ట్టు తెలిపారు. స్థిరాస్తి విష‌యానికి వ‌చ్చేస‌రికి భార‌త్‌లోనే పెట్టుబ‌డి పెట్టేందుకు ఆమె ఇష్ట‌ప‌డ‌తారు. ఇక్క‌డ స్థిరాస్తిలో పెట్టుబ‌డి చాలా సుర‌క్షిత‌మైన‌ద‌ని ఆమె న‌మ్మ‌కం. ఇక బంగారంలో పెట్టుబ‌డి అంటే ఆమెకు బంగారు బాండ్లే గుర్తుకొస్తాయి. నేరుగా బంగారం కొనుగోలుపై ఆమెకు ఆస‌క్తి త‌క్కువే అని చెప్పారు.

అక్క‌డ ఇల్లు కొన‌డం నా క‌ల‌

అక్క‌డ ఇల్లు కొన‌డం నా క‌ల‌

ఆమె కొంత డ‌బ్బును ఇండివిడ్యువ‌ల్ రిటైర్‌మెంట్ అకౌంట్‌లో వేస్తూ ఉంటాన‌ని చెప్పారు. జీవితపు చివ‌రి రోజులు ఆనంద‌మ‌యంగా గ‌డిపేందుకు ఇవి ఉప‌యోగ‌డ‌తాయ‌ని ఆమె భావ‌న‌. ఇందుకోసం అమెరికాలో ల‌భించే కొన్ని సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి పథ‌కాల‌ను సైతం ఎంచుకున్నారు. కొన్ని మార్కెట్ ప్ర‌తికూల ప్ర‌భావాలు ఆమె పెట్టుబ‌డుల‌పై ప‌డ్డాయ‌ని అన్నారు. అయితే తాను పాటించే పొదుపు విధానంపై ఆమెకు పూర్తి న‌మ్మ‌కముంద‌ని తెలిపారు. క్ర‌మంగా పెట్టుబ‌డుల్లో వృద్ధి క‌నిపిస్తుంద‌ని నేను బ‌లంగా న‌మ్ముతున్నాను. లాస్ ఏంజెల్స్‌లోని హాలీవుడ్ హిల్స్‌లో 5వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం క‌లిగిన ఓ అంద‌మైన ఇంటిని కొనుగోలు చేయాల‌ని నా ఆశ‌. దానికి కొంత కేటాయిస్తున్నాను అని స‌న్నీ అన్నారు. ఒక వేళ ఏదైనా అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డ కొన్న‌ ఇంటిని అమ్మినా బాగానే డ‌బ్బులు వ‌స్తాయి అని స‌న్నీ న‌మ్మ‌కంగా అన్నారు.

అందంతో పాటు ఆరోగ్యానికి..

అందంతో పాటు ఆరోగ్యానికి..

స‌న్నీ త‌న అందంపైన ఎంత శ్ర‌ద్ధ చూపిస్తుందో అంతే ఆరోగ్యంపైనా చూపిస్తుంది. అమెరికాలో ఓ ఆరోగ్య పాల‌సీ కొన్నారు. ఇక భార‌త్‌లో ఆరోగ్య సంర‌క్ష‌ణ చాలా బాగుంద‌ని కొనియాడారు. ఎలాంటి అనారోగ్యానికైనా ఆదుకునేలా కొంత సొమ్మును ప‌క్క‌న పెట్టిన‌ట్టు ఆమె తెలిపారు.

 జీవిత బీమా విష‌యంలో

జీవిత బీమా విష‌యంలో

అమెరికాలో ప్ర‌తి దానికీ బీమా చేయించ‌డం త‌ప్ప‌నిస‌రి. అక్క‌డ మాకు గృహ బీమా, భూకంపం బీమా, కారు బీమాలున్నాయి. ఇక్క‌డ మాత్రం మా బీఎమ్‌డ‌బ్ల్యూ 7 సిరీస్ కారుకు త‌గినంత బీమా చేయించాం.

డ‌బ్బు ఆనందాన్ని కొన‌లేదు కానీ...

డ‌బ్బు ఆనందాన్ని కొన‌లేదు కానీ...

అవును డ‌బ్బు ఆనందాన్ని కొన‌లేదు క‌రెక్టే. కానీ ఒక మంచి ఇంటిని కొనుగోలు చేయ‌గ‌ల‌దు. ఆ కొత్త ఇంటిని కొన్నామ‌న్నా సంతృప్తి చాలు ఆనందంగా ఉన్నాం అనేదానికి. ఇలా డ‌బ్బుతో ముడిపడిన ఆనందం గురించి స‌న్నీ లియోని చెప్పుకొచ్చారు.

 భార‌త‌దేశంలో 10 అతి పెద్ద కుంభ‌కోణాలు

భార‌త‌దేశంలో 10 అతి పెద్ద కుంభ‌కోణాలు

భార‌త‌దేశంలో అతి పెద్ద ఆర్థిక మోసాలుభార‌త‌దేశంలో అతి పెద్ద ఆర్థిక మోసాలు

Read more at: https://telugu.goodreturns.in/news/2016/08/10/10-big-financial-frauds-002074.html

Read more about: sunny leone investments
English summary

తెలుగు పాఠ‌కుల కోసం... స‌న్నీ లియోనీ పెట్టుబ‌డుల పాఠాలు | How sunny Leone manages her money and investment tips from her

Business Woman Sunny Leon Invests in Gold, Stocks And Real State investment tips in teluguMeet Business Women Sunny Leon who Invest in Gold, Stocks And Real State.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X