రాబడులు, పన్ను ప్రయోజనాలు ఏది చూసినా దీర్ఘకాలంలో ఇది ఒక మంచి పొదుపు పథకం. ప్రయివేటు ఉద్యోగులకు ఎవరికైతే ప్రభుత్వ పింఛను సదుపాయం ఉండదో అలాంటి వారికి ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే పీప
దీర్ఘకాలిక పొదుపు ఖాతాల్లో పీపీఎఫ్ ఒకటి. వేతన ఉద్యోగులకు పన్ను మినహాయింపు పొందేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనికి ప్రభుత్వ హామీ ఉంటుంది. ఇది ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గం. రాబడులు, పన్ను ప్రయోజనాలు ఏది చూసినా దీర్ఘకాలంలో ఇది ఒక మంచి పొదుపు పథకం. ప్రయివేటు ఉద్యోగులకు ఎవరికైతే ప్రభుత్వ పింఛను సదుపాయం ఉండదో అలాంటి వారికి ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే పీపీఎఫ్ ఖాతాను ఎక్కడ, ఎలా తెరవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఎస్‌బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీపీఎఫ్ అకౌంట్లను తెరవొచ్చు.. పీపీఎఫ్ దరఖాస్తును నింపాలి. దీంతో పాటు బ్యాంకుకు అవసరమైన ఇతర డాక్యుమెంట్‌లు సమర్పించాలి. అన్ని విధివిధానాలు పూర్తయిన తర్వాత బ్యాంకు మీకు పీపీఎఫ్ పాస్‌బుక్‌ను ఇస్తుంది.

జాతీయ బ్యాంకుల్లో ఎంపిక చేసిన బ్రాంచీలు
పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు ప్రభుత్వం అన్ని బ్యాంకులకు అనుమతి ఇవ్వలేదు. మీరు నిర్దిష్టమైన కొన్ని బ్యాంకులనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా జాతీయ బ్యాంకులకు సంబంధించినవై ఉండాలి. దీని కి సంబంధించిన వివరాలు బ్యాంకు వెబ్‌సైట్ లేదా బ్యాంకు బ్రాంచికైనా వెళ్లి తెలుసుకోవాలి. పీపీఎఫ్ అకౌంట్లను అన్ని పోస్టాఫీసుల్లో తెరచుకునే వీలుంది. మీరు ఏదేని స్థానిక పోస్టాఫీసుకు వెళ్లండి. అక్కడ సంబంధిత అధికారిని కలవండి. అక్కడ పీపీఎఫ్ దరఖాస్తును నింపాలి. ఈ దరఖాస్తు ఇంటర్‌నెట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. రెండు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను పెట్టండి. అడ్రస్‌కు సంబంధించిన జిరాక్స్, ఐడెంటిటీ, పాన్ కార్డ్ జతచేయండి. పోస్టాఫీసులో పీపీఎఫ్ అకౌంట్ తెరవండి. నగదును డిపాజిట్ చేయండి.

పోస్టాఫీసు శాఖలు
పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీసు శాఖల్లో తెరవొచ్చు. మీకు దగ్గరలోని పోస్టాఫీసు బ్రాంచీకి వెళ్లి సంబంధిత అధికారిని కలవండి. దానికి అవసరమైన ఫారంను నింపండి. ఈ ఫారం ఆన్‌లైన్‌లో సైతం అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసేందుకు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, వ్యక్తిగత గుర్తింపు, చిరునామా గుర్తింపు,పాన్ కార్డు,డిపాజిట్ సొమ్ము అవసరం.

పీపీఎఫ్ ఏ విధంగా ప్రత్యేకం
సంఘటిత రంగాల్లోని కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి ఉంటుంది. అదే రీతిన అసంఘటిత రంగ కార్మికులకు దీర్ఘకాలంలో ఆర్థిక రక్షణ కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సదుపాయాన్ని కల్పించారు. ఇందులో సాధారణ ప్రజలు సైతం భాగస్వాములుగా చేరవచ్చు. ప్రజలు ఎక్కువగా దీనిని పన్ను మినహాయింపు సాధనంగానే భావిస్తున్నారు. అయితే వీటిపై వడ్డీని ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. ప్రస్తుతం వివిధ పెట్టుబడి సాధనాలపై వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో దీర్ఘకాల దృష్టితో చూస్తే పీపీఎఫ్ ఇంకా ఆకర్షణీయంగానే ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications