For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ సంప‌ద పెంచుకునేందుకు ఉప‌యోగప‌డే 5 ఆస్తులు

మీ నికర ఆస్తి పెంచుకోవాల‌నుకుంటే ఇక్క‌డ కొన్ని ఆప్ష‌న్లు ఉన్నాయి. వాటిలో నుంచి మీకు వీలైన ఆస్తిని పోగుచేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించి సంప‌న్నుల‌వ్వండి.

|

ఒక వ్య‌క్తిని సంప‌న్నుడు అని ఎలా నిర్ణ‌యిస్తారంటే అత‌ని వద్ద ఉన్న స్థిర‌,చరాస్తుల ద్వారా. మామూలుగా మ‌నం మాట్లాడుకునేట‌ప్పుడు రాజేష్‌కు అక్క‌డ రెండు ఫ్లాట్‌లు ఉన్నాయిరా అని అంటాం. అలా చూస్తే ఒక వ్య‌క్తి సంప‌ద విష‌యంలో బ్యాంకు బ్యాలెన్స్‌, అప్పులు ఒక‌టే కాదు. ఇంకా చాలా ఉంటాయి. మీ నికర ఆస్తి పెంచుకోవాల‌నుకుంటే ఇక్క‌డ కొన్ని ఆప్ష‌న్లు ఉన్నాయి. వాటిలో నుంచి మీకు వీలైన ఆస్తిని పోగుచేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించి సంప‌న్నుల‌వ్వండి.

1. సొంత ఇల్లు

1. సొంత ఇల్లు

సొంత ఇల్లు అనేది ఎవ‌రికైనా జీవిత స్వ‌ప్నం. అది ఎన్నో మాన‌సిక అనుభూతుల‌తో ముడిప‌డి ఉంటుంది. ఒక‌సారి ఏదో విధంగా సొంతిల్లు సాధిస్తే దాని విలువ ఏళ్లు గ‌డిచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది.

2. విద్య‌, వైద్యం

2. విద్య‌, వైద్యం

జీవితంలో కొంత వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత ఆరోగ్యం మీద శ్ర‌ద్ద చూపే వారు ఎంతో మంది. ఒక వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత అనారోగ్యం వ‌స్తే అప్పుడు బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. అందుకే మంచి జీవ‌న శైలి గురించి ఇప్ప‌టి నుంచే కృషి చేయాలి. లేక‌పోతే మీ ద‌గ్గ‌ర ఎంతో డ‌బ్బు ఉండొచ్చు కానీ సుఖ, సంతోషాలు ఉండ‌వు. చ‌దువుకునేట‌ప్పుడు ఏదో ఒక‌టి, ఎంతో కొంత ప‌ర్సెంటిజీతో పాస‌వుతారు. అది స‌రే. కానీ భ‌విష్య‌త్తులో మీ గురించి చెప్పుకోవ‌డానికి బాగా ఉండేలా మంచి చ‌దువులు పూర్తిచేసేందుకు ప్ర‌య‌త్నించండి. మీ కెరీర్ ఆసాంతం ప‌నికొచ్చేలా ఏవైనా కోర్సులు లాంటివి ఉంటే వాటిని ఎంచుకోండి. అవ‌స‌ర‌మైతే స‌ర్టిఫికేష‌న్ కోర్సుల‌ను సైతం పూర్తి చేయండి. అలాగే ఉద్యోగం వేట‌లో ప‌డి ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌క మంచి జీవ‌న శైలిని అల‌వర్చుకోండి

3. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కోసం పొదుపు

3. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కోసం పొదుపు

ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ను చూస్తే ఇది వ‌ర‌క‌టి లాగా ఎక్కువ ఏళ్లు బ‌తికే అవకాశం లేద‌నే చాలా మంది అనుకుంటారు. ఆ విధంగా చూస్తే భ‌విష్య‌త్తులో 50 ఏళ్ల‌కే ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అలా క‌నుక అయితే ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత జీవితం కూడా చాలా ఉంటుంది. యుక్త వ‌య‌సులో, బాగా సంపాదించే వ‌య‌సులో పొదుపు చేసిన డ‌బ్బే ప్రణాళిక‌తో వ్య‌వ‌హ‌రిస్తేనే భ‌విష్య‌త్తు నిక‌ర ఆస్తుల విలువను పెంచుతుంది. సంపాదించే వ‌య‌సులో డ‌బ్బు దుబారా చేస్తే ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత అవ‌స‌రాల‌కు డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డ‌తారు.

4. స్టాక్ మార్కెట్

4. స్టాక్ మార్కెట్

ఉద్యోగుల్లో ఎక్కువ‌ మందికి తెలిసే ఉంటుంది మంచి పెట్టుబడి రావాలంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని. అయితే ఇది రిస్క్‌తో కూడుకున్న పెట్టుబ‌డి మార్గం కాబ‌ట్టి ఎక్కువ మంది మొగ్గుచూప‌రు. ఒక మంచి విశ్లేష‌ణ‌తో ఉండి, స‌రైన మార్గాన్ని అనుస‌రిస్తే ఎక్కువ రాబ‌డుల‌కు అవ‌కాశం ఉంటుంది. మార్కెట్ నిపుణులు చెప్పేదేందంటే " మీ సొంత విశ్లేష‌ణ ఉండాలి. ఎవ‌రైనా పెట్టుబ‌డి స‌ల‌హాదారులు మీ పెట్టుబ‌డుల‌ను వివిధ ర‌కాల వాటిలో పెట్ట‌మ‌ని చెబుతారు. మీ రాబ‌డిని, అవ‌స‌రాల‌ను బ‌ట్టి ప్లాన్ వేసుకోవాల్సింది మీరే."

5. అప్పులు ఇవ్వ‌డం

5. అప్పులు ఇవ్వ‌డం

ఈ రోజుల్లో బ్యాంకుల్లో,ఆర్థిక సంస్థ‌ల్లో అప్పులు తెచ్చుకోవ‌డం సులువైంది. అదే విధంగా బాండ్ పేప‌ర్ మీద ఒప్పందం రాసుకుని అప్పులు ఇవ్వ‌డం ఎక్క‌డ చూసినా మామూలే. ఎక్కువ డ‌బ్బు ఉంటే వ‌డ్డీకి అప్పులివ్వ‌డం ద్వారా కూడా మీ సంప‌ద‌ను పెంచుకునేందుకు ఒక మార్గంగా ప‌నికొస్తుంది. అయితే మీరు అప్పు చేసి పెట్టుబ‌డి పెట్ట‌డం మాత్రం మంచిది కాదని గుర్తుంచుకోండి. స్థిరాస్తి కోసం చేసే అప్పు విష‌యంలోనైతే రాబ‌డిని పోల్చుకుని ముందుకు సాగడం సూచ‌నీయం.

Read more about: investments savings
English summary

మీ సంప‌ద పెంచుకునేందుకు ఉప‌యోగప‌డే 5 ఆస్తులు | 5 best ways to increase your Net worth

Owning a home for living- This asset has an emotional as well as financial value which sees a jump with years to come. When it comes to tax savings you can save some part of your income by taking home loan.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X