యులిప్ అనేది యునిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు సంక్షిప్త రూపం. ఇక్కడ బీమా, పెట్టుబడి రెండు కలిసి ఉంటాయి. యులిప్ అంటే లింక్ చేయబడిన యూనిట్ బీమా పధకం. యులిప్ అనేది జీవిత బీమా పాలసీ. క్యాపిటల్ మార
యులిప్ అనేది యునిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు సంక్షిప్త రూపం. ఇక్కడ బీమా, పెట్టుబడి రెండు కలిసి ఉంటాయి. యులిప్ అంటే లింక్ చేయబడిన యూనిట్ బీమా పధకం. యులిప్ అనేది జీవిత బీమా పాలసీ. క్యాపిటల్ మార్కెట్ (మదుపర్లతో కూడిన మార్కెట్ షేర్లు, స్టాక్ మార్కెట్)లు ఈ యులిప్ పథకంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. అంతే కాకుండా మదుపుదారులకు యులిప్ అనేవి బీమాతోపాటు పెట్టుబడి ప్రయోజనాలు కూడా పొందడానికి ఒక మార్గం. దీనితో పాటు లింక్ చేయబడిన యూనిట్ బీమా పాలసీలలో మదుపు చేసేటప్పుడు మదుపరులు తమ మదుపుపై వచ్చే నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. యులిప్ పనితీరు విలక్షణమైనది. ఇలాంటి పెట్టుబడి ఆధారిత బీమా గురించి మరిన్ని అంశాలు మీ కోసం...

యులిప్ పాలసీలు ఎలా ఉంటాయి?
మదుపు లక్ష్యాలు కలిగిన ఫండ్స్‌ను మదుపరులకు తగిన రీతిలో ఎన్నో ఇన్సూరెన్స్ సంస్దలు అందిస్తున్నాయి. ఈ ఇన్సూరెన్స్ సంస్దలు అందించేటటువంటి ఫండ్స్ కాలపరిమితో కూడుకున్నవి మరియు నష్టాలను కూడా భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక పాలసీదారు కొంత సొమ్మును కొన్ని సంవత్సరాలపాటు దీనిపై వెచ్చించాడని అనుకుందాం. అతని సొమ్మును, సంభవించబోయే నష్టాన్ని అతను తట్టుకోగలిగే స్థాయి ఆధారంగా ఈక్విటీలుగా, రుణాలుగా రెండింటిపైనా పెట్టుబడి చేస్తారు. ఇందులో అనేక పథకాలు ఉంటాయి. కొన్ని పథకాల్లో పాలసీదారులకు, వారు పాలసీ కాల పరిమితి ముగిసేవరకూ జీవించి ఉన్నట్లయితే నిర్దిష్ట మొత్తంలో సొమ్మును హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఐతే ప్రీమియం మొత్తాలు చాలా అధికంగా ఉంటాయి.

ఉదాహరణతో యులిప్
ఉదా: 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి రూ 10 లక్షల మొత్తాన్ని హామీ ఇచ్చే 20 సంవత్సరాల యులిప్‌ను కొనుగోలు చేసినట్లేతే అతను చెల్లించాల్సిన ప్రీమియం రూ. 25,000 నుండి గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ ఉండవచ్చు. (హామీ ఇవ్వబడిన మొత్తం అనేది ప్రీమియంకు ఐదు రెట్లు). కాగా, మరోవైపు బీమాలో అత్యంత స్వచ్ఛంగా భావింపబడే టర్మ్ ప్లాన్లో ఇందుకు అయ్యే వ్యయం కేవలం రూ. 3,370 మాత్రమే. ఇందులో ఒక సమస్య ఉంది. బీమా చేసిన వ్యక్తి జీవించి ఉన్నట్లయితే, టర్మ్ ప్లాన్‌లో చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని రూ. 67,400 (3,370 × 20 సంవత్సరాలు) కోల్పోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత రుణాల దృష్ట్యా చూస్తే, ఆ తేడా సొమ్ము రూ. 21,630 (రూ. 25,000 - రూ. 3,370) మదుపు చేసినట్లయితే 8 శాతం ఆదాయాన్ని అందించే ఏ పథకంలో అయినా రాబడి అదే విధంగా రూ. 9.8 లక్షలు వరకూ ఉంటుంది. అందులో కూడా మొత్తం టర్మ్ ప్లాన్ సొమ్ము రూ. 67,400 కోల్పోవాల్సి ఉంటుంది. యులిప్ అనేది మార్కెట్‌తో ముడిపడి ఉన్నందున, ఈ ప్రయోజనాన్ని దెబ్బతీస్తుంది. ప్రయోజ నాన్ని అందిచాల్సిన సమయంలో మార్కెట్లో ఉండే అనిశ్చిత పరిస్థితులు ఇందుకు కారణం.

యులిప్ పథకం వల్ల లాభాలు:
'లాక్-ఇన్' పిరియడ్ కారణంగా స్టాక్స్‌ను కలిగి ఉండేందుకు ఫండ్ నిర్వాహకులకు ఎక్కువ కాలం లభిస్తుంది. యులిప్ ద్వారా వచ్చే రాబడికి పూర్తి మినహాయింపులు వర్తిస్తాయి. ఒక సంవత్సర కాలంలో 100 శాతం రుణాలు-ఈక్విటీ స్కీములకు మారేందుకు నాలుగు సార్లు ఉచితంగా అవకాశమిస్తారు.

యులిప్ వల్ల నష్టాలు
ప్రీమియం కేటాయింపు ఛార్జీలు, పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు, మోర్టాలిటీ రేటు వంటి వాటికి అయ్యేటటువంటి వ్యయం అధికం. నాక్-ఆఫ్ యూనిట్స్ వ్యయం ముందుగానే చెల్లించాల్సి రావడం.
తెలుగు.గుడ్‌రిటర్న్స్.ఇన్
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications