ప్రతి వ్యక్తికీ బీమా అవసరం ఏమిటి?
బీమా అంటే కేవలం డబ్బు పెట్టుబడి పెట్టడం కాదు. ఏదో పన్ను తప్పించుకునేందుకు పొదుపు చేసే వారు ఉంటారు. కానీ కుటుంబ యజమాని ఆకస్మికంగా మరణించిన సమయంలో కుటుంబ సభ్యుల పరిస్ధితి ఏమిటి? ఈ ప్రశ్న ఉత్పన్నమ
బీమా అంటే కేవలం డబ్బు పెట్టుబడి పెట్టడం కాదు. ఏదో పన్ను తప్పించుకునేందుకు పొదుపు చేసే వారు ఉంటారు. కానీ కుటుంబ యజమాని ఆకస్మికంగా మరణించిన సమయంలో కుటుంబ సభ్యుల పరిస్ధితి ఏమిటి? ఈ ప్రశ్న ఉత్పన్నమైతే, చాలా మంది కుటుంబ యజమానులు ఆందోళన చెందుతుంటారు. జీవిత బీమాను పటిష్టమైన ఆర్ధిక ప్రణాళికలో భాగంగా చూడాలి. ప్రతి వ్యక్తి ఆర్ధిక లక్ష్యాలను కలిగి ఉంటారు. ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆర్ధిక రక్షణ, సంపద సృష్టి, అత్యవసర పరిస్ధితులో డబ్బు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవడం, అలాగే జీవితంలో ఇతర అవసరాలకు డబ్బును పొదుపు చేసే విధంగా ఈ ప్రణాళికలు ఉంటాయి. పెళ్లి, ఇల్లు కొనుగోలు, పిల్లల చదువు తదితరమైన అంశాలు ప్రతి వ్యక్తి జీవితంలో బాధ్యతగా నిర్వహించే కేటగిరీలోకి వస్తాయి.ఒక కుటుంబ యజమాని తనకు ప్రస్తుతం ఉన్న బాధ్యతలు, రుణాలు, అంచనాలు, భవిష్యత్తులో ఖర్చు, ఆధారపడిన వారు, ఆర్ధిక లక్ష్యాలు, జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని శాస్ర్తియబద్ధంగా ఆర్ధిక ప్రణాళికను ఖరారు చేసుకోవాలి.

ఒక కుటుంబ యజమాని ఆకస్మికంగా మరణిస్తే, అంతవరకు వచ్చే ఆదాయం అగిపోతుంది. అంతవరకు అందుబాటులో ఉన్న సొమ్ము కుటుం బ సభ్యులకు లభించదు. జీవన ప్రమాణాలు తగ్గుతాయి. అందుకే వ్యక్తిగత రక్షణ అనేది జీవిత బీమాలో ప్రధానమైనదిగా భావించాల్సి ఉం టుంది. దీర్ఘకాలం పాటు రక్షణ, పొదుపు అనే కోణంలో బీమా పథకాన్ని ఆలోచించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడి ప్రణాళిక పరంగా చూస్తే పొదుపుకు బీమాకు లింక్ పెట్టకపోవడమే మేలు. దీనికి జీవిత బీమా ఉపయుక్తంగా ఉంటుందని బీమా రంగ నిపుణుల సూచన. పెట్టుబడికి కావాలంటే ఫండ్లను ఎంచుకోవచ్చు. ఒక వ్యక్తి సాలీనా తన ఆదాయానికి 20 రెట్లు ఎక్కువగా సొమ్ము ను లెక్కించి ఆ మేరకు బీమా పాలసీని చేయించుకోవాల్సిందిగా ప్రణాళిక నిపుణులు సూచిస్తారు.


Click it and Unblock the Notifications