చాలామంది స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడతారు. స్థలాలు, ఫ్లాట్లు, వాణిజ్య స్థలాల్ని కొనడానికి ముందుకొస్తారు. లాభాలే కాదు.. మోసాలకు, వివాదాలకూ ఈ రంగం పెట్టింది పేరని గుర్తుంచుకోవాలి. కాబట్టి స్థిరాస్త
మనోళ్లకు ఉన్న పెట్టుబడుల ఆసక్తి చూస్తే రియల్ ఎస్టేట్‌పైన ఉన్న మక్కువ దేని కన్నా ఎక్కువే. దీనికి ప్రధాన కారణం ఎప్పటికైనా విలువ పెరుగుతుందే తప్ప తగ్గనే తగ్గదు. ఇలాంటి సానుకూలాంశాల కారణంగా చాలామంది స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడతారు. స్థలాలు, ఫ్లాట్లు, వాణిజ్య స్థలాల్ని కొనడానికి ముందుకొస్తారు. లాభాలే కాదు.. మోసాలకు, వివాదాలకూ ఈ రంగం పెట్టింది పేరని గుర్తుంచుకోవాలి. కాబట్టి స్థిరాస్తులు కొనేముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సొంతిల్లా?
ఇప్పటికే సొంతిల్లు ఉండి.. రెండో ఇంటిపై పెట్టుబడి పెట్టే వారు అద్దెల ద్వారా ఆదాయం, లేదంటే మంచి ధరొస్తే అధిక రేటుకు అమ్ముకోవడానికి ప్రాధాన్యమిస్తారు. వీటి విలువ వాణిజ్య భవనాల కంటే తక్కువగా ఉండటం, గృహ రుణాలపై పన్ను మినహాయింపు వంటి ఆర్థిక ప్రయోజనాలుంటాయి.

మరో ఇంటిపై పెట్టుబడా?
రెండో ఇంటిపై పెట్టుబడి పెట్టడం వల్ల పలు పన్ను పరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రెండో ఇంటిపై వచ్చే అద్దెను గృహ కొనుగోలుకు తీసుకున్న రుణంపై వడ్డీ భాగాన్ని కట్టేందుకు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ కట్టే వడ్డీ కన్నా మనకొచ్చే అద్దె తక్కువగా ఉన్న పక్షంలో మీ ఆదాయంలో దాన్ని ‘గృహ ఆస్తిపరంగా వచ్చిన నష్టం' కింద చూపించుకుని, పన్నులపరమైన వెసులుబాటు పొందవచ్చు.

కొనుగోలు దారులు ఏం చేయాలి?
1.మార్కెట్లో బిల్డర్‌కు ఎలాంటి పేరుందో ఆరా తీయాలి. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ ప్రాంతంలో ఉంది? అన్న విషయాలను బట్టే మీరు కొనబోయే ఇంటి విలువ ఎంత పెరుగుతుందనేది ఆధారపడుతుంది. వీటితో పాటు భవన ప్రణాళిక, అనుమతులు, యాజమాన్య హక్కులనూ పరిశీలించాలి.
2. ఫ్లాట్/ఇల్లు నివాసానికి సిద్ధంగా ఉన్నవి, లేదంటే నిర్మాణం పూర్తి కావచ్చినవి కొనడం వల్ల రాబడిని త్వరగా అందుకోవచ్చు. ఇలాంటి ఇళ్లను కొంటే.. వెంటనే అద్దెకిచ్చి ఆదాయం పొందవచ్చు.
3. అభివృద్ధికి ఆస్కారం గల ప్రాంతంలో నిర్మాణం చివరి దశలో ఉన్న ఇంటిని కొంటే రెండు విధాలుగా లాభం. ప్రాజెక్టు పూర్తి కాగానే నెలనెలా అద్దె పొందవచ్చు. ఇంటి విలువ వేగంగా పెరుగుతుంది.
4. దాచుకున్న సొమ్ముతో ఇల్లు కొంటే నెలవారీ వాయిదాల భారం లేకుండా చూసుకోవచ్చు.

ఇవి చూసుకుంటే మంచిది...
తక్కువ ధరకు వస్తుందని తొందరపడొద్దు. స్థలానికి రవాణా మార్గం, అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి. వాణిజ్య భవనాలకు హైదరాబాద్ నగరంలో నెమ్మదిగా గిరాకీ పెరుగుతోంది. అద్దెల రూపంలో మంచి ఆదాయం ఆశించే వారికి నివాస భవనాలతో పోలిస్తే వాణిజ్య భవనాలే మేలు. ఇదివరకే ఒక ఇల్లు ఉంటే మరో ఇల్లు ఎందుకు అనుకునేవారికి వాణిజ్య ఆవాసాల మీద పెట్టుబడి మేలు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications