దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధి కోరుకునేవారికి స్టాక్ మార్కెట్ సంబంధం ఉన్న పెట్టుబడులు బాగా ఉంటాయి. అందులో షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, ఇతర మనీ మార్కెట్ సాధనాలు ఉంటాయి. వీటన్నింటిలో ఎక్కువ రిస్క్
దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధి కోరుకునేవారికి స్టాక్ మార్కెట్ సంబంధం ఉన్న పెట్టుబడులు బాగా ఉంటాయి. అందులో షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, ఇతర మనీ మార్కెట్ సాధనాలు ఉంటాయి. వీటన్నింటిలో ఎక్కువ రిస్క్ తీసుకునేందుకు భయపడే వారికి ఈక్విటీ ఆధారిత పథకాలు అనుకూలం. ఈక్విటీ మార్కెట్లలో నేరుగా పెట్టుబడి పెట్టకుండా లాభాలను ఆర్జించేవారి కోసం ఉద్దేశించినవే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు.
* ఈ పథకానికి సంబంధించి పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్‌లోని వివిధ కంపెనీల షేర్లలో పెడతారు.
* ఏదో ఒక రంగానికో, కంపెనీకో ఈ ఫండ్లను పరిమితం చేయరు.
* ఫండ్ నిర్వాహకుడు ఫండ్లను నిర్వహిస్తారు.
ఇంకా ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల గురించి సమగ్ర వివరాలు తెలుసుకుందాం.

రుసుములు:
* సాధారణ మ్యూచువల్ ఫండ్లలాగే ఈఎల్ఎస్ఎస్ పథకంలోనూ ప్రారంభ ఛార్జీలు వర్తించవు.
* మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ వర్తిస్తుంది కాబట్టి పెట్టుబడులను మూడేళ్ల వరకూ విత్‌డ్రా చేసుకునే వీలుండదు.
* ఫండ్ నిర్వహణ ఛార్జీలు మాత్రం ఆయా మ్యూచువల్ ఫండ్ సంస్థను బట్టి ఉంటుంది.

ఈ పథకం వీరికి అనుకూలం:
* కొంత నష్టభయాన్ని తట్టుకునేలా, పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి
ఈఎల్ఎస్ఎస్ పథకం సరైన ఎంపిక.
* అప్పుడే సంపాదన మొదలుపెట్టిన యుక్తవయసు వారికి ఈఎల్ఎస్ఎస్ పథకం అనుకూలం.
ఈ కోవకు చెందినవారికి నష్టాన్ని తట్టుకునే సామర్థ్యంతో పాటు దీర్ఘకాల లక్ష్యాలకు ఈ పథకం ఉపకరిస్తుంది.

పెట్టుబడి విధానం:
* ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో రెండు విధాలుగా పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. ఏకమొత్తంగా ఒకేసారి పెట్టుబడి పెట్టడం ఒక పద్ధతి.
* మరో విధానంలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా నెలనెలా నిర్ణీత తేదీలో నిర్ణీత సొమ్మును పెట్టుబడి పెట్టవచ్చు.
* సిప్ విధానంలో కనీసం రూ.500 నుంచి పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది.

పెట్టుబడి ఆప్షన్లు :
* ఈఎల్ఎస్ఎస్ పథకానికి సంబంధించి గ్రోత్, డివిడెండ్ పే అవుట్ అనే రెండు రకాల ఆప్షన్లు
అందుబాటులో ఉన్నాయి.
* గ్రోత్ ఆప్షన్ ద్వారా దీర్ఘకాలంపాటు పెట్టుబడి వృద్ధికి అవకాశం ఉంటుంది.
* అదే డివిడెండ్ పే అవుట్ ఆప్షన్‌ను ఎంచుకుంటే పెట్టుబడిపై వచ్చే లాభాలను ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు. అంటే మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ సమయం కోసం వేచిచూడకుండా డివిడెండ్ చెల్లిస్తారు.

రాబడి:
* దీర్ఘకాలంలో మంచి రాబడులను అందించిన చరిత్ర ఈఎల్ఎస్ఎస్ పథకానికి ఉంది.
* స్టాక్ మార్కెట్ సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీలు ఈఎల్ఎస్ఎస్‌కు బెంచ్‌మార్క్‌లా పనిచేస్తాయి. దీనికి అనుగుణంగా రాబడి ఉంటుంది.

నష్టభయం :
ఈ పథకంలోని పెట్టుబడులను ఈక్విటీ ఆధారిత షేర్లలో పెడతారు. స్టాక్ మార్కెట్లో లాభనష్టాలకు అనుగుణంగా పెట్టుబడుల తీరు ఉంటుంది. స్వల్పకాలంలో నష్టభయం అధికంగా ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో నష్టభయం ప్రభావం పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది.

పన్ను వివరాలు:
* ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం ఈఎల్ఎస్ఎస్ పథకంలో పెట్టుబడులకు రూ.1.5లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది.
* లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఈ పథకంలో పెట్టుబడిని మూడేళ్ల కన్నా ముందే వెనక్కి తీసుకుంటే పెట్టుబడిపై మినహాయింపు పొందిన పన్ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
* డివిడెండ్ల ద్వారా వచ్చే ఆదాయం పై పన్ను ఉండదు.
* దీర్ఘకాలంలో పెట్టుబడి ద్వారా వచ్చే లాభాలకు పన్ను వర్తించదు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications