For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ విష‌యాలు తెలుసుకుంటే మంచిది

|

మధ్య తరగతి వారు సొంత ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఉపకరించే ఒక మంచి మార్గం గృహ రుణం. ఈ విషయంలో జాగ్రత్త వహించకపోతే రుణం చెల్లించేటప్పుడు అధిక భారం వహించాల్సి వస్తుంది. రెండు లేదా మూడు బ్యాంకులను సంప్రదించడం, ప్రాపర్టీ షోలలో పాల్గొని అవగాహన పెంచుకోవడం ద్వారా మార్కెట్లో ఉండే వడ్డీ రేట్లను పరిశీలించండి. పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రకటనలను చూసి అన్ని విషయాలు తెలుసుకోకుండా గృహ రుణం తీసుకుంటే తర్వాత బాధ పడాల్సి ఉంటుంది. కింది ఐదు విషయాలను జాగ్రత్తగా గమనిస్తే వీలైనంత వరకూ రుణ చెల్లింపు సమయంలో వచ్చే ఇబ్బందులను అధిగమించవచ్చు.
స్థిర వడ్డీ రేటు= ఫిక్స్‌డ్‌ ; చర వడ్డీ రేటు= మారుతూ ఉండేది

1. వడ్డీ రేట్లు:

1. వడ్డీ రేట్లు:

గృహ రుణాల విషయంలో బ్యాంకులు రెండు రకాల వడ్డీ రేట్లు అమలు చేస్తున్నాయి. రుణ దరఖాస్తు సమయంలోనే స్థిర, చర వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే మంచిది. ఒకవేళ చర వడ్డీ రేటే అమలు చేసేటట్లయితే, ఏ ప్రాతిపదికన ఎన్ని రోజులకోసారి వడ్డీ మారుతూ ఉంటుందో అవగాహన ఉండేలా చూసుకోవాలి. వార్షిక వడ్డీ రేటు(ఏపీఆర్‌) మొదట్లోనే నిర్ణయిస్తారు. దాని తర్వాత చర వడ్డీ రేట్ల మార్పు గురించిన సమాచారాన్ని మీకు ఏ విధంగా చేరవేస్తారో తెలుసుకోండి. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనే విషయానికి వస్తే, వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు చర, కనిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు స్థిర వడ్డీ రేటును ఎంచుకోవడం సూచనీయం.

2. వివిధ రుసుములు:

2. వివిధ రుసుములు:

ప్రాసెసింగ్‌ రుసుము , నిర్వహణ రుసుము, ఆలస్య చెల్లింపు రుసుము, ముందస్తు చెల్లింపు రుసుము వంటి వాటి గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆర్థిక భారం ఎక్కువ అవుతోందని అనిపించి ఒక్కసారిగా రుణం తీర్చేయాలనుకుంటే అందుకుగాను ముందస్తు చెల్లింపు రుసుము రూపంలో భారీ మొత్తం చెల్లించాల్సి రావచ్చు. ఒక్కోసారి వడ్డీ రేటు తక్కువ అని చెప్పినా, అన్నీ రుసుములు కలిపి లెక్కిస్తే చెల్లించే మొత్తం చాలా ఎక్కువ అవుతుంది. రుణం తీసుకునే ముందే అన్నింటినీ బేరీజు వేసుకుని జాగ్రత్త వహించండి. సాధ్య‌మైనంత వ‌ర‌కూ ప్రీక్లోజ‌ర్‌(ముంద‌స్తు చెల్లింపు) రుసుముల్లేని బ్యాంకుల్లోనే రుణం తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం మంచిది.

3. రుణ కాలపరిమితి:

3. రుణ కాలపరిమితి:

రుణ కాలపరిమితి విషయంలో బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలవైపే మొగ్గు చూపుతాయి. 30 లక్షల రుణానికి 8% వడ్డీ చొప్పున 20 సంవత్సరాలకు వడ్డీ రూపంలోనే దాదాపు 30 లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ స్వల్పంగా వడ్డీ రేటు లేదా రుణ కాలపరిమితి పెరిగినా ఇంటి ధర కంటే మీరు చెల్లించే వడ్డీయే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సంపాదన సామర్థ్యం బాగా ఉన్నవారు స్వల్పకాలంలో ఈఎమ్‌ఐలు చెల్లించగలిగే గృహ రుణం తీసుకోవడం మంచిది.

4. డౌన్‌ పేమెంట్‌:

4. డౌన్‌ పేమెంట్‌:

ఇల్లు కొనుగోలు చేసినప్పుడు మొదటిసారి నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే డౌన్‌ పేమెంట్‌ అంటారు. సాధారణంగా మొత్తం రుణంలో 20 నుంచి 30 శాతం వరకూ డౌన్‌ పేమెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ డౌన్‌పేమెంట్‌ అందించే విషయంలో వడ్డీ రేటు రూపంలో ఎక్కువ చెల్లించాల్సి వస్తుందా అనే విషయాన్ని గమనించాలి.

5. గృహ రుణం మార్చుకోవాలనుకుంటే:

5. గృహ రుణం మార్చుకోవాలనుకుంటే:

ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు రుణాన్ని బదిలీ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కేవైసీ పత్రాన్ని కొత్త బ్యాంకుకు అందించాలి. మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు, మీ ఆదాయ, బ్యాంకు ఖాతా వివరాలను జత చేయాలి. పాత బ్యాంకు రుణ వాయిదాలకు సంబంధించిన సమాచారాన్ని కొత్త బ్యాంకుకు తెలియపరచాలి.

6. బ్యాంకు గృహ రుణంపై బీమా క‌ల్పిస్తోందా?

6. బ్యాంకు గృహ రుణంపై బీమా క‌ల్పిస్తోందా?

గృహ రుణానికి బీమా తీసుకోక‌పోవ‌డం గృహ రుణం తీసుకునేట‌ప్పుడు స్వ‌ల్ప ప్రీమియం చెల్లించ‌డం ద్వారా దానికి సంబంధించి బీమాను తీసుకోవ‌చ్చు. అనుకోకుండా రుణ గ్ర‌హీత‌కు ఏమైనా జరిగితే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళుతుంది. ఒక‌వేళ బీమా తీసుకోకుండా రుణం తీసుకున్న వ్య‌క్తి మ‌ర‌ణిస్తే వారి కుటుంబ స‌భ్యులు రుణం తీర్చాల్సి వ‌స్తుంది. అదే బీమా ఉంటే స‌మస్య ఉండ‌దు. తీసుకున్న అప్పుపై ఉన్న క‌వ‌రేజీ మేర‌కు రుణాన్ని బీమా కంపెనీయే చెల్లిస్తుంది.

ముగింపు

ముగింపు

ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకు రుణాలు వినియోగదారులకు సౌకర్యంగా ఉంటాయి. రుణ ఆమోద ప్రక్రియలో జాప్యం జరిగినా, చెల్లింపు విషయంలో పెద్దగా ప్రతిబంధకాలు ఎదురు కావు. ప్రైవేటు సంస్థలు కొన్ని రుసుముల గురించి స్పష్టంగా వెల్లడించకుండా మధ్యలో ఇబ్బంది పెడతాయి. బ్యాంకులు వడ్డీరేట్ల విషయయంలో కఠినంగా వ్యవహరిస్తాయి. ఆర్‌బీఐ రేట్లను పెంచినప్పుడు బ్యాంకులు వెంటనే వడ్డీ రేట్లను పెంచుతాయి. అదే రేట్లలో కోత విధించినప్పుడు మాత్రం ఆ ప్రయోజనాలను వెంటనే వినియోగదారులకు అందించవు. అందువల్ల చరవడ్డీ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.

అత్యంత సంప‌న్నులు ఈ 6 పెట్టుబ‌డి పొర‌పాట్లు చేయ‌రు!

అత్యంత సంప‌న్నులు ఈ 6 పెట్టుబ‌డి పొర‌పాట్లు చేయ‌రు!

అత్యంత సంప‌న్నులు ఈ 6 పెట్టుబ‌డి పొర‌పాట్లు చేయ‌రు!

పిల్ల‌ల కోసం 6 ఉత్తమ పొదుపు ఖాతాలు

పిల్ల‌ల కోసం 6 ఉత్తమ పొదుపు ఖాతాలు

పిల్ల‌ల కోసం 6 ఉత్తమ పొదుపు ఖాతాలు

బంగారం నిల్వ‌ల్లో టాప్‌-10 దేశాలు ఇవే...

బంగారం నిల్వ‌ల్లో టాప్‌-10 దేశాలు ఇవే...

బంగారం నిల్వ‌ల్లో టాప్‌-10 దేశాలు ఇవే...

Read more about: home loan housing loan
English summary

Things to know before taking Home loan in India

The last time we had long tenure fixed-rate home loans at interest rates that were so close to the floating rate loan was way back in 2003-04. “Should I take a fixed-rate home loan or a floating rate home loan?”I used to receive this question a lot during the past decade (2003-2008) but now it died away.Fixed-rate home loans where interest rates remained fixed for the entire tenure, disappeared from the scene. Things to know before taking Home loan in India
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X