ఎన్‌పీఎస్ ఖాతా తెరిచేందుకు ఆధార్ ఉంటే చాలు
జాతీయ పింఛన్ పథకం(ఎన్‌పీఎస్)లో చేరేందుకు ఉన్న నిబంధనలను కేంద్రం సడలించింది. ఎన్‌పీఎస్ ఖాతాలు తెరవడానికి ఇదివరకు ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పింఛన్ నిధులు నియంత్రణ,అభివృధ్ధి మండలి (పీఎఫ్‌ఆర
జాతీయ పింఛన్ పథకం(ఎన్‌పీఎస్)లో చేరేందుకు ఉన్న నిబంధనలను కేంద్రం సడలించింది. ఎన్‌పీఎస్ ఖాతాలు తెరవడానికి ఇదివరకు ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పింఛన్ నిధులు నియంత్రణ,అభివృధ్ధి మండలి (పీఎఫ్‌ఆర్డీఏ) నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆధార్‌తో తెరిచిన ఫింఛను ఖాతాలకు బ్యాంక్‌ల్లో ఫిజికల్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వవలసిన అవసరం లేదంటూ ఆదివారం ప్రకటించింది.

ఇదివరకు ఖాతాలు ప్రారంభించిన వాళ్లు ఎలక్ట్రానిక్ సంతకం చేయడానికి బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వచ్చేది. ఆన్‌లైన్ ఖాతా తెరిచేందుకు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్(పీవోపీ)లో ఈ-సంతకాన్ని సమీకృతం చేస్తే అప్పుడు కేంద్రీకృత రికార్డుల(సీఆర్ఏ) నమోదు సంస్థకు చందాదారులు దరఖాస్తులు పోస్టులో పంపే అవసరం ఇకపై ఉండదని ప్రభుత్వం వివరించింది. దీని వల్ల ఆధార్ కలిగిన చందాదారులు సులువుగా పింఛను పథకంలో చేరగలుగుతారని తెలిపింది. ఈ-సంతకం సంబంధిత సేవలు అందించడానికి పీవోపీలు గరిష్టంగా రూ. 5 సేవా రుసుము వసూలు చేసుకోవచ్చని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. నవంబరు 30 నాటికి ఈ పథకంలో 1 కోటి 40 లక్షల మంది చందాదారులుగా ఉన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications