ఎంత వద్దనుకున్నా ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడుల నుంచి వేరే వైపు మళ్లలేకున్నారా? ఎఫ్‌డీలనే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం.
ఎంత వద్దనుకున్నా ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడుల నుంచి వేరే వైపు మళ్లలేకున్నారా? ఎఫ్‌డీలనే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం.
ఎవరైనా రాబడిపైన ప్రధానంగా ఆశించేది ఎంత వడ్డీ వస్తుందనే కదా! ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తే వడ్డీ ఎక్కువ ఇస్తారో చూసుకోవాలి. ప్రతి బ్యాంకు ప్రధాన వెబ్‌సైట్లో హోంపేజీలోనే వడ్డీ రేట్ల లింకులను ఇస్తుంటాయి. వాటి ద్వారా ఏ కాలపరిమితి డిపాజిట్లకు ఎంత శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారో చూడాలి. సమయానుసారంగా బ్యాంకులు ప్రత్యేక డిపాజిట్ పథకాలను సైతం ప్రవేశపెడుతూ ఉంటాయి. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ ఎఫ్‌డీలో మంచి వడ్డీ లభిస్తుందో దాన్ని ఎంచుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి ఎఫ్‌డీల నుంచి అధిక వడ్డీ రాబట్టుకునేందుకు

కచ్చితమైన ఆదాయం
బ్యాంక్ ఎఫ్‌డీల వైపు మొగ్గుచూపే వారిలో చాలా మంది దీర్ఘకాలంలోనూ కచ్చితమైన రాబడిని ఆశిస్తారు. పెట్టుబడులపై తక్కువ నష్టభయం ఉండాలనుకునే వారు ఈ రకం ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు ఆసక్తిగా ఉంటారు. ఇలాంటి వారు ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే తక్కువ రాబడి వచ్చినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లయితే సాధారణ ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీతో పాటు, 7 నుంచి 8 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లలో మదుపు చేసేందుకు ఇష్టపడతారు. ఈ కాలంలో వడ్డీరేట్లు తగ్గినా, వారి వడ్డీ ఆదాయానికి భరోసా ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం బ్యాంకులు వడ్డీ రేట్లను వరుసగా తగ్గిస్తూ వస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బు పెట్టేవారు అధిక వడ్డీ రేట్ల కోసం కాస్త దీర్ఘకాలం వ్యవధి ఉండే కాలపరిమితి(టర్మ్) డిపాజిట్లనే ఎంచుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications