సొంత ఇల్లు అనేది ఎందరికో జీవితాశయం. చాలా తక్కువ మందికి మాత్రమే తల్లిదండ్రులు వారసత్వంగా గృహాన్ని అందిస్తారు. పట్టణీకరణ పెరగడంతో ఉద్యోగాల కోసం నగర బాట పడుతున్నారు. నెలవారీ వేతనంతో ఇల్
సొంత ఇల్లు అనేది ఎందరికో జీవితాశయం. చాలా తక్కువ మందికి మాత్రమే తల్లిదండ్రులు వారసత్వంగా గృహాన్ని అందిస్తారు. పట్టణీకరణ పెరగడంతో ఉద్యోగాల కోసం నగర బాట పడుతున్నారు. నెలవారీ వేతనంతో ఇల్లు కొనడం అంత సులువైన వ్యవహారం కాదు. అందుకే చాలా మంది రుణాల కోసం వెతికి ఈఎంఐల రూపంలో చెల్లించి తమ కలల గృహాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసేముందు... వడ్డీ రేట్లు, రుణకాలపరిమితి, రుణ ఒప్పందంలోని అంశాలు, రుణ అర్హతకు అనుసరించే ప్రమాణాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసే ముందు ఏ ఏ ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఆదాయంలో మిగిలేదెంత...
గృహ రుణ దరఖాస్తును పరిశీలించేటపుడు బ్యాంకులు/ గృహ రుణ సంస్థలు ఆరా తీసే విషయం మీ నెలసరి ఆదాయంలో ఇంకా ఖర్చు చేయడానికి ఎంత ఆదాయం (డిస్పోజబుల్ ఇన్‌కం) మిగులుతోంది అని. మీ మొత్తం నెలవారీ ఆదాయం నుంచి పిఎఫ్ వంటి చట్టపరమైన మినహాయింపులు, ప్రతి నెలా ఉండే ఖర్చులు, ఇప్పటికే ఉన్న రుణాలపై చెల్లిస్తున్ననెలసరి వాయిదాలు(ఈఎంఐలు) తీసివేస్తే వచ్చే ఆదాయాన్ని మిగులు ఆదాయంగా పరిగణిస్తారు. గృహ రుణం ఇచ్చే ప్రతి సంస్థా దానిపై మీరు చెల్లించే ఈఎంఐ మొత్తం మీ డిస్పోజబుల్ ఆదాయంలో 40 శాతం మించకుండా ఉండాలనుకుంటుంది. కొన్ని సంస్థలైతే నెలసరి స్థూల ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని రుణాన్ని అందిస్తాయి. ఒకవేళ మీ నెలసరి ఆదాయం తక్కువగా ఉండి, ఎక్కువ మొత్తంలో రుణం కావాలంటే ఉద్యోగం చేస్తున్న భార్య, పిల్లలను సహ దరఖాస్తుదారులుగా పేర్కొనే వీలుంది.

ఇంతకు ముందు అప్పు వివరాలు
ఇపుడు బ్యాంకులు లేదా బ్యాంకింగేతర సంస్థల నుంచి ఏ రుణం కావాలన్నా ఆ సంస్థలు మనం ఇంతకు ముందు తీసుకున్న రుణాలు, వాటి చెల్లింపు తీరును పరిశీలిస్తాయి. గృహ రుణాలకు సైతం ఇది వర్తిస్తుంది. మీ క్రెడిట్ స్కోరు ఎంత బాగుంటే అంత మంచిది. ఏ మాత్రం సరిగా లేక పోయినా ఇంటి రుణం దొరక్క పోవచ్చు. ఒకవేళ దొరికినా ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. గృహ రుణం తీసుకోవాలని నిర్ణయించగానే స్వల్ప కాలంలో ఎక్కువ బ్యాంకులు, గృహ రుణ సంస్థలకు దరఖాస్తు చేయవద్దు. అలా చేయడం వలన మీ పరపతి స్కోరు పడిపోయే ప్రమాదం ఉంది. పరపతి స్కోర్ 750కి మించి ఉంటే మంచి స్కోర్ అని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్) పేర్కొంది. రుణానికి దరఖాస్తు చేసేటప్పుడే క్రెడిట్ స్కోరు ఈ స్థాయికి తగ్గకుండా ఉండేలా చూసుకొని ఉంటే మంచిది. మీ పరపతి స్కోరు ఎంత బాగుంటే అంత తేలిగ్గా మీకు ఇంటి రుణం లభిస్తుందనే విషయం మరవకండి.

న్యాయపరమైన అంశాలు..
ఒక ఆస్తి కొనుగోలుకు రుణాలు మంజూరు చేసేటపుడు బ్యాంకులు లేదా గృహ రుణసంస్థలు ఆ ఆస్తికి చట్టబద్దమైన ఇబ్బందులేమైనా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని సరిచూస్తాయి. క్లియర్ టైటిల్ ఉండి స్థానిక సంస్థల నుంచి అన్ని అనుమతులు ఉన్న వెంచర్లకే బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణాలు లభిస్తాయి. కొన్ని బ్యాంకులైతే ముందుగానే తాము పరిశీలించి ఆమోదించిన వెంచర్లలో కొనే ఫ్లాట్లకు ప్రత్యేక ప్యాకేజీల కింద రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ విషయం కూడా అతి ముఖ్యమైనది.

వృత్తి లేదా ఉద్యోగం
బ్యాంకులు మీరు చేస్తున్న ఉద్యోగం, ఇతర వృత్తులకు సంబంధించిన విషయాలను కూడా పరిశీలిస్తాయి. స్థిరమైన ఉద్యోగం, ఆదాయం ఉన్న వ్యక్తులకు రుణాలిచ్చేందుకు ఆయా సంస్థలు మొగ్గు చూపుతాయి. దీనికి తోడు రుణ దరఖాస్తుదారు ఎంత కాలం నుంచి ఆ సంస్థలో పని చేస్తున్నాడనే విషయాన్నీ పరిగణనలోకి తీసుకుంటాయి. తరచూ ఉద్యోగాలు మారుతున్న చరిత్ర ఉంటే...అలాంటి వ్యక్తులకు గృహ రుణం ఇచ్చేందుకు బ్యాంకులు, గృహ రుణ సంస్థలు పెద్దగా ఇష్టపడవు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ రంగ ఉద్యోగులకు త్వరగా గృహ రుణాలు కాస్త సులువుగా ఇస్తుంటారు. వీరి తర్వాత డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు వంటి వృత్తి నిపుణులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు గృహ రుణాలు లభిస్తాయి.

దరఖాస్తుదారుడి వయసు..
గృహరుణం మంజూరు కావాలంటే పరిశీలించే అంశాల్లో దరఖాస్తుదారుడి వయసు సైతం మరొకటి. సాధారణంగా గృహ రుణ చెల్లింపు కాలపరిమితి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే బ్యాంకులు సాధ్యమైనంత మేర రుణ గ్రహీతకు 60-70 ఏళ్ల వయసు వచ్చే సరికి పూర్తిగా చెల్లింపులు జరిగేలా ప్రణాళికలు రచిస్తాయి. అందుకే 25-45 ఏళ్ల మధ్య వయసు గలవారికి గృహరుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతుంటారు. వీరికి రుణాలిస్తే ఉద్యోగం మానేసేలోపు అంటే వారు సంపాదనా కాలం ముగిసే సరికి చెల్లించేస్తారనేది ఒక అభిప్రాయం.

రుణ మొత్తం, ఈఎంఐ
రుణ కాలపరిమితి, వడ్డీ రేటును బట్టి అందించే రుణం ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా మీరు నెలవారీ ఎంత మిగులు ఆదాయాన్ని కలిగి ఉన్నారో చూస్తారు. గృహ రుణం తీసుకున్న వారు చాలా వరకూ ఈఎమ్ఐల రూపంలోనే చెల్లించేందుకు మొగ్గుచూపుతారు. మీకు రుణం మంజూరు అయిన మరుసటి నెల నుంచే ఈఎంఐ చెల్లింపులు మొదలవుతాయి.

పన్ను మినహాయింపు ప్రయోజనాలు
గృహ రుణానికి తీసుకున్న అప్పుపై చెల్లించే ఈఎంఐల్లో అసలు కోసం వాడే రూ. 1.50 లక్షల వరకూ ఒక్కో ఏడాది పన్ను మినహాయింపు ఉంటుంది. రుణంపై తీసుకున్న ఇంట్లోనే రుణ గ్రహీత ఉంటే ఆదాయపు పన్ను చట్టంసెక్షన్ 24సీ ప్రకారం ఏడాదికి రూ. 2 లక్షల వరకూ పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
సొంత ఇంటిని సంపాదించడం కాస్త కష్టమైన పనే అయినప్పటికీ పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన మార్గం. చక్కని ఆర్థిక ప్రణాళిక ఉంటే కలల గృహాన్ని సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications