బంగారు బాండ్లపై ప్రభుత్వ ఆఫర్లు
ప్రభుత్వం ఈ దఫా ఆరోసారి బంగారు బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈసారి ఒక గ్రాముపై 50 రూపాయల రాయితీని ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రభుత్వం ఈ దఫా ఆరోసారి బంగారు బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈసారి ఒక గ్రాముపై 50 రూపాయల రాయితీని ఇవ్వాలని నిర్ణయించారు. అక్టోబర్ 17-21 తేదీ మధ్య భారత బులియన్, జువెలర్స్ అసోసియేషన్ ప్రకటించిన ధరల సగటును లెక్కిస్తే గ్రాము బంగారం ధర 3,007 రూపాయలుగా ఉంది. అయితే దీనికి బదులు ప్రభుత్వం 50 రూపాయల రాయితీ తర్వాత గ్రాము బాండ్ విలువను 2,957 రూపాయలుగా నిర్ణయించారు. ఈ బాండ్ల సబ్‌స్ర్కిప్షన్ ఈ నెల 24వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. నవంబర్ 17న బాండ్లను జారీ చేస్తారు.

భౌతిక రూపంలో బంగారానికి(బంగారు ఆభరణాలు,కడ్డీలు) ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్‌లో దీన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఐదు విడతల్లో ఈ బాండ్లను జారీ చేశారు. ప్రభుత్వం తరఫున రిజర్వు బ్యాంకు వీటిని జారీ చేస్తోంది.
ఇది కూడా చదవండి బంగారంపై పెట్టుబడులు ఇలా..
ప్రత్యేక ఫీచర్లు
- ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి 500 గ్రాముల వరకూ ఉంది.
- కనీస పెట్టుబడి 2 గ్రాముల నుంచి మొదలవుతోంది.
- డీమ్యాట్, పేపర్ సర్టిఫికెట్ల రూపంలో అందుబాటులో ఉంది.
- స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ చేయవచ్చు.
- నిర్ణీత కాలంలో పరిమిత వడ్డీ వస్తుంది.
- బాండు కాలపరిమితి 8 ఏళ్లు.
- 5,6,7 ఏళ్ల నుంచి పథకంలో నుంచి వైదొలగవచ్చు.
- రుణాలకు హామీగా(తనఖా) వీటిని వాడుకోవచ్చు.
- బాండ్ల కోసం చెల్లింపులను చెక్కు,డ్రాఫ్ట్ లేదా ఆన్‌లైన్ ద్వారా చేయవచ్చు.
- 18001800000 టోల్‌ఫ్రీ నంబరులో మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications