సెప్టెంబ‌రు నెల‌కు ఉత్త‌మ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

నెల‌వారీ జీతం సంపాదించే వాళ్లు పెట్టుబ‌డి పెట్టాలంటే నెల‌లో మొద‌టి వారం బాగా ఉంటుంది. మీ పెట్టుబ‌డిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు భాగంగా ఉంటే అది రెండు విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక‌టి క్ర‌మ‌మైన వ‌డ్డీని పొంద‌డంతో పాటు సుర‌క్షితంగా ఉంటుంది. సెప్టెంబ‌రు నెల‌కు సంబంధించి ఉత్త‌మ వ‌డ్డీ రేట్ల‌ను అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను మీ కోసం అందిస్తున్నాం.

దీవాన్ హౌసింగ్‌

దీవాన్ హౌసింగ్‌

దీవాన్ హౌసింగ్ ఆశ్ర‌య్ డిపాజిట్ల‌పై 40 నెల‌ల క్యుములేటివ్ డిపాజిట్లకు 8.90% వ‌డ్డీ వ‌స్తోంది. కేర్ ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు ఏఏఏ రేటింగ్‌నిచ్చింది. కేర్ ఈ రేటింగ్ ఇచ్చిన డిపాజిట్లు సుర‌క్షిత‌మైన‌వ‌ని అర్థం. మిగిలిన కాల‌ప‌రిమితి డిపాజిట్ల‌కు క‌నీసం 8.75 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. రూ. 50 ల‌క్ష‌ల పైబ‌డిన 40 నెల‌ల కాల‌ప‌రిమితి ఎఫ్‌డీల‌కు 9.15 శాతం వ‌డ్డీ వ‌స్తుంది.

బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్‌

బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్‌

బ్యాంకుల‌తో పోల్చి చూస్తే ఇది కూడా మంచి వ‌డ్డీ రేటును అందిస్తోంది. 12 నుంచి 17 నెల‌ల కాలానికి 8.55 వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తున్నారు. అదే 18-60 నెల‌ల కాల‌ప‌రిమితి డిపాజిట్ల‌కు 8.65% వ‌డ్డీ వ‌స్తుంది. ఇది బ్యాంకుల కంటే దాదాపు 1 శాతం ఎక్కువ‌.

సీనియ‌ర్ సిటిజ‌న్స్ డిపాజిట్ల‌కు 0.25 % అద‌నపు వ‌డ్డీ వ‌స్తుంది.

బజాజ్ ఫిన్‌స‌ర్వ్ బ‌జాజ్ గ్రూప్‌న‌కు చెందిన సంస్థ‌.

ఆర్‌బీఎల్ బ్యాంకు

ఆర్‌బీఎల్ బ్యాంకు

24 నుంచి 36 నెల‌ల కాల‌ప‌రిమితి డిపాజిట్ల‌కు ఆర్‌బీఎల్ బ్యాంకు 8.50 శాతం వ‌డ్డీని అందిస్తోంది. ప్ర‌యివేటు రంగ బ్యాంకుల్లో ఇదే మంచి వ‌డ్డీ రేటు. ఈ బ్యాంకు షేరు ఇటీవ‌లే షేర్‌మార్కెట్‌లో లిస్ట్ అయింది.

కేటీడీఎప్‌సీ

కేటీడీఎప్‌సీ

కేర‌ళ ప్ర‌భుత్వ రంగ సంస్థ కేటీడీఎఫ్‌సీ. కేర‌ళ ప్ర‌భుత్వ హామీ ఉన్నందువ‌ల్ల ఇవి సురక్షిత‌మైన‌వని చెప్ప‌వ‌చ్చు.

ఒక‌టి, రెండు, మూడు సంవ‌త్స‌రాల‌ డిపాజిట్ల‌కు 8.50% వ‌డ్డీ వ‌స్తోంది. కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు రూ. 5 వేలకు మించి వ‌డ్డీ వ‌స్తే టీడీఎస్ క‌ట్ అవుతుంద‌ని మ‌రిచిపోవ‌ద్దు.

మ‌హీంద్రా ఫైనాన్స్‌

మ‌హీంద్రా ఫైనాన్స్‌

మ‌హీంద్రా ఫైనాన్స్ మీకు ఎఫ్‌డీల‌పై 8.45% వ‌డ్డీని అందిస్తున్న‌ది. బ‌జాజ్ ఫైనాన్స్ కంటే త‌క్కువ వ‌డ్డీ ఉన్నా ఇది కూడా సుర‌క్షిత‌మైన‌దే. అయితే ఈ ఎఫ్‌డీపై వ‌చ్చే వ‌డ్డీ రూ. 5000 దాటినా టీడీఎస్ వ‌ర్తిస్తుంది.

ఐడీఎఫ్‌సీ బ్యాంకు

ఐడీఎఫ్‌సీ బ్యాంకు

ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఒక కొత్త ప్ర‌యివేటు రంగ బ్యాంకు. 1 నుంచి 3 ఏళ్ల కాల‌ప‌రిమితి ఉన్న‌ ఎఫ్‌డీల‌పై ఈ బ్యాంకు 8.25% వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్ డిపాజిట్ల‌కు మ‌రో 50 శాతం అద‌నంగా 8.75% వ‌డ్డీ వ‌స్తుంది.

శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్‌

శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్‌

48, 60 నెల‌ల కాల‌ప‌రిమితి ఉన్న‌ ఎఫ్‌డీల‌కు 8.42% వ‌డ్డీ వ‌స్తుంది. 5 ఏళ్ల కాలప‌రిమితి డిపాజిట్ల‌కు 10.42% వ‌ర‌కూ రాబ‌డి వ‌స్తుంది. ఉత్త‌మ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌రుస‌లో ఇది చేరుతుంది.

ఇత‌ర బ్యాంకులు

ఇత‌ర బ్యాంకులు

దాదాపుగా ఇత‌ర బ్యాంకుల‌న్నీ(ముఖ్యంగా ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు) గ‌రిష్టంగా 7.5% వ‌డ్డీ ఇస్తున్నాయి. మీరు మంచి వ‌డ్డీ రేటు కోసం చూస్తుంటే జాబితాలోనుంచి మీకు న‌చ్చిన వాటిని ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+