బ్యాంకింగ్ విస్తృతి పెరిగే కొద్దీ ఆన్‌లైన్ బ్యాంకింగ్; ఫోన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వాడకం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రీమియం చెల్లింపులకు ఎల్ఐసీ ఆన్‌లైన్ బాట పట్టింది. దీనివల్ల కొన్ని క్లిక్‌ల ద్వారా మీరు కూర్చున్న చోటి నుంచే నెట్‌బ్యాంకింగ్ ద్వారా ప్రీమియం చెల్లింపులను చేసేయవచ్చు. ప్రీమియం వాయిదాలను లేదా రెన్యువల్ ప్రీమియంలను పోర్టల్ ద్వారా ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, ఫోన్ ద్వారా పే చేయవచ్చు. అయితే పాలసీల్లో ఎవరైతే ఈ సదుపాయాన్ని ఎంచుకుని ఉంటారో వారికే ఇది వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఇదివరకూ ఈ ఆప్షన్‌ను ఎంచుకోకపోతే ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి ఈ ఆప్షన్‌ను సమ్మతిస్తున్నట్లుగా వారికి తెలియజేయవచ్చు. ఇలా చేయడం వల్ల మాకేంటి అనే ప్రశ్న రావచచ్చు. నెట్‌బ్యాంకింగ్ సౌకర్యం ఎంచుకున్నందు వల్ల కలిగే పలు ప్రయోజనాలను ఇక్కడ చదవండి.

ఎల్ఐసీ ప్రీమియంలను నెట్‌బ్యాంకింగ్ ద్వారా చేస్తే కలిగే లాభాలేంటి?
* ఇంటర్నెట్ ఉంటే 24 X 7 ఎక్కడినుంచైనా చెల్లింపులు జరపవచ్చు.
* ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా ఇల్లు లేదా ఆఫీసు నుంచే పేమెంట్ ఇన్‌స్ట్రక్షన్లను ఇవ్వవచ్చు.
* క్యూలో నిలబడే అవసరం తప్పుతుంది.
* ఈ విధంగా చెల్లింపులు ఎటువంటి అదనపు రుసుములు లేకుండా ఉచితంగా
చేయవచ్చు.
* ఎల్ఐసీ వద్ద మీ అన్ని బ్యాంకు అకౌంట్లను నమోదు చేసుకుని ఏ ఖాతా నుంచైనా మీరు చెల్లింపులు చేయవచ్చు.
* మీ ఖాతా నుంచి ఎప్పుడు డబ్బులు డెబిట్ అవ్వాలో ముందుగా సైతం షెడ్యూల్
చేయవచ్చు.
* ప్రీమియం చెల్లింపులకు సంబంధించి రిమైండర్లను, అలర్టులను పొందుతారు.
* రెమిటెన్సులను మళ్లీ పోస్ట్‌లో, కొరియర్‌లో పంపే శ్రమను తప్పించుకోవచ్చు. ఆ ఖర్చు కూడా ఉండదు.
* అవుట్ స్టేషన్ ప్రీమియంల విషయంలో డీడీ లేదా పే ఆర్డర్ రుసుములను సైతం
లేకుండా చేసుకోవచ్చు.
* చెల్లించాల్సిన ప్రీమియంలను, ఇతర పాలసీ వివరాలను చూసుకోవచ్చు.

ఏ ఏ పాలసీలకు ప్రీమియంను ఈ విధానంలో చెల్లించవచ్చు?
ఏ పాలసీలయితే నెట్‌వర్క్‌డ్ బ్యాంకుల్లో కొనుగోలు చేసి ఉంటారో వాటిని, ఇంకా మ్యాన్(మెట్రో ఏరియా నెట్‌వర్క్), వ్యాన్(వైడ్ ఏరియా నెట్‌వర్క్) ద్వారా యాక్సెస్ చేయగలిగిన పాలసీల చెల్లింపులు నెట్‌బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు.
త్రైమాసికం, అర్ధ వార్షికం, వార్షిక రూపేణా చెల్లింపులు జరిపేలా తీసుకున్న సాధారణ పాలసీలన్నింటికీ ఈ విధంగా చెల్లింపులు చేయవచ్చు.
సింగిల్ ప్రీమియం, సాధారణ నెలవారీ ప్రీమియం, శాలరీ సేవింగ్ స్కీమ్ వంటి వాటికి ఈ నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరిపే వీలు లేదు.
ల్యాప్స్ అయిన పాలసీలు, ఇంకా పునరుద్దరణ అవ్వాల్సిన పాలసీలకు సైతం ఈ
సదుపాయం ఉండకపోవచ్చు. పాలసీలు యాక్టివ్‌గా ఉన్నవాటికే.

ఈ సౌకర్యానికి రుసుములుంటాయా?
ఈ సౌకర్యం పూర్తిగా ఉచితం.
ఎల్ఐసీకి బ్యాంకులతో, సర్వీసు ప్రొవైడర్లతో ఒప్పందం కుదిరింది. నెలవారీగా ఒక్కో లావాదేవీకి కొంత చొప్పున ఎల్ఐసీయే రుసుములను చెల్లిస్తుంది. కస్టమర్లకు ఎటువంటి చార్జీలు ఉండవు.

నెట్‌బ్యాంకింగ్ లేదా ఫోన్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులకు ఆథరైజేషన్ కలిగిన బ్యాంకులు, సంస్థలు..
బ్యాంకులు: HDFC Bank, ICICI Bank, Bank of Punjab, UTI Bank, Federal Bank, Corporation Bank, and Citibank
ఇతర సర్వీస్ ప్రొవైడర్లు: బిల్‌జంక్షన్.కామ్, టైమ్స్ఆఫ్‌మనీ.కామ్, బిల్‌డెస్క్.కామ్

ఆథరైజ్‌డ్ బ్యాంకుల వద్ద ఎవరు నమోదు చేసుకోవచ్చు?
ఆయా బ్యాంకుల్లో ఖాతా ఉన్న ఏ పాలసీదారుడైనా ఇందుకోసం నమోదు చేసుకోవచ్చు.
అయితే మీకు ఆ బ్యాంకులో నెట్‌బ్యాంకింగ్ సౌకర్యం కల్పించబడి ఉండాలి.
లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ల ద్వారా నెట్‌బ్యాంకింగ్‌ను వాడుకోవచ్చు.
నెట్‌బ్యాంకింగ్ గురించిన ఇతర సమాచారం కోసం బ్యాంకు వెబ్‌సైట్లో చూడండి.

ఆథరైజ్‌డ్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ఎవరు నమోదు చేసుకోవచ్చు?
ఎంపిక చేసిన నగరాల్లో ఏ బ్యాంకు ఖాతా ఉన్నా పాలసీదారులు సర్వీస్ ప్రొవైడర్ల వద్ద నెట్‌బ్యాంకింగ్ ద్వారా ప్రీమియం చెల్లించేందుకు నమోదు చేసుకోవచ్చు.
సర్వీస్ ప్రొవైడర్ మిమ్మల్ని రాతపూర్వక మ్యాండేట్ అడుగుతారు. మీ బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం కోసం ఎంత అవసరమో దాన్ని మినహాయించేందుకు అంగీకరిస్తే బ్యాంకు ఖాతా నుంచి నేరుగా డబ్బులు కట్ చేస్తారు.
సర్వీసు ప్రొవైడర్లు అడిగిన బ్యాంకు ఖాతా తదితర వివరాలను అందించాల్సి ఉంటుంది.

7. ఏఏ నగరాల్లో ఆథరైజ్‌డ్ సర్వీసు ప్రొవైడర్ల నెట్‌వర్క్ ఉంది?
బిల్‌జంక్షన్: ముంబయి, దిల్లీ, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణె
టైమ్స్ఆఫ్‌మనీ.కామ్: ముంబయి, దిల్లీ, బెంగళూరు
బిల్‌డెస్క్.కామ్: ముంబయి, దిల్లీ, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె, బరోడా, సూరత్.
బిల్‌డెస్క్ ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకు, ఏబీన్-ఆమ్రో బ్యాంకులతో టై అప్ అయింది.

ఆథరైజ్‌డ్(అధీకృత) బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్ల వద్ద మీ పాలసీ వివరాలను ఎలా యాడ్ చేయాలి?
బ్యాంకు లేదా సర్వీస్ ప్రొవైడర్లు అందించిన లాగిన్,పాస్‌వర్డ్‌ల సాయంతో అకౌంట్ పేజీలో లాగిన్ అవ్వాలి.
తర్వాత పేమెంట్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ ట్యాబ్‌లో ఎల్ఐసీలో బిల్లర్ జాబితాలో చేర్చుకోవాలి. ఆ సమయంలో పాలసీ నంబరు, ప్రీమియం, మెయిల్ ఐడీ, ఇతర సమాచారాన్ని ఇవ్వాలి.
ఒక్కో పాలసీకి ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications