చాలా రోజుల నుంచి వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ ఇంకా మంచి వడ్డీ రేట్లు అందించే 8 ఉత్తమ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను మేము సేకరించాం. ఎక్కువ మంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ రేటు అందిస్తున్న 8 బ్యాంకుల వివరాలను ఇక్కడ చూద్దాం.

1. రత్నాకర్ బ్యాంకు
బ్యాంకు డిపాజిట్లకు ఇప్పట్లో 8 శాతం వడ్డీ అంటే కాస్త కష్టమే. రత్నాకర్ బ్యాంకు 12 నెలల నుంచి 24 నెలల డిపాజిట్లకు 8 శాతం వడ్డీని ఇస్తోంది. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చే 7.5% తో పోలిస్తే ఇది ఉత్తమం.

2.స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు
ఇది విదేశీ బ్యాంకు. అయినప్పటికీ మంచి వడ్డీ రేటును అందిస్తోందంటే మంచిదనే చెప్పాలి. 376 నుంచి 390 లోపు కాలపరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 7.95 శాతం వడ్డీ రేటు వస్తోంది.

3. డీసీబీ బ్యాంకు
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు కంటే ఈ బ్యాంకు కొంచెం తక్కువ వడ్డీ రేటు అందిస్తోంది. 24 నెలల నుంచి 36 నెలల కాలపరిమితిలోపు ఎఫ్‌డీలకు 7.90 శాతం వడ్డీని ఇవ్వజూపుతున్నారు. ఇవి 2,3 ఏళ్ల డిపాజిట్లు కావును వడ్డీ రేట్లు తగ్గుతున్న ప్రస్తుతం కాలంలో మదుపుదార్లకు మంచిదే.

4. లక్ష్మీ విలాస్ బ్యాంకు
18 నెలల నుంచి 5 ఏళ్ల లోపు లక్ష్మీ విలాస్ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.90 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్‌కు కాస్త ఎక్కువగా 0.50 శాతం అదనపు వడ్డీ ఇస్తున్నారు. మొత్తమ్మీద సీనియర్ సిటిజన్స్ 8.40 శాతం వరకూ వడ్డీని అందుకోవచ్చు. అయితే ఇవన్నీ దీర్ఘకాల డిపాజిట్లని గమనించాలి.

5. ఎస్‌వీసీ కోఆపరేటివ్
ఎస్‌వీసీ కోఆపరేటివ్ బ్యాంకు 366 రోజుల డిపాజిట్లకు 7.90 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్స్ డిపాజిట్లకు 8.05 శాతం వడ్డీ వస్తుంది. మిగిలిన పోటీ సంస్థలతో పోలిస్తే ఇది బాగా ఉంది.

6. ఇండస్ఇండ్ బ్యాంకు
ఒక ఏడాది నుంచి 14 నెలల లోపు డిపాజిట్లకు 7.75 శాతం వడ్డీని ఇండస్ఇండ్ బ్యాంకు ఇస్తోంది. పెద్ద ప్రయివేటు రంగ బ్యాంకులతో పోల్చి చూసినప్పుడు ఇది ఉత్తమంగా ఉంది.

7. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా
ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల్లో ఇది ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తోంది. సంవత్సరం నుంచి 555 రోజుల లోపు డిపాజిట్లకు 7.57 శాతం వడ్డీ వస్తుంది.

8. ఇతర బ్యాంకులు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గరిష్టంగా 7.5 శాతం వరకూ వడ్డీ లభిస్తోంది. ఏడాది క్రితం వడ్డీ రేట్లతో పోల్చి చూసినప్పుడు ఇది బాగా లేదు. చాలా రోజుల నుంచి బ్యాంకుల డిపాజిట్ల వడ్డీ రేట్లు తగ్గించడం మూలాన ఇలా జరిగింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications