న్యూఢిల్లీ: భారత్‌లో రోజు రోజుకీ పెరిగిపోతున్న బంగారం అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు బులియన్ బోర్డును ఏర్పాటు చేయాలని, బంగారం లావాదేవీల కోసం స్టాక్ మార్కెట్ తరహాలో స్పాట్ ఎక్సేంజ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేంద్రం ప్రభుత్వం ఉంది.
ఈ మేరకు ప్రధాని మోడీ నేతృత్వంలోని మంత్రి వర్గం సోమవారం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం ప్రతిపాదిత గోల్డ్ రిఫార్మ్స్ అమలు విషయంలో ఎలా ముందుకు సాగాలన్న విషయమై చర్చించేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ప్రతినిధులు, బులియన్ వాటాదారులు, ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ అధికారులు, వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశమయ్యారు.

బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్
బంగారం వ్యాపారాన్ని మరింత పారదర్శకంగా, సులభతరంగా రూపొందించడమే లక్ష్యంగా 2016-17 వార్షిక బడ్జెట్‌లో రానున్న కొత్త ప్రతిపాదనలపై అరుణ్ జైట్లీ వీరితో చర్చించనున్నారు. దీంతో పాటు ముడి బంగారం దిగుమతిపై సుంకాలను విధించే అంశాన్ని కూడా పరిశీలించనున్నట్లు బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్
వాస్తవానికి గోల్డ్ రిపైనింగ్ కంపెనీలు బంగారానికి ఎటువంటి ఎక్సైజ్ సుంకాలనూ చెల్లించకుండా దిగుమతులు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని మరింత కఠినం చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభఉత్వం ఉంది. దిగుమతి సుంకాన్ని విధించే అంశంలో పలు గోల్డ్ కంపెనీలు, బులియన్ సంస్థలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి.

బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్
దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్ మోనటైరైజేషన్ పథకంపై ప్రజలకు మరితం అవగాహన కల్పించేందుకు మరికొన్ని రాయితీలను ప్రకటించాలని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బులియన్ బోర్డుతో పాటు స్పాట్ ఎక్సేంజ్
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగర సమీపంలో నిర్మించతలపెట్టిన గిప్ట్ సిటీ (గోల్డ్ సెజ్)పైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. బంగారంపై తీసుకోనున్న సంస్కరణల విషయంలో ఐఐఎమ్ అహ్మాదాబాద్ అందించిన నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications