For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అపోలో మ్యూనిచ్ క్రిటికల్ అడ్వాంటేజ్ రైడర్

By Nageswara Rao
|

అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తాజాగా ఆరోగ్య బీమా రంగంలోకి క్రిటికల్‌ అడ్వాంటేజ్‌ పేరిట తీవ్ర అనారోగ్యాల రక్షణకు ఒక రైడర్‌ను ప్రవేశపెట్టింది. ఈ రైడర్ వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ఈ రైడర్‌ను ఎంచుకున్న వారు ఎనిమిది రకాలైన తీవ్ర అనారోగ్యాల పాలైతే నగద రహిత విదేశీ చికిత్సను అందించనున్నారు.

అంతేకాదు ఈ విదేశీ చికిత్సకు పాలసీదారుడితో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు వారితో ప్రయాణం చేసేందుకు వీలు కల్పించింది. ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి 2.5 లక్షల డాలర్లు (కోటిన్నర రూపాయలు) కాగా రెండోది 5 లక్షల డాలర్లు (మూడు కోట్ల రూపాయలు).

ఈ రైడర్‌ తీసుకున్న వారికి విదేశంలో చికిత్స, విదేశీ ప్రయాణం, నివాసం వంటి అంశాల్లో అపోలో మ్యూనిచ్‌ ఎగ్జిక్యూటివ్‌లు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు.

 Apollo Munich Health Insurance introduces Critical Advantage rider

ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఎవరు అర్హులంటే?
అపోలో కంపెనీ అందిస్తున్న ఈజీ హెల్త్‌, ఆప్టిమా రెస్టోర్‌ ప్లాన్ల కింద 10 లక్షలకు పైబడి బీమా చేయించుకున్న పాలసీదారులు ఈ రైడర్‌ తీసుకునేందుకు అర్హులని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఏయే చికిత్సలకు కవరేజీ?
న్యూరోసర్జరీ, క్యాన్సర్‌, కరోనరీ ఆర్టరీ బైపాస్‌ సర్జరీ, హార్ట్‌ వాల్వ్‌ రిప్లే‌స్ మెంట్‌/రిపేర్‌, లైవ్‌ డోనర్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌, పల్మనరీ ఆర్టరీ గ్రాఫ్ట్‌ సర్జరీ, ఓర్టా గ్రాఫ్ట్‌ సర్జరీ, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌.

35 ఏళ్లు ఉన్న ఓ వ్యక్తి 2.5 లక్షల డాలర్ల రైడర్‌ను ఎంచుకుంటే సంవత్సరానికి రూ. 7.767 చెల్లించాల్సి ఉంటుంది. అదే 5 లక్షల డాలర్ల రైడర్‌ను ఎంచుకుంటే సంవత్సరానికి రూ. 8,947 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు పన్నులు అదనం.

English summary

అపోలో మ్యూనిచ్ క్రిటికల్ అడ్వాంటేజ్ రైడర్ | Apollo Munich Health Insurance introduces Critical Advantage rider

Leading health insurance company, Apollo Munich Health Insurance has launched Critical Advantage, a critical illness rider that not only covers treatment for 8 illnesses abroad, but also covers the travel and accommodation of one family member, in addition to the insured on cashless basis.
Story first published: Monday, February 15, 2016, 14:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X