దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా దక్షిణ కొరియాలోని సియోల్‌లో తన తొలి శాఖను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఆర్ధిక కార్యకలాపాల వృద్ధి కోసమే సియోల్‌లో కొత్త శాఖను ప్రారంభిస్తున్నట్లు ఎస్బీఐ మేనేజింగ్ డెరైక్టర్ బి.శ్రీరామ్ తెలిపారు.
దక్షిణ కొరియాలో భారతీయ బ్యాంకు శాఖను ప్రారంభించిన రెండో బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది. అంతకముందు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు తన శాఖను సియోల్‌లో ఏర్పాటు చేసింది. ఎక్స్‌ఫోర్ట్-ఇంఫోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియాతో ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు రూ. 3,300 కోట్ల క్రెడిట్ ఒప్పందాలను కుదుర్చుకుంది.

ఎస్బీఐ సియోల్ శాఖ పారిశ్రామికవేత్తలకు రిటైల్ బ్యాంకింగ్‌తో సహా ట్రెడ్ ఫైనాన్స్, సిండికేటెడ్ రుణాలు, కార్పొరేట్ డిపాజిట్స్ వంటి తదితర సేవలను అందిస్తుందని ఆయన తెలిపారు. అలాగే రిటైల్ కస్టమర్లకు సేవింగ్స్, కరెంట్ అకౌంట్, టర్మ్ డిపాజిట్స్, రెమిటెన్స్ వంటి తదితర సేవలను అందిస్తుందని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దాదాపు 135కి పైగా శాఖలు ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications