ముంబై: స్టార్టప్ కంపెనీల్లో ప్రత్యేకించి ఈకామర్స్ దిగ్గజ వెబ్‌సైట్లకు టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మద్దతు వెల్లువెత్తుతోంది. తాజాగా పెంపుడు జంతువుల సంరక్షణ సేవలు అందించే ‘డాగ్ స్పాట్.ఇన్' అనే పోర్టల్‌లో రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు.

‘డాగ్ స్పాట్' లో రతన్ టాటా పెట్టుబడి
రతన్ టాటాతో పాటు యూటీవీ గ్రూప్ వ్యవస్థాపకుడు రూనీ స్క్రూలా, అశోక్ మిత్తల్, రిషీ పత్రి, ధీరజ్ జైన్, అభిజిత్ పాయ్ కూడా పెట్టుబడి పెట్టినట్లు ‘డాగ్ స్పాట్.ఇన్' సీఈఓ రాణా అతేయా వెల్లడించారు. అయితే టాటా ఎంతమేర పెట్టుబడి పెట్టారన్న విషయాన్ని మాత్రం అధెయో వెల్లడించలేదు.

‘డాగ్ స్పాట్' లో రతన్ టాటా పెట్టుబడి
రతన్ టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజం పెట్టుబడి పెట్టడం వల్ల తమకు ఒక మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగులూరు లాంటి మెట్రో నగరాల్లో పెంపుడు జంతువులకు మంచి గిరాకీ ఉందని, ఏడాదికి 30 శాతం వృద్ధితో ఈ రంగం వేగంగా విస్తరిస్తోందని ఆయన తెలిపారు.

‘డాగ్ స్పాట్' లో రతన్ టాటా పెట్టుబడి
'డాగ్ స్పాట్' బ్రాండ్ పేరు మీదనే ఉత్పత్తులను విక్రయించడంపై దృష్టి పెట్టామని, వచ్చే ఏడాదిలో తమ మొత్తం వ్యాపారం విలువను మూడు రెట్లు అభివృద్ధి చెందడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

‘డాగ్ స్పాట్' లో రతన్ టాటా పెట్టుబడి
ఇప్పటికే పలు ఈ కామర్స్ సంస్ధల్లో రతన్ టాటా పెట్టుబడి పెట్టి వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications