ముంబై: బంధువులకు, స్నేహితులకు మనలో చాలా మంది ఉద్యోగ నిమిత్తం లేదా గృహ రుణాలు తీసుకునే సందర్భంలో ఏ మాత్రం ఆలోచించకుండా షూరిటీ సంతకం చేస్తుంటారు. ఆ తర్వాత సమస్యల్లో పడుతుంటారు. అసలు షూరిటీ సంతకం చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తులు ఏంటో తెలుసుకుందాం.
సాధారణంగా బంధువు లేదా స్నేహితుడు అడిగాడని గుడ్డిగా వారి ఉద్యోగం లేదా గృహ రుణానికి షూరిటీగా సంతకం చేస్తుంటారు. మొహమాటానికి పోయి సంతకం పెడితే, వారు ఆ రుణం చెల్లించకపోతే ఆ భారం మీపై పడుతుంది. కాబట్టి హామీదారుగా ఉండేటప్పుడు అతని గురించి మీకు పూర్తిగా తెలుసుంటే మంచిది.
హామీ సంతకం పెడుతున్నామంటే... అసలు రుణగ్రస్తుడు అప్పు చెల్లించలేకపోతే నేను చెల్లించేందుకు పూచీ ఇస్తున్నానని అర్థం. రుణం తీసుకున్న వ్యక్తి ఆ బకాయిలు చెల్లించకపోతే, ‘సిబిల్'లో మీ పరపతి రేటింగ్ పడిపోతుంది. తద్వారా మీకు రుణం అవసరమైనప్పుడు బ్యాంకు వద్దకు వెళితే, బ్యాంకులు సారీ.. మీ పరపతి రేటింగ్ బాగోలేదు. మీకు అప్పు ఇవ్వడం మా వల్ల కాదని నిర్మొహమాటంగా చెప్పేస్తాయి.

జాగ్రత్త ముఖ్యం
బ్యాంకు ఎవరికైనా రుణం ఇచ్చేందుకు అంగీకరించి మీ షూరిటీ సంతకం కావాలని కోరితే, అతడి పరపతి రేటింగ్ సరిగా లేదని అర్ధం చేసుకోవాలి. సాధారణంగా రుణం తీసుకునే వ్యక్తి పరపతి రేటింగ్ సంతృప్తికరంగా లేకపోతేనే బ్యాంకులు వారి రుణ చెల్లింపు కోసం షూరిటీని కోరతాయి. ఈ విషయం తెలుసుకుంటే నిర్మొహమాటంగా ఎవరికీ సహ హామీ సంతకం చేయకుండా ఉంటారు.

షూరిటీగా సంతకం చేస్తున్నారా?
షూరిటీగా సంతకం పెట్టేముందు రుణగ్రస్తుడు చెల్లించలేని పక్షంలో ఆ రుణానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకోండి. ముఖ్యంగా రుణ మొత్తం, వడ్డీ రేటు, ప్రతి నెలా బకాయిలు చెల్లించాల్సిన తేదీ, చెల్లింపు ఆలస్యమైతే గ్రేస్ పీరియడ్ ఎంత? లాంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అసలు చెల్లింపుదారు బకాయిలు చెల్లించకపోతే ఈ భారం షూరిటీగా ఉన్న మీపై పడుతుంది కాబట్టి.

బ్యాంక్‌తో మందుస్తు చర్చలు
ఇంకొకరి గృహ రుణానికి మీరు షూరిటీ సంతకం చేయాల్సి వస్తే నియమ నిబంధనల గురించి ముందుగా బ్యాంక్‌తో చర్చించండి. ఈ విషయంలో అసలు రుణ గ్రహీతకు ఎంత హక్కుందో మీకూ అంతే హక్కు ఉంటుంది. అసలు రుణ గ్రహీతకు పంపే సమాచారం అంతటిని మీకు కూడా పంపాలని బ్యాంకును కోరవచ్చు. తద్వారా అసలు రుణ గ్రహీత బకాయిలు సకాలంలో చెల్లిస్తున్నాడా? లేడా? అనే విషయం ఎప్పటికపుడు తెలుస్తుంది.

మొదట్లో షూరిటీ ఇచ్చి, మధ్యలో తప్పుకోవచ్చా?
ఒకసారి షూరిటీ సంతకం చేస్తే మధ్యలో తప్పుకునే అవకాశం ఉండదు. కాబట్టి షూరిటీ సంతకం పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవడం మంచిది. తప్పదు అనుకుని సంతకం చేస్తే, అసలు రుణగ్రహీత చెల్లించలేని పరిస్థితి తలెత్తితే బ్యాంకు బకాయిలు తీర్చేందుకు వీలుగా ముందుగానే నిధులు సిద్ధం చేసుకోవడం మంచిది. లేకపోతే మీ పరపతి రేటింగ్ కూడా దెబ్బతింటుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications