న్యూఢిల్లీ: ఇకపై పీఎఫ్ ఖాతా నుంచి సొమ్మును ఉపసంహరించుకునేందుకు ఉద్యోగులు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం ఉద్యోగి పనిచేసే/పని చేసిన సంస్ధ అటెస్టేషన్ అక్కర్లేదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో తెలిపింది.
అయితే సార్వత్రిక ఖాతా నంబరు (యూఏఎన్) యాక్టివేట్ చేసుకొని, అకౌంట్‌కు కేవైసీ వివరాలను అనుసంధానం చేసుకున్నవారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు సొమ్ము ఉపసంహరణ క్లెయిమ్‌లపై ప్రస్తుత లేదా మాజీ యాజమాన్యం నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంది.

ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ ఉపసంహరణ: సంస్ధ అటెస్టేషన్ అక్కర్లేదు
'పీఎఫ్ ఉపసంహరణకు సంస్థ ధ్రువీకరణ లేకుండా దాఖలు చేసే దరఖాస్తు పత్రం 19 యూఏఎన్, 10-సీ యూఏఎన్, 31 యూఏఎన్ లను నేరుగా ఈపీఎఫ్ఓ కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో పంపాలని, ఇందువల్ల త్వరగా పరిష్కరించేందుకు వీలవుతుంది' అని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది.

ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ ఉపసంహరణ: సంస్ధ అటెస్టేషన్ అక్కర్లేదు
ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని, ఇకపై ఈ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాలని ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ సూచించింది. అయితే ఖాతాదారులు రాతపూర్వకంగా కూడా తమ దరఖాస్తులను నేరుగా తమ ప్రాంత పీఎఫ్ కమిషనర్‌కు అందజేయవచ్చని కూడా పేర్కొంది.

ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ ఉపసంహరణ: సంస్ధ అటెస్టేషన్ అక్కర్లేదు
ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ ఉపసంహరణ సదుపాయాన్ని పూర్తిస్థాయిలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర పీఎఫ్ కమిషనర్ కేకే జలాన్ తెలిపారు. కాగా ఈపీఎఫ్‌ఓను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించనున్నట్లు ఆయన తెలిపారు.

ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ ఉపసంహరణ: సంస్ధ అటెస్టేషన్ అక్కర్లేదు
ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ 10 జోన్లలోని 123 కార్యాలయాల్లో 24,000 ఉద్యోగాలున్నాయని పేర్కొన్నారు. అయితే ఇందులో తొలివిడతలో భాగంగా 6,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని కార్మిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


Click it and Unblock the Notifications