న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసును చెక్ జారీ చేసిన చోట పెట్టాలా లేదంటే బౌన్స్ అయిన ప్రాంతంలోనా పెట్టాలా అనే దానిపై సందిగ్ధత వీడింది. ఏ బ్యాంకులో అయితే చెక్ బౌన్స్ అయిందో ఇక నుంచి అక్కడే కేసును నమోదు చేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.
దేశ వ్యాప్తంగా పుట్టల్లా పెరిగిపోయిన చెక్ బౌన్స్ కేసులపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతుండటంతో వీటిని త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న చట్టాల్లో మార్పులు చేశారు.

ఈ క్రమంలో ద నెగోషియబుల్ ఇన్‌స్ట్ర్‌మెంట్స్ సవరణ చట్టం- 2015కు గత శనివారం నాడు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇటీవల పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ చట్టానికి ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. కాగా, దేశవ్యాప్తంగా 18 లక్షల చెక్‌బౌన్స్ కేసులు నమోదైనట్లు అంచనా.
వీటిలో 38 వేల కేసులు పలు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే చెక్ బౌన్స్ కేసును ఎక్కడ నమోదుచేయాలన్న విషయంపై కొంత వివాదం నెలకొంది. లిటిగేషన్‌కు సంబంధించినవారు వివిధ ప్రాంతాల నుంచి రాకపోవడంతో చెక్‌బౌన్స్‌ల కేసులపై హైకోర్టులు నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి.
దీంతో ఈ కొత్త చట్టం దీనికి పరిష్కారం చూపనుండటంతో పాటు సత్వరం విచారణ పూర్తయ్యేందుకు మార్గం చూపనుంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications