మీ స్నేహితుడు, మీరు ఒకే సమయంలో లైఫ్ కవర్ కోసం ఓ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే మీరు చెల్లిస్తున్న ప్రీమియం ఎక్కువగా ఉందని భావిస్తున్నారా? అయితే నిరాశ చెందొద్దు. ఇన్సూరెన్స్ సంస్థలు వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని మీరు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని నిర్ణయిస్తాయి.
ఇన్సూరెన్స్ పాలసీని అందించే సంస్ధలు ఒక పాలసీకి ప్రీమియాన్ని నిర్దేశించడానికి ముందు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయో ఒక్కసారి చూద్దాం.
వయసు:
మీరు తీసుకున్న పాలసీ యొక్క ప్రీమియాన్ని నిర్ణయించడంలో వయసు కీలకపాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు 35 ఏళ్ల వయసున్న వ్యక్తితో పోలిస్తే 25 ఏళ్ల వయసున్న వ్యక్తి తక్కువ ప్రీమియాన్ని చెల్లిస్తుంటాడు. కారణం 35 ఏళ్ల వయసున్న వ్యక్తి త్వరగా జబ్బు బారిన పడటమే.
జెండర్:
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తారనేది మనందరికీ తెలిసిందే. ఈ కారణంతోనే ఇద్దరూ ఒకే వయసులో ఉన్నా పురుషుడి కంటే మహిళలు తక్కువ ప్రీమియంను చెల్లిస్తుంటారు.
అలవాట్లు:
సాధారణంగా మీ ఆరోగ్య అలవాట్లను బట్టి కూడా మీరు చెల్లించాల్సిన ప్రీమియాన్ని ఇన్సూరెన్స్ సంస్ధలు నిర్ణయిస్తాయి. సాధారణంగా ధూమపానం, మద్యపానం చేసే వారు త్వరగా జబ్బు బారిన పడుతుంటారు. దీని వల్లే ఆరోగ్యంగా జీవించే వారితో పోలిస్తే పై అలవాట్లు ఉన్న ఎక్కువ ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
కుటుంబ ఆరోగ్య చరిత్ర:
క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బు మరియు మధుమేహం లాంటి వ్యాధులు వంశపారపర్యంగా సంక్రమిస్తుంటాయి. ఒకవేళ ఇటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో మీరు గనుక ఉన్నట్లైతే మీరు తప్పనిసరిగా ఎక్కువ ప్రీమియం చెల్లించాలి.
ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి:
జీవిత బీమా పాలసీని అందించే సంస్ధలు ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ముఖ్యంగా పాలసీదారుడి ఎత్తు, రక్త పీడనం, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయి, విటమిన్ & పోషక లోపాలు, ఇతర ఆరోగ్య మాతృకలను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. పైన పేర్కొన్న వాటిల్లో ఏదైనా జబ్బులను పాలసీదారుడు కలిగి ఉంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రమాదంలో మీ జీవితం:
పైన పేర్కొన్న జబ్బులే కాకుండా మిగతా కొన్ని అంశాలు కూడా మీ జీవితాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్సూరెన్స్ సంస్ధలు ప్రీమియాన్ని లెక్కిస్తాయి. మీకు గనుక స్కై డైవింగ్, సముద్ర డైవింగ్ మరియు పర్వతారోహణ లాంటి ఆటల్లో ప్రావీణ్యం ఉన్నట్లైతే ప్రీమియం మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. మీరు గనుక పైలెట్ లేదా ఫైర్ ఫైటర్ అయితే మీ ప్రీమియం పెద్దమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక చేసుకునే ఇన్సూరెన్స్ ప్లాన్:
మీరు ఎంపిక చేసుకునే ఇన్సూరెన్స్ ప్లాన్‌ని బట్టి కూడా మీరు చెల్లించాల్సిన ప్రీమియం ఆధారపడి ఉంటుంది. మీరు గనుక టర్మ్ ప్లాన్‌ని ఎంపిక చేసుకుంటే తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లిస్తారు. అదే ULIPని ఎంపిక చేసుకున్నట్లైతే అటు బీమా కవరేజితో పాటు ఈక్విటీ మార్కెట్లో కూడా పెట్టుబడి పెట్టనట్లు అవుతుంది.
పైన పేర్కొన్న ఏడు అంశాలతో పాటు చిన్న చిన్న అంశాలు కూడా మీ ప్రీమియంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాదు మీరు చెల్లించే ప్రీమియాన్ని బట్టే మీ పాలసీ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. పాలసీ ఎంచుకునేటప్పుడే మీకున్న డౌట్ అనిపించే అన్ని ప్రశ్నలకు సమాధానాలను అడిగి మరీ తెలుసుకుంటే ఎంతో మంచిది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications
