కొత్త పథకం: పిల్లల చదువులకు భరోసాగా
పిల్లలు పెద్దవారు కాగానే తల్లిదండ్రుల ఆలోచనలన్నీ పిల్లల చదువుల చుట్టే తిరుగుతూ ఉంటాయి. వారి చదువులకు రక్షణగా ఉండే పాలసీల గురించి ఆరా తీస్తుంటారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని మార్కెట్లో అనేక పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
తాజాగా కెనరా హెచ్ఎస్‌బీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైప్ ఇన్సూరెన్స్ 'స్మార్ట్ ప్యూచర్ ప్లాన్' పేరుతో పాలసీని అందిస్తోంది. ఈ పాలసీ తీసుకున్న పాలసీదారుడికి ఏదైనా జరిగితే వెంటనే పాలసీ మొత్తాన్ని చెల్లించడం, ఆ తర్వాత ప్రీమియాలన్నీ రద్దవడం, వ్వవధి తీరాక మొత్తం ఫండ్ విలువ చెల్లించడం ఈ పాలసీలోని ప్రధానాంశాలు.

కొత్త పథకం: పిల్లల చదువులకు భరోసాగా
ప్రీమియం చెల్లింపును బట్టి ఎంత మేరకు రక్షణ లభిస్తుందనేది ఆధారపడి ఉంటుంది. వీలును బట్టి బీమా రక్షణను పెంచుకోవాడనికి, తగ్గించుకోవడానికీ అవకాశం ఉంది. మొత్తం ఐదు ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు వీలుంది. 0 నుంచి 100 శాతం వరకూ ఈ క్విటీలకూ కేటాయించే అవకాశం కూడా ఉంది.

కొత్త పథకం: పిల్లల చదువులకు భరోసాగా
ఒక్కో ఫండ్‌లో నిర్ణీత శాతం చొప్పున మదుపు చేసే సౌకర్యమూ అందిస్తోంది. 18 ఏళ్ల పైబడిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ వ్యవధి 10, 15, 20, 25 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రీమియం చెల్లింపు వ్యవధిని 10 నుంచి 20 ఏళ్ల మధ్యలో ఎంచుకోవచ్చు.

కొత్త పథకం: పిల్లల చదువులకు భరోసాగా
పదేళ్ల వ్యవధికి పాలసీని తీసుకుంటే కనీస వార్షిక ప్రీమియం రూ. 50,000 నెలవారీ రూ. 5,000 చెల్లించాలి. మిగతా వ్యవధులకు కనీస ప్రీమియం రూ. 25,000. నెల నెలా రూ. 3,000 గరిష్ట పరిమితి లేదు. చెల్లించిన వార్షిక ప్రీమియానికి 45 ఏళ్ల లోపు వారికి 10 రెట్ల బీమా వర్తిస్తుంది.

కొత్త పథకం: పిల్లల చదువులకు భరోసాగా
మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం సంక్రమించినప్పుడు పరిహారం అందేలా రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. వార్షిక ప్రీమియం రూ. 50 వేల చొప్పున 15 ఏళ్ల పాటు చెల్లిస్తే 4 శాతం రాబడి అంచనాతో రూ. 8,18,421 వచ్చే అవకాశం ఉంది. అదే 8 శాతం వార్షిక రాబడితో అంచనా వేసుకుంటే రూ. 11,38,968 దాకా వస్తుందని బీమా సంస్థ పేర్కొంది.


Click it and Unblock the Notifications