దసరా పండుగ ముగిసింది. దీపావళి రాబోతుంది. గృహోపకరణాల దగ్గర నుంచి దుస్తుల దాకా ఎక్కడ చూసిన భారీ రాయితీలతో స్వాగతం పలుకుతుంది. మరీ ముఖ్యంగా ఈ కామర్స్ వెబ్‌సైట్లు వినియోగదారులను ఆకర్షించేందుకు కార్డులపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నారు.
పండుగను పురస్కరించుకుని రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు కొనండి. ఈఎంఐ పద్దతిలో చెల్లించండి అంటూ క్రెడిట్ కార్డులు, వెబ్‌సైట్లు సైతం భరోనిస్తున్నాయి. పైగా 5, 10 శాతం క్యాష్ బ్యాక్ అంటూ ఊరిస్తున్నాయి.
ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నా, ఆచరణలో కొంత ఇబ్బంది. సాధారణంగా పండుగ సీజన్‌లో సాధారణ స్థాయిని మించి కొంచెం ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. ఈ ఈఎంఐల మాటున దాగున్న దాగిన రహస్యాలు తెలుసుకోకుంటే జేబుకు భారం అయిపోవడం ఖాయం.

సౌలభ్యంగా ఉంటుంది
క్రెడిట్ కార్డు మీద భారీ మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు ఈఎంఐ చెల్లించడం ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. గతంలో బ్యాంకుకు ఫోన్ చేసి, నెలసరి వాయిదాలుగా మార్చమంటేనే మార్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కార్డు సంస్ధలే ఎస్ఎంఎస్ పంపించి, ఈఎంఐగా మార్చాలా వద్దా అని అడుగుతున్నాయి.

సౌలభ్యంగా ఉంటుంది
బ్యాంకు ఆన్‌లైన్ ఖాతాలోకి లాగిన్ అయి సులభంగా ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇది కార్డులను బట్టి మారుతుంది. అనుకున్న సమయంలో డబ్బు లేనప్పుడు ఈ సౌకర్యం మంచిదే. అయితే అన్నింటికి ఇదే మంత్రం జపిస్తే మాత్రం ఆర్ధికంగా అప్పులు ఊబిలోకి వెళ్తారు.

పెరిగిన వడ్డీ
వడ్డీ కూడా పెరిగింది. ఇప్పుడు 12 శాతం నుంచి 14 శాతం వరకే విధిస్తున్నారు. అయితే, ఎంపిక చేసిన వస్తువులు, దుకాణ సముదాయాలు, వెబ్‌సైట్లలో ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు జీరో శాతం వడ్డీకి కూడా ఈఎంఐగా మార్చుకునే సౌకర్యాన్ని క్రెడిట్ కార్డు సంస్థలు కల్పిస్తున్నాయి.

పరిమితికి లోబడే
ఈఎంఐ చెల్లించినన్ని రోజులూ మీ కార్డు పరిమితిని గరిష్టంగా ఉపయోగించుకోలేరు. ఉదాహరణకు మీ కార్డు గరిష్ఠ పరిమితి రూ. 50,000 అనుకుందాం. ఇందులో నుంచి రూ. 20 వేలు టీవి కొన్నారని అనుకుందాం. ఇలాంటి సందర్భంలో మిగిలిన రూ. 30వేలను మాత్రమే మీరు ఉపయోగించుకోగలరు.

ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు
క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే వడ్డీతో పాటు అదనగం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు. ఇది మీ కొనుగోలు మొత్తాన్ని బట్టి మారుతుంది. కనీసం రూ. 199 నుంచి గరిష్టంగా రూ. 700 వరకూ వసూలు చేస్తారు. కొన్ని బ్యాంకులు 1 శాతం నుంచి 1.5 శాతం కూడా వసూలు చేస్తుంటాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications