వయసుని బట్టి పెడ్డుబడులు పెడ్డుకుంటూ పోతే, భవష్యత్తులో ఇబ్బందులు లేని జీవితాన్ని గడపవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నతనం నుంచే ఆదాయం, ప్రాధాన్యతలు, ఖర్చు పెట్టే అలవాట్లను సైతం దృష్టిలో పెట్టుకుని నిపుణులు ముందుకు సాగాలంటున్నారు.
జీవితంలో ఎదుగుతున్న కొద్దీ జీవనగమనం ఎలా మారుతుందో, పెట్టుబడుల విధానం కూడా అదే విధంగా మారాల్సి ఉంది. పెట్టుబడి పెట్టాలంటే, ముందుగా ఆదాయాన్ని సంపాదించాలి. సాధారణంగా తక్కువ వయసులో పెట్టుబడి మొదలు పెడితే, అంత ఎక్కువ రాబడిని పొందేవీలుంటుంది.

చిన్నతనంలో
తక్కువ వయసులో పెట్టుబడి పెట్టాలనుకునే వారు రిస్క్ ఎక్కువగా ఉండే పథకాలను ఎంచుకుంటే మరింత రాబడిని పొందవచ్చు. పెళ్లికి ముందు మీపై ఎవరు ఆధారపడి ఉండరు కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టొచ్చు.

పెళ్లికి ముందు
సంపాదనలో 60 శాతం నుంచి 70 శాతాన్ని పొదుపు చేసే అవకాశం ఉంది. యూలిప్ బాండ్లు, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకాల్లో పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి.

పెళ్లి తర్వాత
పెళ్లి అయిన తర్వాత ఆర్ధికంగా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఖర్చులు సైతం పెరుగుతాయి. దీంతో స్వల్పకాలిక పెట్టుబడులు పెట్టడం మంచిది. రిస్క్ తక్కువగా ఉండే పథకాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. అంతేకాదు ఎప్పుడూ తగినంత డబ్బును బ్యాంక్‌లో నిల్వ ఉంచుకోవాలి. ఈ దశలో 30 నుంచి 50 శాతం పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.

హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్, యూలిప్‌లలో పెట్టుబడి
డెట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఈక్విటీల్లో మదుపు చేయవచ్చు. తండ్రి అయిన తరువాత, ఖర్చులు మరింతగా పెరిగి, అసలు రిస్క్ తీసుకునే అవకాశమే లభించదు. ఈ దశలో సంపాదనలో 30 శాతమే సేవింగ్స్ చేయగలుగుతారు. హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్, యూలిప్, బంగారం, చైల్డ్ ప్లాన్స్‌లో పెట్టుబడులు మంచిది.

పదవీ విరమణ
ఇక పదవీ విరమణ వేళ, మీ పెట్టుబడులన్నీ ఓ సారి సమీక్షించుకోవాలి. ఖర్చుల కోసం అధిక డబ్బు అందుబాటులో ఉంచుకుని, స్వల్పకాల పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వాలి. వచ్చే ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని సీనియర్ సిటిజన్స్ స్కీముల్లో, పెన్షన్ ప్లాన్లలో, ఫిక్సెడ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు.


Click it and Unblock the Notifications