హైదరాబాద్: భారత్‌లో బంగారానికి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అధికారిక అంచనాల ప్రకారం భారత్‌లో అమ్ముడైన బంగారం ఎంతో తెలుసా? దాదాపు 5,300 కిలోలు. దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లోని అమ్ముడైన బంగారం లెక్కలు దీనికి అదనం.
ధన్‌తేరస్, దీపావళి పండుగలు రావడంతో వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేసే అవకాశం ఉండటం ఇందుకు కారణమని నిపుణులు వెల్లడించారు. ఈ సీజనులో బంగారం ధరలు తగ్గడం కూడా అమ్మకాలు గణనీయంగా పెరిగేలా చేశాయని, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఎక్కువ విక్రయాలు సాగాయన్నారు.
గత కొంతకాలంగా బంగారం ధరలు గణనీయంగా తగ్గడంతో ఈ ఏడాది మూడో త్రైమాసికానికి(జూలై-సెప్టెంబర్) డిమాండ్ 13 శాతం పెరిగి 268.1 టన్నులకు చేరుకున్నదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. సాధారణ రోజులతో పోలిస్తే ఈ సీజనులో 25 శాతం వరకూ అమ్మకాలు పెరిగాయన్నారు.

3 రోజుల్లో 5 టన్నుల బంగారం కొన్నారు
2013లో దీపావళి నాడు గ్రాము బంగారం ధర రూ. 2,850గా ఉండగా, ఈ సంవత్సరం అది రూ. 2,450కి తగ్గింది. కాగా, ఈ సంవత్సరం రూ. 4,800 కోట్ల విలువైన బాణసంచా అమ్మకాలు సాగాయని, గతంతో పోలిస్తే ఇది తక్కువేనని శివకాశి ఫైర్ క్రాకర్స్ అసోసియేషన్ వెల్లడించింది.

3 రోజుల్లో 5 టన్నుల బంగారం కొన్నారు
ప్రధాని మోడీ ఇటీవల ప్రారంభించిన పసిడి పథకాలపై వినియోగదారులు దృష్టిసారించే అవకాశం ఉండటం కూడా బంగారం డిమాండ్ పెంచేందుకు పరోక్షంగా కారణమైందని డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ సోమసుందరం తెలిపారు. ఈ ఏడాది పసిడి దిగుమతులు 850 నుంచి 950 టన్నుల మధ్యలో నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

3 రోజుల్లో 5 టన్నుల బంగారం కొన్నారు
బంగారం దిగుమతి విషయానికి వస్తే 5.8 శాతం పెరిగి రూ.62,939 కోట్లుగా నమోదైందని తాజా నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో డిమాండ్ 238.2 టన్నులుగా ఉంది. దీంట్లో ఆభరణాల డిమాండ్ 15 శాతం వృద్ధి చెంది 211.1 టన్నులకు చేరుకుంది. వీటి విలువ 7.7 శాతం పెరిగి రూ.49,558 కోట్లకు చేరుకుంది.

3 రోజుల్లో 5 టన్నుల బంగారం కొన్నారు
గడిచిన త్రైమాసికం మొదట్లో ధరలు భారీగా తగ్గడం, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభంకావడటంతో వినియోగదారులు ముందుగానే కొనుగోళ్లు జరపడం ఇందుకు కారణమని డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ సోమసుందరం తెలిపారు. గడిచిన త్రైమాసికం మొత్తానికి భారత్ 300.6 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది.


Click it and Unblock the Notifications