ముంబై: ప్రముఖ మొబైల్ డిజిటల్ వాలెట్ సంస్ధ పేటీఎం భారత్‌లోని ప్రధాన బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. పాలసీదారులు ఆన్‌లైన్ ద్వారా తమ ప్రీమియం చెల్లింపులు జరిపేందుకు బీమా సంస్థలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని సంస్ధ వెల్లడించింది.

పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌లో బీమా ప్రీమియం చెల్లింపు
ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం చివరికల్లా రూ. వెయ్యి కోట్ల ప్రీమియం చెల్లింపులు జరపాలని లక్ష్యంగా సంస్ధ పెట్టుకున్నట్లు తెలిపారు. పాలసీదారులు ఆన్‌లైన్ ద్వారా ప్రీమియంలు చెల్లించేందుకు గాను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, రెలిగేర్ హెల్త్, రిలయన్స్ లైఫ్, రిలయన్స్ జనరల్ సంస్థలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది.

పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌లో బీమా ప్రీమియం చెల్లింపు
వచ్చే మార్చినాటికి దాదాపు 15 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు పేటీఎం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి చెప్పారు. పాలసీదారులు సులభంగా చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమన్నారు.

పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌లో బీమా ప్రీమియం చెల్లింపు
పేటీఎంకు ఉన్న 10 కోట్ల మంది నమోదిత యూజర్లు సులభంగా బీమా పాలసీల ప్రీమియంలను చెల్లించవచ్చని తెలిపారు. మొబైల్ రీ చార్జ్‌లతో పాటు అన్ని రకాల బిల్లు చెల్లింపులకు వన్ స్టాప్ షాప్‌గా పేటీఎంను తీర్చిదిద్దడమే తమ ముందుున్న ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు.

పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌లో బీమా ప్రీమియం చెల్లింపు
ఈ మధ్య కాలంలో హోటల్ అగ్రిగేషన్ సేవలను ప్రారంభించిన తర్వాత పేటీఎంకు ఆర్‌బీఐ నుంచి చెల్లింపుల బ్యాంక్ లెసైన్స్ లభించిందన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో పేమెంట్ బ్యాంకులు ఇందులో రూ. 1200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications