పండుగ సీజన్ వచ్చిందంటే చాలు మనలో చాలా మంది కొత్త కారుని కొనుగోలు చేద్దామనే ఆలోచనలో ఉంటారు. ఇప్పటికే ఏ కారు కొనాలి? అనేది ముందుగానే నిర్ణయించుకుని ఉంటారు. అయితే కొత్త కారును లోన్ ద్వారా కొనుగోలు చేస్తే మంచిదా లేదా ఏక మొత్తంలో ఒకేసారి నగదు చెల్లించి కొనుగోలు చేస్తే మంచిదా అని ఆలోచిస్తుంటారు.
నిపుణుల ప్రకారం కారు కొనాలని అనుకున్నప్పుడు ఎంతో కొంత సొమ్ముని సిద్ధం చేసుకుని మిగతా సొమ్ము కోసం కారు లోన్ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అందు కోసం రుణం ఎంత తీసుకోవాలి? తర్వాత ఏ బ్యాంకును సంప్రదించాలి? అనేది నిర్ణయించుకోవాలి.
ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకుని ఎంచుకోవాలి. దీంతో పాటు పండుగ సీజన్‌లో కారు ఉత్పత్తిదారులే స్వయంగా అనేక రాయితీలను ప్రకటిస్తుంటారు. డీలర్లు సైతం రకరకాల ఆఫర్లు అందిస్తారు. ఇలాంటి వాటిని అందిపుచ్చుకుంటే మీకు కాస్త డబ్బు ఆదా అవుతుంది.

కారు కొంటున్నారా? సరైన లోన్ ఎంచుకోండి
కారు కోనుగోలు విషయంలో అన్ని లాంఛనాలూ పూర్తయి, ఇక కారును డెలివరీ తీసుకోవడమే మిగిలిందా? ఈ సమయంలో మీరు కారును పూర్తి స్థాయిలో పరిశీలించాలి. దీనినే ప్రీ డెలివరీ ఇన్‌స్పెక్షన్ (పీడీఐ) అంటారు. సాధారణంగా డీలర్లే దీనిని నిర్వహిస్తుంటారు. కానీ, మన వంతు బాధ్యతగా కారుని పూర్తి స్థాయిలో తనిఖీ చేసుకోవాలి.

కారు కొంటున్నారా? సరైన లోన్ ఎంచుకోండి
కారు లోపలా, బయటా క్షుణ్నంగా తనిఖీ చేయాలి. లోపల భాగాల్లో ఎక్కడైనా దుమ్ము పట్టి ఉందా? పూర్తిగా శుభ్రంగా ఉన్నాయా? చూసుకోండి. సాధారణంగా షోరూంలో ఉండే కొత్త కారు 50 కిలోమీటర్లకు మించి తిరగదు. ఒకవేళ 50 కిలోమీటర్లకు మించి తిరిగితే అందుకు కారణం అడిగి తెలుసుకోండి.
కారు కొంటున్నారా? సరైన లోన్ ఎంచుకోండి
కారుతోపాటు అదనపు టైరు, టూల్ కిట్ వస్తాయి. దీనికి తోడుగా మీరు బిగించుకునే అదనపు విడిభాగాలు అన్నీ సరిగా ఉన్నాయా లేదా సరి చూసుకోండి. దీంతో పాటు షోరూంలో ఉండే వారి వద్ద నుంచి మీ కారు గురించి అన్ని వివరాలూ అడిగి తెలుసుకోండి.

కారు కొంటున్నారా? సరైన లోన్ ఎంచుకోండి
చివరగా మీ కారుకు సంబంధించిన పూర్తి బిల్లులను తీసుకోవడం మర్చిపోకండి. దీంతో పాటు కారు బీమా పత్రాలను కూడా తీసుకోండి. వాహనానికి సంబంధించి అదనపు తాళంచెవి, వారంటీ పత్రాలు అన్నీ తీసుకోండి. వాహన రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నుకు సంబంధించిన పత్రాలనూ మర్చిపోకండి.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications