అమ్మాయి పుట్టగానే తల్లిదండ్రులు డబ్బు సంపాదనతో పాటు సంపాదించిన డబ్బును ఎలా ఆదా చేయాలనే విషయంపై దృష్టి సారిస్తుంటారు. ఈ క్రమంలో వేటిలో పడితే వాటిలో పెట్టుబడి పెడుతుంటారు.
కానీ, ప్రతి నెలా మీరు పెట్టే పెట్టుబడులు మీ చిన్నారి ఏ విధంగా ఉపయోగపడతాయో చూసుకోవడం కూడా ముఖ్యమే కదా. మీ చిన్నారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ పథకాలను ఎంటో చూద్దాం?
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో SIPs:
మీ చిన్నారి వయసు 1-10 సంవత్సరాలు ఉన్నాయని అనుకుందాం. ఈ సమయంలో మీరు మ్యూచువల్ ఫండ్ పథకమైన SIPలో 10-20 ఏళ్లకు పెట్టుబడి పెట్టాలనుకున్నారు. మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి మీ చిన్నారికి 20 ఏళ్లు వచ్చిన తర్వాత అందుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో నగదు మీకు అందుతుంది.
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి బ్యాంకు డిపాజిట్స్‌తో పోలిస్తే ఎక్కువ వడ్డీ కూడా వస్తుంది. ఈ క్రింద పట్టికలో దానికి సంబంధించిన వివరాలు క్లుప్తంగా ఇవ్వబడ్డాయి.

సుకన్య సమృద్ధి
ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం కింద బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డిపాజిట్లపై వడ్డీరేటును ప్రభుత్వం 9.2 శాతంగా నిర్ణయించింది. ఈ పథకం కింద 10 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వారికి 14 సంవత్సరాలు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు.

సుకన్య సమృద్ధిలో లోపాలు
ఈ ఖాతా తక్కువ కాల పరిమితి పెట్టుబడిదారులకు ఏవిధంగానూ హెల్ప్ అవదు. ఖాతాలో ఉన్న జమ అయిన డబ్బు 21 సంవత్సరాల తర్వాత మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకం కింద 10 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వారికి 14 సంవత్సరాలు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఇద్దరు బాలికలున్న తండ్రి రెండు ఖాతాల్లో విడివిడిగా సొమ్ముని జత చేయాల్సి ఉంటుంది. ముగ్గురు కూమార్తెలున్న తండ్రి మరో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచేందుకు వీలు లేదు.

కూతురి చదువు కోసం నెలవారీ మదుపు ఎలా?
సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఏయే బ్యాంకుల్లో తెరవచ్చు? తపాలా కార్యాలయాల్లో కానీ, అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఏ శాఖలోనైనా కానీ వెయ్యి రూపాయాల కనీస డిపాజిట్‌తో పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవవచ్చు. ఒక వార్షిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకు జమ చేసుకునేందుకు వీలుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
మీ చిన్నారి భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మరో అత్యుత్తమ పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సుకన్య సమృద్ధి యోజనలాగే ఇందులోని పెట్టుబడులకు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులోని పెట్టుబడులకు కాల పరిమితి ఉంటుంది. ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications