బ్యాంకులిచ్చే రుణాలపై వడ్డీ రేట్లకు బెంచ్ మార్క్‌గా భావించే రెపో రేటును 0.50 శాతం తగ్గిస్తున్నట్లుగా ఆర్‌బీఐ గవర్నర్ రఘరామ్ రాజన్ ప్రకటించారు. దీంతో ఈ రెపోరేటు 7.25 శాతం నుంతి 6.75 శాతానికి చేరింది. దీనికి తోడు రివర్స్ రెపో రేటు కూడా 5.75 శాతానికి చేరుకుంది.
రెపోరేటుని ఆర్‌బీఐ తగ్గించడం వల్ల మనకేంటి లాభం అని అందరి అనుకంటున్నారు. రెపో రేటు తగ్గించడం వల్ల బ్యాంకులకు కొంత తక్కువ వడ్డీకే ఆర్‌బీఐ నుంచి నిధులు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రయోజనాన్ని రుణాలకు సంబంధించి కస్టమర్లకు బదలాయిస్తే పారిశ్రామిక రంగానికి, అలాగే రిటైల్ విభాగానికి తక్కువ రుణానికే నిధులు అందుతాయి.
ఈ ప్రక్రియ మొత్తం బ్యాంకింగ్ రుణ వృద్ధికి, పారిశ్రామిక పురోగతికి, వ్యవస్థలో వినియోగం పెరగటానికి ఉపయోగడుతుంది. దీంతో పాటు ఆర్‌బీఐ రెపోరేటు తగ్గించిన నేపథ్యంలో ఇప్పటికే ఇల్లు, ఫ్లాట్ కొనుగోలు చేసిన, చేయాలనుకుంటున్న వారికి వడ్డీ రేట్ల భారం తగ్గనుంది. అంతేకాదు ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు పెరుగుతాయని స్థిరాస్తి సంస్ధలు ఆశిస్తున్నాయి.

రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ
గృహ, కారు రుణాలు, వినియోగ వస్తువులు, వ్యక్తిగత రుణాలు చౌక కానున్నాయి. దీంతో పాటు వినియోగదారులపై ఈంఐల భారం తగ్గనుంది. అంతేకాదు బ్యాంకులు కూడా సానుకూలంగా స్పందించి త్వరిత గతిన రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు వర్తింపచేయాలని రఘరామ్ రాజన్ సూచించారు.

రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ
ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించిన కొద్ది గంటల వ్యవధిలోనే మూడు ప్రధాన బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించి ఇతర బ్యాంకులకు మార్గనిర్దేశం చేశాయి. ప్రభుత్వ రంగంలోని ఎస్‌బిఐ 0.4 శాతం, ఆంధ్రా బ్యాంకు 0.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25 శాతం మేర బేస్‌రేటును తగ్గించాయి.

రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ
ఈ ఏడాది జనవరి నుంచి రెపో రేటును తగ్గించడం ఇది నాలుగోసారి. ఈ తగ్గింపుతో గత ఎనిమిది నెలల్లోనే రెపోరేటు 1.25 శాతం మేరకు దిగివచ్చింది. జనవరి, ఫిబ్రవరి, జూన్ నెలల్లో... 0.25 శాతం వంతున మూడు విడతలుగా తగ్గించారు. ఇతర కీలక రేట్లు ఎస్‌ఎల్‌ఆర్, సిఆర్‌ఆర్‌ను మాత్రం యథాతథంగా ఉంచారు.

రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ
ఆర్‌బిఐ నిర్ణయం నేపథ్యంలో సేవింగ్ డిపాజిట్లు, స్కీమ్‌లపై కూడా వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. పిపిఎఫ్, చిన్నమొత్తాల పొదుపు, పోస్టాఫీస్ సేవింగ్స్‌పై రేట్లను సమీక్షించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పంటల విస్తీర్ణంలో పెరుగుదల వల్ల ఉత్పాదకత కూడా పెరిగితే ఆహార ద్రవ్యోల్బణంపై ఒత్తిడి కూడా తగ్గవచ్చునని ఆర్‌బిఐ పేర్కొంది.

రెపోరేటుని తగ్గించడానికి అసలు కారణం
కమోడిటీ ధరలు కనిష్ఠ స్థాయిల్లో ఉన్నాయి. అంతర్జాతీయ డిమాండు కూడా గణనీయంగా తగ్గినందు వల్ల పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండు పెరగాలంటే దేశీయ డిమాండును పెంచాల్సి ఉంది. అప్పుడే పరిశ్రమలు తయారుచేసిన ఉత్పత్తి సామర్థ్యాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయి.


Click it and Unblock the Notifications