ప్రస్తుతం భారత్ స్టాక్ మార్కెట్లు వారంలో ఒకరోజు లాభాల్లో గడిస్తే, మిగిలిన ఆరు రోజులు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలో నాణ్యమైన షేర్లు తక్కువ ధరకే లభిస్తాయి. ఈక్విటీల్లో నేరుగా మదపు చేయలేని వారు మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి సారిస్తే మంచిది.
‘‘అందరూ అమ్మేటప్పుడు కొనండి, అదే విధంగా అందరూ కొనేటప్పుడు అమ్మండి'' అన్నది ఈక్విటీ మార్కెట్ సూత్రం. పెట్టుబడికి విభిన్న మార్గాలను ఎంచుకుని వనరుల విభజనను సరైన క్రమంలో షేర్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లలో క్రమశిక్షణ పెంచుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అనుసరించే ఈ సూత్రం భిన్న విభాగాలకు పెట్టుబడులను విస్తరించడం ద్వారా పెట్టుబడిదారుల రిస్క్‌ను గణనీయంగా తగ్గించుతుంది.

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి
మ్యూచువల్ ఫండ్స్‌లో ముఖ్యమైనవి బ్యాలెన్స్‌డ్ ఫండ్లు. సాధారణంగా బ్యాలెన్స్‌డ్ ఫండ్లు తాము సేకరించిన నిధుల్లో 65 శాతం ఈక్విటీల్లోను, 35 శాతం డెట్ ఉపకరణాల్లోను మదుపు చేస్తాయి. ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్లలో అసెట్ అలొకేషన్ లేదా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ కీలకమైనవి.

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి
మార్కెట్‌లో షేర్లు చౌకగా ఉన్న సమయంలో కొనుగోలు చేయడం, మార్కెట్స్ పెరుగుతున్న సమయంలో అమ్మడం లాంటివి మ్యూచువల్ ఫండ్ల స్కీమ్‌ల నిర్మాణం. దీని వల్ల దీర్ఘకాలిక రాబడులు ఆకర్షణీయంగా ఉంటాయి. విలువ ఆధారంగా ఈక్విటీ, డెట్ మధ్య నిష్పత్తి ఆటోమేటిక్‌గా మారే వెసులుబాటు అంతర్గత నిర్మాణంలోనే ఉన్నందు వల్ల మానవ తప్పిదాలకు కూడా ఆస్కారం ఉండదు.

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి
65 శాతం నిధులు ఈక్విటీల్లో మదుపు చేస్తున్నందు వల్ల ఇవి ఈక్విటీ ఫండ్ల తీరులోనే పన్ను ప్రయోజనాలు అందిస్తాయి. ఈ యూనిట్లను ఏడాదికి పైగా హోల్డ్ చేసినట్టయితే పన్ను మినహాయింపు ఉంటుంది. స్వల్పకాలంలో రీడీమ్ చేస్తే మాత్రం స్వల్పకాల క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్లకు మాత్రం పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది.

రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి
భారత స్టాక్ మార్కెట్ దీర్ఘకాలంలో మెరుగ్గానే ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో అన్ని శ్రేణుల ఇన్వెస్టర్లు అన్ని విభాగాల్లోను కొనుగోళ్లు చేయడం సరైన వ్యూహం. మీ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఈక్విటీ లేదా ఫిక్స్‌డ్ ఆదాయం అందించే సాధనాల్లో ఏది ఎం చుకోవాలన్నా మ్యూచువల్ ఫండ్లు చక్కని సాధనంగా నిలుస్తాయి. ఈక్విటీ మార్కెట్లో తొలిసారిగా అడుగు పెట్టాలని భావించే వా రు, ఒక మోస్తరు రిస్క్ భరించే వారికి ఇ లాంటి ఫండ్‌లు సర్వత్రా అనుకూలమైనవి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications