చిన్నవయసు నుంచే పదవీ విరమణ ప్రణాళికలు వేసుకునే వారి కోసం ప్రత్యేకించి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కొత్తగా ఆన్‌లైన్ పెన్షన్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని పేరు క్లిక్2రిటైర్. ఇది యూనిట్ ఆధారిత పెన్షన్ ప్లాన్.
ఈ పాలసీని 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ పాలసీ కనీస మెచ్యూరిటీ వయసు 45 ఏళ్లు. గరిష్టంగా ఈ పాలసీ మెచ్యూరిటీకి 75 ఏళ్లుగా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ పేర్కొంది.
ఒకేసారి ప్రీమియం చెల్లించే వారికి కనీస ప్రీమియం రూ. 50వేలుగా ఉంది. వార్షిక ప్రీమియం రూ. 24,000. ఆరు నెలలకొకసారి రూ. 12 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలలకొకసారి రూ. 6వేలు. నెలకొకసారి చెల్లిస్తే మాత్రం రూ. 2వేలు.

హెచ్‌డీఎఫ్‌సీ 'క్లిక్2రిటైర్' గురించి తెలుసుకోండి
ఈ క్లిక్2రిటైర్ పెన్షన్ పాలసీకి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. చెల్లించిన ప్రీమియంలో 100 శాతం పెట్టుబడులకే కేటాయించడం ఈ పాలసీ ప్రత్యేకత. అంతేకాదు ఈ పాలసీకి సంబంధించి నిర్వహణ రుసుములను కూడా వసూలు చేయరు.

హెచ్‌డీఎఫ్‌సీ 'క్లిక్2రిటైర్' గురించి తెలుసుకోండి
ఈ పాలసీలో పెట్టిన పెట్టుబడికి కనీస రక్షణ ఉండటం, మార్కెట్ వృద్ధి చెందినప్పుడు ఆ రాబడిని అందిస్తారు. ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించే సంఖ్యలో 5, 8, 10 ఏళ్లుగా చెల్లించవచ్చు. క్రమం తప్పకుండా చెల్లించే వారు పాలసీ వ్వవధి ఉన్నంతకాలం ప్రీమయం చెల్లించవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ 'క్లిక్2రిటైర్' గురించి తెలుసుకోండి
పాలసీ వ్వవధి పూర్తయిన తర్వాత కనీస హామీ మొత్తం లేదా యూనిట్ ఫండ్ విలువలో ఏది అధికంగా ఉంటే అది చెల్లిస్తారు. ఒకవేళ పాలసీ వ్వవధి తీరకుండానే పాలసీదారుడికి ఏదైనా జరిగితే పాలసీ మొత్తం, యూనిట్ విలువలో ఏది అధికంగా ఉంటే దానిని నామినీకి అందిస్తారు.

హెచ్‌డీఎఫ్‌సీ 'క్లిక్2రిటైర్' గురించి తెలుసుకోండి
మీరు చెల్లించిన మొత్తాన్ని పెన్షన్ ఈక్విటీ ఫండ్, పెన్షన్ ఇన్‌కం ఫండ్, పెన్షన్ కన్సర్వేటివ్ ఫండ్లలో మదుపు చేస్తారు. చెల్లించిన ప్రీమియానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ పరిమితి మేరకు మినహాయింపు కూడా వర్తిస్తుంది.


Click it and Unblock the Notifications