హెచ్‌డీఎఫ్‌సీ కొత్త పథకం: షేర్లతో ఆన్‌లైన్‌లో లోన్
బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్రవేస్తూ ముందుకు దూసుకెళ్తోన్న ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా కస్టమర్లు తమ డీమ్యాట్ అకౌంట్‌లోని షేర్లపై ఆన్‌లైన్‌లో లోన్ తీసుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ కొత్త పథకం: షేర్లతో ఆన్‌లైన్‌లో లోన్
లోన్ కోసం ఏయే షేర్లను ఎంతమేర తనఖా పెట్టదల్చుకున్నారో పరిమితులు కూడా మీరే స్వయంగా నిర్దేశించుకోవచ్చు. షేర్లను తనఖాపెట్టి కనిష్టంగా రూ. 1 లక్ష నుంచి గరిష్టంగా రూ. 20 లక్షల వరకూ రుణం పొందవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ కొత్త పథకం: షేర్లతో ఆన్‌లైన్‌లో లోన్
కస్టమర్లు ప్రత్యేకంగా బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని బ్యాంకు వర్గాలు వివరించాయి. ఇందుకోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో డీమ్యాట్ ఖాతా ఉన్న వారు తమ నెట్ బ్యాంకింగ్ అకౌంట్లోకి లాగిన్ అయి, డీ మ్యాట్ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.

హెచ్‌డీఎఫ్‌సీ కొత్త పథకం: షేర్లతో ఆన్‌లైన్‌లో లోన్
లోన్ మొత్తం, షేర్లను ఎంపిక చేసుకున్న తర్వాత లోన్ అకౌంట్ తెరవాలనుకుంటున్న శాఖ వివరాలను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత కస్టమర్ దరఖాస్తు అందినట్లుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ కొత్త పథకం: షేర్లతో ఆన్‌లైన్‌లో లోన్
ఈ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శాఖ నుంచి సిబ్బంది కస్టమర్ సంతకాలు తదితర వివరాలను తీసుకుంటారు. ఈ ప్రక్రియను నిర్వహించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారులు అతి తక్కువ సమయంలో సుమారు 4-8 రోజుల్లో పూర్తి చేస్తారని బ్యాంకు వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications