కొత్త పథకం: పీఎఫ్ సొమ్ముతో ఇల్లు కొనుగోలు
సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే ఉద్యోగులకు శుభవార్త. ఇకపై భవిష్యనిధిని తాకట్టు పెట్టడం ద్వారా తక్కువ ధరలో లభించే ఇళ్లను కొనుగోలు చేసే కొత్త పథకాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) త్వరలో ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలించనుంది.
దీనిపై ఈపీఎఫ్‌వో ట్రస్టీల కేంద్ర బోర్డు(సీబీటీ) ఈనెల 16న జరగబోయే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు జమ చేసిన పీఎఫ్ సొమ్మును ఇంటి కొనుగోలుకు అడ్వాన్స్‌గా జమకట్టుకోవడంతోపాటు భవిష్యత్‌లో జమచేయబోయే సొమ్మును ఈఎంఐ కింద జమకట్టేలా పథకాన్ని రూపొందించాలని గతంలో నిపుణుల కమిటీ ప్రతిపాదించింది.

పీఎఫ్ సొమ్ముతో ఇల్లు కొనుగోలు
ఈ పథకంలో భాగంగా ఇంటి కొనుగోలుకు రుణం ఇచ్చే బ్యాంకు, గృహ నిర్మాణ ఏజెన్సీ, పీఎఫ్ సొమ్ము ఈఎంఐ కింద జమకట్టేందుకు ఈపీఎఫ్‌వోల మధ్య ఒప్పందం కుదుర్చుకోవాలని కమిటీ సూచించింది. ఈపీఎఫ్ఓ చందాదారులుగా ఉన్న అల్ప ఆదాయం కలిగిన పీఎఫ్ ఖాతాదారులకు మాత్రమే వర్తింపజేయాలని ప్రతిపాదించింది.

పీఎఫ్ సొమ్ముతో ఇల్లు కొనుగోలు
ఈపీఎఫ్ఓ పింఛనుదారులు జీవన ధ్రువపత్రాలను డిజిటల్ రూపంలో పంపితే ప్రోత్సాహకాలు అందించాలనే ప్రతిపాదననూ పరిశీలించనున్నారు. 'జీవన్ ప్రమాణ్ పత్ర' పథకం కింద ఎలక్ట్రానిక్ రూపంలో ధ్రువపత్రాలను సేకరించనున్నారు.

పీఎఫ్ సొమ్ముతో ఇల్లు కొనుగోలు
ఈ ప్రతిపాదిత పథకంలో భాగంగా ఉద్యోగి, బ్యాంకు లేదా హౌసింగ్ ఏజన్సీ, ఈపీఎఫ్ఓల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదురుతుంది. బ్యాంకు నుంచి రుణం తీసుకుని కొనుగోలు చేసే ఇంటికి ఈపీఎఫ్ఓ నిధుల నుంచి నెలసరి ఈఎంఐలు చెల్లింపులు జరుగుతాయి.

పీఎఫ్ సొమ్ముతో ఇల్లు కొనుగోలు
హౌసింగ్ మినిస్ట్రీ, పట్టణ పేదరిక నిర్మూలన పథకాలకు వర్తించే అన్ని ఆదాయపు పన్ను ప్రోత్సాహకాలూ లభించే విధంగా నిబంధనలను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈనెల 16న జరిగే సీబీటీ సబ్ కమిటీ సమావేశంలో తుది ప్రతిపాదనలు చేసి ట్రస్టీల ముందు పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications