ఆన్‌లైన్ మదుపు సర్వీసుని అందిస్తున్న ఐసీఐసీఐ డైరెక్ట్ సంస్ధ తమ కస్టమర్ల కోసం పేపర్ దరఖాస్తులతో పని లేని పూర్తి ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ఖాతా ఒకటి ప్రారంభించింది. దాని పేరు ఇన్‌స్టా అకౌంట్. మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ సెబీ నిర్దేశించిన కేవైసీ నిబంధనలకు అనుగుణంగా భారత పౌరులందరూ ఈ అకౌంట్‌ను icicidirect.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ప్రారంభించవచ్చు.
మొబైల్‌లో
ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈ ఖాతాను తేలిగ్గా తెరవొచ్చు. ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కలిగి ఉన్న వారు కూడా తమ ఖాతా ద్వారా ఇన్‌స్టా అకౌంట్ ప్రారంభించవచ్చు. ఈ ఖాతా తెరిచేందుకు సంస్థ ఎలాంటి ఫీజు వసూలు చేయడంలేదు.

ఐసీఐసీఐ ఇన్‌స్టా అకౌంట్: ప్రయోజనాలు
ఇన్‌స్టా ఖాతా తెరవాలనుకునే వారు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓపెన్ అకౌంట్ క్లిక్ చేస్తే చాలు. మీ పేరు, ఇతర వివరాలు అడుగుతూ ఒక ఫారం వస్తుంది. దాన్ని ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసి పాన్ నంబర్, పుట్టిన తేదీ, ఇతర వివరాలు అందచేస్తే వన్‌టైమ్ పాస్‌వర్డ్ ఒకటి మీ మొబైల్‌కు వస్తుంది. ఆ వన్‌టైమ్ పాస్‌వర్డ్‌తో యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకుంటే మీ ఖాతా క్షణాల్లో రెడీ అయిపోతుంది.

ఐసీఐసీఐ ఇన్‌స్టా అకౌంట్: ప్రయోజనాలు
ఐసిఐసిఐ బ్యాంకు ఖాతాదారులైతే ఇన్‌స్టా అకౌంట్ సహాయంతో అదే క్షణంలో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు. ఇతర బ్యాంకు ఖాతాదారులైతే మాత్రం ఆ బ్యాంకు చెక్ స్కానింగ్ కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ చెక్ వెరిఫికేషన్ పూర్తయిన అనంతరం ఐసీఐసీఐ డైరెక్ట్ ఖాతా సహాయంతో పెట్టుబడుల ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు.

ఐసీఐసీఐ ఇన్‌స్టా అకౌంట్: ప్రయోజనాలు
ఇన్‌స్టా అకౌంట్ హోల్డర్లు వివిధ ఫండ్‌లు, మార్కెట్ గతిపై ఐసిఐసిఐ డైరెక్ట్ బృందం రూపొందించిన పరిశోధనా నివేదికలన్నీ అందుబాటులో ఉంటాయి. అలాగే పెట్టుబడి లాభాలకు సంబంధించిన సమాచారం, స్టేట్‌మెంట్లు, డివిడెండ్ సమాచారం అన్నీ రెడీగా అందుతాయి.

ఐసీఐసీఐ ఇన్‌స్టా అకౌంట్: ప్రయోజనాలు
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించిన సమగ్ర విశ్లేషణలు, ఆయా స్కీమ్‌ల పనితీరుకు సంబంధించిన విశ్లేషణ నివేదికలు కూడా అందుబాటులోకి వస్తాయి. క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం సెక్యూరిటీ మార్కెట్ లావాదేవీలకు కేవైసీ తప్పనిసరి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications