ఐసీఐసీఐ ప్రత్యేక ఆఫర్: బేస్‌రేటుకే గృహ రుణం

ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కొనుగోలు చేసే వినియోగదారులకు బేస్ రేటుకే గృహ రుణాలను అందించనున్నట్లు దేశీయ అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ 'సరళ్‌-రూరల్‌ హౌజింగ్‌ లోన్‌' పేరుతో ఈ ప్రత్యేక పథకాన్ని గ్రామీణ వినియోగదారుల కోసం తీసుకువచ్చినట్లు తెలిపింది.

ఈ పథకంలో భాగంగా రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల లోపు వరకు గృహ రుణాలకు బేస్‌ రేటునే కనీస వడ్డీరేటుగా ఆఫర్‌ చేయనున్నట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు బేస్‌ రేటు 9.70 శాతంగా ఉంది.

ఐసీఐసీఐ ప్రత్యేక ఆఫర్: బేస్‌రేటుకే గృహ రుణం

ఐసీఐసీఐ ప్రత్యేక ఆఫర్: బేస్‌రేటుకే గృహ రుణం

ఈ పథకం ప్రారంభం సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సబర్వాల్ మాట్లాడుతూ వెనుకబడిన వారిని ఆర్థికంగా చేయుతనివ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఐసీఐసీఐ ప్రత్యేక ఆఫర్: బేస్‌రేటుకే గృహ రుణం

ఐసీఐసీఐ ప్రత్యేక ఆఫర్: బేస్‌రేటుకే గృహ రుణం

గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు బేస్‌ రేటుకే గృహ రుణాలను ఆఫర్‌ చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 189 గ్రామీణ శాఖల్లో గ్రామీణ రుణాలు అందుబాటులో ఉంటాయని ఐసిఐసిఐ బ్యాంక్‌ తెలిపింది.

 ఐసీఐసీఐ ప్రత్యేక ఆఫర్: బేస్‌రేటుకే గృహ రుణం

ఐసీఐసీఐ ప్రత్యేక ఆఫర్: బేస్‌రేటుకే గృహ రుణం

ఈ ప్రత్యేక రుణాలు దేశవ్యాప్తంగా ఉన్న 4,052 శాఖల్లో లభ్యమవుతున్నాయి. మూడేళ్ల నుంచి 20 ఏళ్ల లోపు కాలపరిమితి గల రుణాలకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని సభర్వాల్‌ పేర్కొన్నారు. రుణ కాలపరిమితి సమయంలో బేస్‌ రేటు మారితే అందుకనుగుణంగా వడ్డీ రేటులో కూడా మార్పు ఉంటుందని బ్యాంక్‌ తెలిపింది.

 ఐసీఐసీఐ ప్రత్యేక ఆఫర్: బేస్‌రేటుకే గృహ రుణం

ఐసీఐసీఐ ప్రత్యేక ఆఫర్: బేస్‌రేటుకే గృహ రుణం

గృహ నిర్మాణం, పాత ఇంటి మరమ్మతుల కోసం గ్రామీణ ప్రాంత వినియోగదారులు ఈ రుణాలను తీసుకోవచ్చని బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మహిళలకు బేస్‌రేటుకే గృహరుణాలు అందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+