పెట్టుబడి సాధనాల్లో బ్యాంకు డిపాజిట్లకు ప్రత్యేకమైన స్ధానం ఉంది. ఎందుకంటే బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు డిపాజిట్లు అన్నిటికన్నా సురక్షితమైనవిగా అందరూ భావిస్తుంటారు. అంతేకాదు మీరు బ్యాంకులో చేసిన డిపాజిట్లు ఎప్పుడు మీ చేతికి వస్తాయో ముందు తెలుస్తుంది కాబట్టి.
ఇదంతా బాగనే ఉంది. మీరు డిపాజిట్ చేసిన బ్యాంకు దివాలా తీయడం లేదా వేరే ఇతర బ్యాంకులో విలీనమైతే అప్పుడు మీ డిపాజిట్ పరిస్ధితి ఏంటనేది ఎప్పుడైనా ఆలోచించారా? అసలు దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బ్యాంకులో మీరు చేసిన డిపాజిట్లకు ఎవరు బాధ్యులో తెలుసుకుందాం.

బ్యాంకులో చేసిన డిపాజిట్లు సురక్షితమేనా?
సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వానికి అధిక వాటా ఉంటుంది. ఒక బ్యాంకు దివాలా తీసేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు కేంద్రం ఆ బ్యాంకును ఆర్ధికంగా బలంగా ఉన్న మరో బ్యాంకులో విలీనం చేస్తుంది. ఇలాంటి సందర్భంలో మీ డిపాజిట్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

బ్యాంకులో చేసిన డిపాజిట్లు సురక్షితమేనా?
దివాలా తీసే బ్యాంకులో రూ. లక్ష వరకు డిపాజిట్లుంటే వాటికి డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ (డీఐసీజీసీ) రక్షణగా ఉంటుంది. ప్రభుత్వ రంగం బ్యాంకులన్నీ ముందుగానే డీఐసీజీసీకి కొంత ప్రీమియం చెల్లించి ఈ బీమా చేస్తాయి. ప్రీమియం చెల్లించిన డిపాజిట్లకే బీమా రక్షణ ఉంటుందనేది గుర్తించాలి.

బ్యాంకులో చేసిన డిపాజిట్లు సురక్షితమేనా?
ఎఫ్ఎస్ఆర్ తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి రూ. 26 లక్షల కోట్ల విలువైన 134 కోట్ల డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా రక్షణగా ఉంది. ఇది మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 92 శాతం. అయితే ఒక బ్యాంకులో డిపాజిట్ దారుని పేరు మీద ఎన్ని డిపాజిట్లున్నా డీఐసీజీసీ బీమా మాత్రం ఒక్కదానికే వర్తిస్తుంది. అదే గనుక జాయింట్ ఖాతా అయితే ఇద్దరికి విడిగా రూ. లక్ష చొప్పున రూ. 2 లక్షల వరకు బీమా ఉంటుంది.

బ్యాంకులో చేసిన డిపాజిట్లు సురక్షితమేనా?
బ్యాంకు ఖాతాదారులు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి. ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు దని ఆర్ధిక పరిస్ధితిని గమనించాలి. మీరు డిపాజిట్ చేసిన బ్యాంకు ఇబ్బందుల్లో ఉందని భావిస్తే వెంటనే ఆ బ్యాంకు నుంచి డిపాజిట్లు వెనక్కి తీసుకొవడం మంచిది.


Click it and Unblock the Notifications