బంగారంలో పెట్టుబడి మంచిదేనా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. సాధారణంగా మన దేశంలో పెట్టుబడి లాభాల కోసం బంగారంలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య చాలా తక్కువ. అయితే గత రెండేళ్లుగా మార్కెట్‌లో బంగారం ధర ఒక్కసారిగా తగ్గింది.
దీంతో పెట్టుబడులన్నీ ఒకేచోట కాకుండా వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి బంగారం ఒక చక్కని మార్గం. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రుణ పత్రాలు, బ్యాంకు లేదా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఒడిదొడుకులకు లోనైనపుడు పెద్దగా నష్టపోయే అవకాశం లేని పెట్టుబడి బంగారం ఒక్కటే.
ఆర్ధిక మాంద్యాలు, సంక్షోభాలు వచ్చినా బంగారంలో పెట్టుబడులకు పెద్దగా ఇబ్బంది కలగదు. అందుకే ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడిలో కొంత మొత్తాన్ని అంటే 10 నుంచి 20 శాతం వరకు బంగారంలో మదుపు చేయడం మంచిది. దీంతో పాటు బంగారం ధర పెరిగి ఒక్కసారిగా 20 నుంచి 30 శాతం తగ్గినప్పుడు కొనుగోలు చేస్తే మంచిది.

బంగారంలో పెట్టుబడి: ఇదే రైట్ టైమ్?
ప్రస్తుతం భారత మార్కెట్‌లో బంగారం ధర ఆకర్షణీయంగానే ఉంది. 2013 ఆగస్టు 29న భారత మార్కెట్‌లో రికార్డు స్థాయిలో రూ.35,074 పలికిన 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు) ఇపుడు రూ.26,500 నుంచి రూ.26,600 మధ్య పలుకుతోంది.

బంగారంలో పెట్టుబడి: ఇదే రైట్ టైమ్?
అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 1,921 డాలర్ల నుంచి 1,170 డాలర్లకు దిగొచ్చింది. కరెంట్ ఖాతా లోటు జిడిపిలో ఒక శాతానికి దిగి వచ్చింది. దీంతో పుత్తడి దిగుమతులపై ఉన్న 10 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

బంగారంలో పెట్టుబడి: ఇదే రైట్ టైమ్?
ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే, మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర మరింతగా తగ్గొచ్చు. ఇదే అదునుగా తీసుకుని బంగారంలో పెట్టుబడులు పెడితే మంచిది. గ్రీస్ ఆర్ధిక సంక్షోభం భారత్ ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం చూపదని ఆర్ధిక నిపుణలు చెబుతున్నారు.

బంగారంలో పెట్టుబడి: ఇదే రైట్ టైమ్?
ఒకవేళ గ్రీస్ రుణ సంక్షోభం ప్రభావం యూరో జోన్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపితే పసిడి ధర మళ్లీ పెరిగెత్తే అవకాశం ఉంది. యూరోజోన్ నుంచి గ్రీస్ తప్పుకునే ఆలోచనలో ఉంది కాబట్టి అమెరికా డాలర్‌తో పోలిస్తే యూరో మారకం విలువ మరింతగా పడిపోయే ప్రమాదం ఉంది.

బంగారంలో పెట్టుబడి: ఇదే రైట్ టైమ్?
ఇదే గనుక జరిగితే బంగారం ధరలు ఒక్కసారిగా ఊపందుకుంటాయి. గ్రీస్ ఆర్ధిక సంక్షోభం భారత ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం చూపకపోయినా, రూపాయి మారకం విలుపై మాత్రం ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని మదుపరులు బంగారం లేదా గోల్డ్ ఇటిఎఫ్‌ల్లో మదుపు చేస్తే మంచిది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications