హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఉదయ్: పూర్తి వివరాలు
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో నివసించే ప్రజలను దృష్టిలో పెట్టుకుని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంస్థ ‘ఉదయ్' పేరిట ఒక ఎండోమెంట్ ప్లాన్ మార్కెట్‌లోకి తెచ్చింది. తక్కువ కాలం పాటు ప్రీమియం చెల్లించి, ఎక్కువ కాలం కవరేజ్ పొందే సదుపాయంలో ఇందులో ఉంది.
8 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే, 12 లేదా 15 ఏళ్ల పాటు కవరేజ్ ఉంటుంది. అదే గనుక 10 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే 15 ఏళ్ల పాటు కవరేజ్ లాంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ పాలసీలో కనీస నెలసరి ప్రీమియం రూ. 500 నుంచి వార్షిక ప్రీమియం రూ. 5000గా ఉంది.

మీరు చెల్లించే ప్రీమియంలు మధ్యలో కట్టకపోయినా, ఆటో కవరేజి వెసులుబాటు సౌకర్యం ఉంది. మెచ్యూరిటీ విలువను పెంచేందుకు మొదటి ఐదేళ్ల పాటు హామీ మొత్తంపై వార్షికంగా మూడు శాతం సొమ్ము జమ అవుతుంది. బోనస్‌లతో ప్రతి ఏటా పాలసీ విలువ పెరుగుతూ ఉంటుంది.
ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 18 సంవత్సరాలు కాగా గరిష్ఠ వయసు 55 సంవత్సరాలు. మెచ్యూరిటీ సమయంలో కనీస వయసు 30 సంవత్సరాలు కాగా గరిష్ఠ వయసు 70 సంవత్సరాలు. మెచ్యూరిటీ సమయంలో హామీ ఇచ్చిన మొత్తంతో పాటు అంతవరకు పాలసీకి జమ అయిన హామీ మొత్తాలు, బోనస్‌లు అన్నీ కలిపి ఏకమొత్తంగా చెల్లిస్తారు.
పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో మరణించినట్లైతే, అతని కుటుంబానికి డెత్ బెనిఫిట్‌గా హామీ ఇచ్చిన మొత్తంతో పాటు అంతవరకు పాలసీకి జమ అయిన హామీ మొత్తాలు, బోనస్‌లు కలిపి ఏకమొత్తంగా చెల్లిస్తారు.


Click it and Unblock the Notifications