లోన్: క్రెడిట్ స్కోరు ప్రాముఖ్యత ఏంటీ?
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఏదో అవసరం కోసం అప్పు చేస్తూనే ఉన్నారు. గతంలో అప్పు చేయడం అంటే ఏదో తప్పులా భావించేవారు. కానీ ఈ రోజుల్లో ఎంత అప్పు చేస్తే అంత గొప్ప. ఇటీవల కాలంలో బ్యాంకులు నుంచి అప్పు తీసుకునే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది.
అయితే బ్యాంకులు మాత్రం తమ వద్దకు లోన్ కోసం వచ్చే వారి 'క్రెడిట్ స్కోరు' చూసిన తర్వాత మాత్రమే పెద్ద మొత్తంలో రుణం ఇవ్వడం జరుగుతుంది. అసలు క్రెడిట్ స్కోరు అంటే ఏమిటి? దానిని ఎలా లెక్కిస్తారు అనేది తెలుసుకుందాం. ఎంత క్రెడిట్ స్కోరు ఉంటే బ్యాంకులు రుణం ఇచ్చేందుకు మొగ్గు చూపుతాయో చూద్దాం.
బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల నుంచి రుణం తీసుకోవాలనుకునే వారి రుణ అర్హతను తెలుపుతూ సిబిల్ ట్రాన్స్‌యూనియన్ అందించే మూడంకెల స్కోరునే క్రెడిట్ స్కోరు అంటారు. దీని పరిధి 300 నుంచి 900 వరకు ఉంటుంది. గతంలో బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల నుంచి రుణం తీసుకుని చెల్లింపులు చేస్తే దాని ఆధారంగా ఆయా వ్యక్తులకు ఈ స్కోరింగ్ ఇస్తుంది.

లోన్ తీసుకోవడంలో క్రెడిట్ స్కోరు ప్రాముఖ్యత ఏంటీ?
సాధారణంగా పర్సనల్ లోన్, కారు, హౌసింగ్ లోన్ లాంటి వాటికి రుణం మంజూరు చేయాలన్నా, క్రెడిట్ కార్డులు జారీ చేయాలన్నా దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరు తెలియజేయాలని సిబిల్ సంస్ధను అడుగుతాయి. స్కోరు ఎంత అధికంగా ఉంటే ఆ వ్యక్తి రుణ అర్హత అంత ఎక్కువగా పొందేందుకు అర్హుడు.

లోన్ తీసుకోవడంలో క్రెడిట్ స్కోరు ప్రాముఖ్యత ఏంటీ?
ప్రస్తుతం బ్యాంకులు దీనిని 750 కటాఫ్‌గా పెట్టుకున్నాయి. క్రెడిట్ స్కోరు 750 లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే రుణాలు మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ స్కోరు తగ్గడానికి కొన్ని కారణాలున్నాయి.

క్రెడిట్ కార్డు బిల్లులో ఎగవేత
క్రెడిట్‌కార్డు బిల్లును నిర్ణీత తేదీ నాటికి చెల్లించకపోవడం కూడా క్రెడిట్ స్కోర్‌ను దెబ్బ తీస్తుంది. ఈ ఇబ్బందిని నివారించాలంటే క్రెడిట్ కార్డుల చెల్లింపులకు సంబంధించిన అలర్ట్‌లు మొబైల్‌లో పెట్టుకుని వాటికి అనుగుణంగా నిర్ణీత తేదీ నాటికే బిల్లులు చెల్లించాలి.

రుణం పొంది సరైన సమయంలో చెల్లించక పోవడం
బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని పొందాక బకాయిలను ఏకమొత్తంగా ఏకకాలంలో చెల్లించేందుకు సెటిల్ చేసుకోవడం రుణ అర్హతను దెబ్బ తీస్తుంది. తొలుత వాయిదాలుగా బకాయిలను చెల్లించి, ఆ తర్వాత బ్యాంకుతో ఒక అవగాహనకు వచ్చి కట్టాల్సిన సొమ్ము ఏకకాలంలో చెల్లించిన వారి క్రెడిట్ స్టేటస్‌ను సిబిల్ రిపోర్ట్‌లో ‘సెటిల్డ్''గా సూచిస్తారు.

క్రెడిట్ కార్డు రుణ పరిమితి దాటడం
బ్యాంకులు క్రెడిట్ కార్డు వినియోగదారులకు క్రెడిట్ గరిష్ఠ పరిమితిని నిర్ణయిస్తాయి. ఎవరైనా ఆ గరిష్ఠ పరిమితిని దాటకూడదు. ఆ పరిమితికి చేరువయ్యే స్థాయి వరకు క్రెడిట్ ఉపయోగించుకోవడం కూడా అంత మంచిది కాదు.


Click it and Unblock the Notifications