ధూమపానం ఆర్ధికంగా హానికరం, అదెలా?
'ఆనందాన్ని ఎవరు కోరుకోరు.... కానీ ఎంత మూల్యానికి?'
'ఏమైంది ఈ నగరానికి ఓ వైపు నుసి.. మరోవైపు పొగ'
ఈ మాటలు ఎక్కుడో విన్నట్లు ఉంది కదా? భారత్‌లో ధూమపానాన్ని మానేయాల్సిందిగా సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలివి. ధూమపానం ఆరోగ్యానికి మాత్రమే నష్టాన్ని కలగజేస్తుందనుకుంటే పొరపాటు. ఆర్ధికంగా కూడా నష్టం.
ఉదాహరణకు ఒక సిగరెట్ ధర రూ. 10 అనుకుందాం. రోజుకు పది సిగరెట్లకు అయ్యే ఖర్చు రూ. 100. దీనిని బట్టి నెలకు రూ. 3000. సంవత్సరానికి రూ. 36,000. ఈ మొత్తాన్ని గనుక మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే వడ్డీతో పాటు ఆర్ధికంగా కూడా మెరుగవుతారు.

ధూమపానం మానేస్తే కలిగే ప్రయాజనాలు చూద్దాం:
* ధూమపానం మానేయడం వల్ల సంవత్సరానికి రూ. 36,000 నగదు సమాకూరుతుంది.
* ఐదేళ్లలో దాదాపు రెండున్నర లక్షల రూపాయలు మార్జిన్ మనీ జమ చేసుకొని, వీటికి తోడు రుణం తీసుకుని ఇల్లు లేదా కారు కొనుగోలు చేయొచ్చు.
* అదే పదిహేనేళ్లలో దాదాపు రూ. 18 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ డబ్బు మీ పిల్లలకు ఉన్నత చదువుల కోసం ఉపయోగ పడుతుంది.
* సరే పొగత్రాగని వారు ఈ మొత్తాన్ని జమ చేస్తున్నారా అని మీరు ప్రశ్నించవచ్చు. ఇల్లు, కారు, పిల్లల చదువు ఇలా ఏదో ఒక అవసరానికి కాకపోతే వేరే వాటికైనా ఈ సొమ్ముని ఉపయోగించవచ్చుకదా?
* సిగరెట్ ధరలు ప్రతి ఏడాదికీ పెరుగుతున్నాయి. ఆ ప్రకారం మీరు పొదుపు చేసుకుండూ వెళితే పెద్ద మొత్తంలో మీ వద్ద నగదు ఉంటుంది.
సిగరెట్లు త్రాగడం మానేస్తే వేలు, లక్షలే కాదు, కోట్ల రూపాయలు మీ సొంతం అవుతాయి. పొగ త్రాగడం వల్ల వచ్చే జబ్బులకు చికిత్స కోసం ఖర్చులను కూడా కలిపితే ఎంత పెద్ద మొత్తం అవుతుందో ఒకసారి ఊహించండి.


Click it and Unblock the Notifications