క్యాన్సర్ బాధితులను దృష్టిలో పెట్టుకుని హెచ్‌డీఎఫ్‌సీ ఓ సరికొత్త క్యాన్సర్ కేర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలి, మలి దశ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల ఈ తరహా పాలసీ తీసుకరావడం ఇదే తొలిసారని కంపెనీ పేర్కొంది.
ఎవరైతే ఈ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటారో, వారికి క్యాన్సర్ ఉందని తెలిసిన అనంతరం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాక క్యాన్సర్ చికిత్స కోసం క్రమం తప్పకుండా మొత్తాన్ని చెల్లించడం జరుగుతుందని తెలిపింది.
ప్రతి ఏడాది ప్రతిపాదించిన మొత్తంలో పది శాతం చొప్పున పెరగడం ఈ పాలసీ ప్రత్యేకత. ఉదాహరణకు 20 ఏళ్లకు 20 లక్షల పాలసీ కవర్ ఉండాలనుకునేవాళ్లు ఏటా సుమారు 1,800 రూపాయల ప్రీమియం చెల్లించాలి.
ఈ క్యాన్సర్ పథకాన్ని తీసుకున్న వారికి సెక్షన్ 80డి కింద ప్రీమియంపై పన్ను రాయితీలు వర్తిస్తాయి.

హెచ్‌డీఎఫ్‌సీ నుంచి క్యాన్సర్ కేర్ పథకం
పాలసీ గురించి వివరించేందుకు కంపెనీ ఎంపిఔస్ పేరిట ఒక యాప్‌ను విడుదల చేసింది.

హెచ్‌డీఎఫ్‌సీ నుంచి క్యాన్సర్ కేర్ పథకం
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలనుకునే వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్ చేసుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ నుంచి క్యాన్సర్ కేర్ పథకం
ఈ పాలసీలో సిల్వర్, గోల్డ్, ప్లాటినం అని మూడు రకాల ఆప్షన్లుంటాయి. 18-65 సంవత్సరాల మధ్య వయసున్నవారు పాలసీకి అర్హులు.

హెచ్‌డీఎఫ్‌సీ నుంచి క్యాన్సర్ కేర్ పథకం
పాలసీ టర్మ్ 10-20 సంవత్సరాలు. 10-40 లక్షల రూపాయల వరకు మొత్తం హామీని ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications