సగం ధరకే ఆన్‌లైన్ బీమా పాలసీలు
ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో సమూలంగా మార్పులు వచ్చాయి. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత, పేపర్ లెస్ టెక్నాలజీ బీమా కంపెనీలను పూర్తిగా మార్చివేశాయి. ఆన్‌లైన్‌లో బీమా పాలసీలను కొనుగోలు చేస్తే తక్కువ ధరకే పాలసీలు లభిస్తున్నాయి.
ఆన్‌లైన్ పాలసీలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ఏజెంట్ల వద్ద బీమా పాలసీలు తీసుకునే దానితో పోలిస్తే, ఆన్‌లైన్‌లో 50 శాతం తక్కువ ధరకే పాలసీలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. బీమా కంపెనీల నుంచి నేరుగా ఆన్‌లైన్‌లో పాలసీలను కోనుగోలు చేయడం వల్ల కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు, ఏజెంట్లకు చెల్లించాల్సిన కమిషన్ తదితరాలు కస్టమర్‌పై పడవు.
ఇక మరణాంతరం, ప్రమాదం, ఆరోగ్యం తదితరాలపై కస్టమర్‌కు ఇచ్చే హామీనే బీమా కంపెనీలు ప్రాతిపదికగా తీసుకుంటాయి. వీటితో పాటు ఆన్‌లైన్‌లో పాలసీల గురించి సమగ్ర విచారణం కూడా లభిస్తుంది.

ఆన్‌లైన్‌లో బీమా పాలసీ:
* పాలసీ గురించిన ఫీచర్లు, కాలపరిమితి, రైడర్లు తదితరాలన్నీ పోల్చి చూసుకునే సౌలభ్యం ఉంది.
* ఏజెంట్‌పై ఆధారపడకుండానే సులభంగా నిర్ణయం తీసుకోవచ్చు.
* పాలసీల గురించి, వారిని వాడుతున్న వారి స్పందన గురించి సులువుగా తెలుసుకోవచ్చు.
* పాలసీ క్లెయింల విషయంలో ఏ సంస్ధ ఎంత వేగంగా స్పందిస్తోందన్న సమాచారం కూడా తెలుసుకోవచ్చు.
* ఆన్‌లైన్‌లో పారదర్శకత ఉంటుంది. చెల్లింపులూ సులభం. తక్కువ ధరకే పాలసీలు లభ్యం.


Click it and Unblock the Notifications