సరైన ఆర్ధిక ప్రణాళికతో జీవితం సుఖమయం
మన జీవితంలో పరిస్ధితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాబట్టి మనం ఇప్పుడు కావాలని అనుకున్నది కొన్నేళ్ల తర్వాత అక్కర్లేదనిపించవచ్చు. దీనికి అనుగుణంగా మన ఆర్ధిక ప్రణాళిక ఉండాలి. మారుతున్న ఆర్ధిక పరిస్ధితి, లక్ష్యాలు, ఖర్చులు, పొదుపు-పెట్టుబడులు కూడా ఎప్పటికప్పుడు మారుతుంటాయి.
మనిషి ఆశాజీవి. కోరికలు, ఆశయాల్లో మార్పులు సహజం. అందుకే మనం వేసుకునే ఆర్ధిక ప్రణాళికల్లో కూడా ఇది ఉండాలి. ఉద్యోగం, వ్యాపారం ప్రారంభించిన కొత్తలో ఆదాయం తక్కువగా ఉంటుంది. అయితే అనుభవం పెరుగుతున్న కొద్దీ ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది.

ఆదాయం మారాలి:
ఉదాహరణకు వేతన జీవులకు బోనస్, పదోన్నతి, జీతాలు పెరగడం లాంటివ ఉంటాయి. దీని వల్ల ఖర్చులు పోగా ఎక్కువ మొత్తంలో మిగులు ఉంటుంది. దీనిని బట్టి పెట్టుబడులను ఎప్పటికప్పుడు మీ ఆర్ధిక ప్రణాళికను సమీక్షించుకోవాలి. వివాహం జరిగినప్పుడు, పిల్లలు జన్మించినప్పుడు ఖర్చులు పెరుగుతాయి. ఇలాంటి సందర్భంలో కొత్త ఆర్ధిక ప్రణాళికలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎక్కువ ఆదాయం వచ్చే వాటిల్లో పెట్టుబడి పెట్టాలి.
ఎక్కువ రాబడి వచ్చే వాటిల్లో మదుపు:
మంచి రాబడి రావాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులు ఎంతైనా అవసరం. ఇందుకోసం గాను ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత పథకాలను ఎంచుకుంటే మంచిది. ఒక దశ దాటిన తర్వాత ఈక్విటీల్లో వచ్చిన లాభాలను డెట్ పథకాల్లోకి మళ్లించాలి. దీని వల్ల మీకొచ్చిన లాభాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
మంచి పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి:
పెట్టుబడి పథకాలను ఎంచుకునేటప్పుడు దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇతర కారణాల వల్ల అవి అందించే రాబడి విషయంలో తేడా ఉండొచ్చు. అందుకే అధిక రాబడి ఇవ్వనటువంటి పథకాలను వదిలించుకోవాలి.


Click it and Unblock the Notifications